🚨 ఏపీ హెడ్మాస్టర్లకు బిగ్ అప్డేట్! 874 పీఎం శ్రీ పాఠశాలల్లో APOSS స్టడీ సెంటర్లు!
🔥 కొత్తగా 187 స్టడీ సెంటర్ల ఏర్పాటు – ప్రతి పాఠశాలలో కనీసం 50 అడ్మిషన్లు తప్పనిసరి!
📢 ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ పరిధిలోని పీఎం శ్రీ (PM SHRI) పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 874 పీఎం శ్రీ ఉన్నత పాఠశాలలను ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ (APOSS) అధ్యయన కేంద్రాలుగా గుర్తిస్తూ ఆ సంస్థ డైరెక్టర్ ఆర్. నరసింహారావు ఉత్తర్వులు జారీ చేశారు.