top of page

త్వరలో 1998 అభ్యర్థుల నియామకాలు

త్వరలో 1998

అభ్యర్థుల నియామకాలు.

టెట్ డైరెక్టర్ మేరీ చంద్రిక


మచిలీపట్నం : రాష్ట్ర ప్రభుత్వం 1998 అభ్యర్థుల నియామకాలు త్వరలో చేపడుతుందని టెట్ డైరెక్టర్ మేరీ చంద్రిక అన్నారు. సోమవారం డీఈవో కార్యాలయంలో 1998 అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోజుకు 100 మంది అభ్య ర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తున్నారన్నారు. సోమవారం డీఈవో కార్యా లయ సమావేశపు హాలులో అభ్యర్థుల సర్టిఫికెట్లను ఆమె పరిశీలించారు. రుక్మిణిబాయి అనే అభ్యర్థిని టైమ్ స్కేలు పనిచేస్తానని విల్లింగ్ ఇవ్వక పోవడంతో ఆమె పేరు ఎంపికైన అభ్యర్థుల జాబితాలో లేకపోవడంతో నిరాకరించారు. విజయవాడకు చెందిన 65 ఏళ్ల వృద్ధుడు ఎన్. వెంకటేశ్వర రావు ఉద్యోగం ఇప్పించాలంటూ దరఖాస్తు పట్టుకుని తన కుమారుని సాయంతో డీఈవో కార్యాలయానికి వచ్చారు. 1960 జూన్ 1వ తేదీ పుట్టిన తేదీగా ఉన్న అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించి వెంకటేశ్వరరావు | దరఖాస్తును తిరస్కరించారు. ఏడీ అజీజ్, ప్రధానోపాధ్యాయులు వైవీ హరనాథ్ తదితరులు పాల్గొన్నారు.


 
 
 

Comments


bottom of page