Search Results
Search this site
738 results found with an empty search
- కౌశల్ స్క్రీనింగ్ టెస్ట్ వివరాలివే!
కౌశల్ పరీక్ష-2024 స్కూల్ నుండి దరఖాస్తు చేసిన ప్రతి 8 వ తరగతి విద్యార్థి తప్పకుండా రేపు అనగా20/11/24 వ తేదీ తప్పక ఎగ్జామ్ రాయాలి Exam link https://bvmap.codetantra.com/login.jsp USER ID:Hall ticket number@bvmap.org Example *2445671004@bvmap.org* Password: *koushal24* Exam dates *8th class* *:20-11-2024* 9th class:21-11-2024 10th class:22 -11-2024 Time *ఉదయం10 to 12* గంటల వరకు 1. *ప్రారంభించినప్పటి నుంచి ఒక గంట వరకు ఎగ్జామ్ రాయవచ్చు, తర్వాత ఆటోమేటిగ్గా క్లోజ్* అవుతుంది 2. ఎగ్జామ్ రాసే ముందు ఆ సెల్ లో ఏ విండోస్ ఏ టాప్స్ ఓపెన్ చేసి ఉండకూడదు 3. ఎగ్జామ్ రాస్తూ split స్క్రీన్ కానీ వేరే సైట్ కానీ ఓపెన్ చేస్తే వెంటనే క్లోజ్ అవుతుంది 4. *20 వ తేదీ ఎగ్జామ్ 8వ తరగతి వారికి మాత్రమే* 5. ఒకేసారి రెండు సెల్లులో, ఒకే హాల్ టికెట్ నెంబర్ తో ఓపెన్ చేయకూడదు 6. మాక్ టెస్ట్ కి ఉపయోగించిన లింకు, యూజర్‌నేమ్, పాస్వర్డ్, ఈరోజే ఎగ్జామ్ కి కూడా అవే 7. క్విజ్ కి, పోస్టర్ కి అప్లై చేసిన ఐదుగురు విద్యార్థులు కూడా ఎగ్జామ్ రాయాలి 8. మాక్ టెస్ట్ రాయన వారు కూడా రేపు ఎగ్జామ్ డైరెక్ట్ గా వ్రాయవచ్చు
- విద్యాశాఖలో చిత్రం భళారే విచిత్రం
విద్యాశాఖలో భళారే విచిత్రం ప్రవీణ్ ప్రకాష్ లాంటి వ్యక్తి విద్యా శాఖ నుంచి నిష్క్రమిస్తే ప్రభుత్వ పాఠశాలలు బతికి బట్టకడతాయని, ఉపాధ్యాయులు కొన్ని నిముషాల పాటైనా ఆక్సిజన్ పీల్చుకోవచ్చని అందరూ భావించారు. పాఠశాలల్లో విద్యాబోధన మూడుపూవులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది భావించారు. అధికారుల మితిమీరిన జోక్యం వల్ల మరుగున పడిన బోధనను తిరిగి కొనసాగించవచ్చని ఉపాధ్యాయ లోకం కళ్ళకు వత్తులు వేసుకుని చూసింది. ఐదు నెలల కిందట రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరాక అందరూ ఆదిశగా ఆశపడ్డారు. అయితే పేరుకు ప్రవీణ్ ప్రకాష్ వెళ్ళిపోయాడు కానీ ఆయన నాటిన విత్తనాలు ఇపుడు మొలకెత్తాయి. ఉపాధ్యాయులను వేపుకుతినే కార్యక్రమాన్ని నిరాఘాటంగా కొనసాగించడానికి వారు ఉద్యుక్తులవుతున్నారు. గత ప్రభుత్వంలో పురుడుపోసుకున్న యాపులకు తోడు మరిన్ని టపాలు రావడం, పాఠశాలల్లో ఉపాధ్యాయుల సమయపాలనకు కొత్త నిబంధనలు తీసుకురావడం, ఉపాధ్యాయులకు చట్టబద్ధంగా సంక్రమించిన క్యాజువల్ లీవుల మంజూరులో నిబంధనలు సృష్టించడం, హైస్కూల్ ప్లస్ స్కూళ్ల పని గంటలను హెచ్చించడం, రెసిడెన్షియల్ శిక్షణ, వీటన్నిటికీ తోడు పైలట్ ప్రాజెక్టు కింద పాఠశాల సమయాన్ని సాయంత్రం 5 గంటల దాకా హెచ్చించటం వంటి తిరోగమన విధానాలు అమలు చేయబోతున్నారు. ఈనేపథ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పాఠశాలల పని వేళల్ని పరిశీలిద్దాం! ప్రత్యేకించి దక్షణాది రాష్ట్రాల్లోనే కాకుండా అక్షరాస్యతలో దేశంలోనే అగ్రస్థానంలో వున్న కేరళలో ఉదయం 9.10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు, కొన్ని పాఠశాలలు 10 నుంచి 4 గంటల వరకు, ఉన్నత పాఠశాలల్లో 7.30 నుంచి 1.30 వరకు నిర్వహిస్తారు. విరామ సమయం తీసేస్తే అన్ని పాఠశాలల గరిష్ట పని వేళలు ఐదు గంటలు మాత్రమే! తెలంగాణలో ఉదయం 9 నుంచి 4.15 వరకు నిర్వహిస్తున్నారు. అలాగే తమిళనాడులో ఉదయం 9.నుంచి సాయంత్రం 4.10 వరకు నిర్వహిస్తారు. విద్యార్థుల్లో గ్లానీ ఏర్పడకుండా 5 పీరియడ్లకు పరిమితం చేసారు. అంతేకాకుండా ప్రతి పీరియడ్ కు మధ్య 10 నిముషాల విరామం ఇచ్చారు. కర్ణాటకలో 8 నుంచి 1.30 వరకు, పాఠశాలలు నిర్వహిస్తారు. ఉత్తరాది రాష్ట్రాల్లో అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో 9.30 నుంచి 3.30 వరకు నిర్వహిస్తున్నారు. అత్యంత నాణ్యతా ప్రమాణాలతో విద్యాబోధన నిర్వహిస్తున్న ఢిల్లీలో కూడా ఇటువంటి విపరీత ధోరణులు లేవు. ఉపాధ్యాయులను మానసికంగా ఎలా చిందరవందర చేయాలా అనే అత్యుత్సాహం తప్ప బోధనలో నాణ్యతా ప్రమాణాలు ఎలా ప్రోది చేయాలా అనే లక్ష్యాల కనుచూపు మేరలో కనిపించడం లేదు. పూర్తి స్థాయిలో ఉపాధ్యాయ నియామకాలు జరిపి పని వత్తిడి తగ్గించడమెలాగనే తార్కిక పునర్విమర్శకు బదులు గొడ్డు చాకిరిని ఎలా చేయించాలనే విధ్వంస పథక రచన జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో పని వేళలు పెంచడానికి పైలట్ ప్రాజెక్టు చేపట్టడంలోని ఔచిత్యమేమిటి? ఇదొక భేతాళ ప్రశ్న! మానవ మేధస్సును చిదిమేసే ప్రక్రియ అది. పనివేళల హెచ్చింపు అనివార్యమని ప్రభుత్వం భావిస్తే తద్వారా సాధించదలచుకున్న లక్ష్యాలను చదువు చెప్పే ఉపాధ్యాయులకు మున్ముందు తెలియజెప్పాలి. అలా కాకుండా ఒక రహస్య అజెండాతో ముందుకెళ్లడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. పాఠశాల పని వేళలు ఎలా ఉండాలనేది విద్యార్థుల్లో అభ్యసన సంసిద్ధత, మానసిక పరిపక్వత, స్థానిక పరిస్థితులు, రవాణా సౌకర్యాలు, ప్రజల జీవన విధానం వంటి అనేక అంశాలు ప్రతిక్షేపిస్తాయి. 70 శాతానికి పైబడి గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రామాణికంగా తీసుకొని ప్రయోగాలు చేయాలి తప్ప అన్ని వసతులు కలిగిన పట్టణ ప్రాంతాలను బేరీజు వేయకూడదు. ఇప్పటికే ఆంగ్ల మాధ్యమ ప్రభావంతో తీవ్ర మానసిక వత్తిడి వల్ల విజ్ఞానం సన్నగిల్లి వస్తున్న అత్తెసరు ఫలితాలకు విరుగుడు కనుక్కోవాలి. పరిశోధన, విశ్లేషణ ఉత్తమ ఫలితాలకు మార్గం సుగమం చేస్తాయి తప్ప ఉపాధ్యాయులను చాకిరేవులో ఏకి పారేస్తే సాధ్యం కాదు. ఏడున్నర దశాబ్దాల కాలంలో ఇలాంటి విపత్కర పరిస్థితిని విద్యారంగం చవి చూడలేదు. ఇదొక అప్రకటిత ఎమర్జెన్సీ. ఉపాధ్యాయులపై ముప్పేట దాడి. అనుకూలమైన బోధనా సమయాన్ని యాపుల నిర్వహణకు, ట్రెయినింగులకు కుదువ బెట్టి విద్యా బోధనను కుంగదీసే వ్యవహారానికి మంగళ పడాల్సిన అవసరం వుంది. మీదు మిక్కిలి ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత అవసరాలకు సెలవు తీసుకునే అవకాశాన్ని కూడా అధికారుల చెప్పుచేతల్లోకి తీసుకొంటున్నారు. ఉపాధ్యాయుడు కూడా ఒక సంఘజీవి. వారికి భౌతిక అవసరాలుంటాయి. వారిలో కూడా చీమూ నెత్తురు ప్రవహిస్తుంటుంది. వారికి కుటుంబాలుంటాయి. వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య అవసరాల కోసం, తకు జ్వరమో, తలనొప్పి వచ్చినా సెలవు వచ్చినా సెలవు పెట్టుకోవడానికి అధికారుల కాళ్ళు మొక్కాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు. ఇటీవల జరిగిన సమావేశంలో పాఠశాల లేదా మండలం యూనిట్ గా తీసుకున్నపుడు 10 శాతానికి మించి సెలవు మంజురుచేయవద్దని ఆదేశించారు. మెడ మీద తల వుండే వారు చెబుతారా ఇలా. ఉన్నత స్థానాల్లో వున్న వారు చట్టంతో పాటు మానవేయకోణంలోనూ ఆలోచించాలి. భౌతిక అవసరాలు ఎవరికీ చెప్పి రావు. అందుకోసమే ఆకస్మిక సెలవు (క్యాజువల్ లీవ్). అలాగని ఉపాధ్యాయులు బాధ్యతారహితంగా పాఠశాలలకు ఎగనామం పెట్టరు కదా! మరి సెలవు హక్కు కాదనడం ఏంటి? ఉపాధ్యాయులకు కనీస మానవ హక్కులు కూడా వర్తించకుండా ప్రతిబంధకాలు సృష్టించడమేంటి?? వ్యవస్థలను బలోపేతం చేసే సంస్కరణలను స్వాగతించాల్సిందే! కానీ అవి మొదటికి మోసం తెచ్చేవి కాకూడదు. అసంబద్ధ విధానాలకు స్వస్తి పలికి ఆచరణాత్మక, తులనాత్మక శాస్త్రీయ విధానాల బాటలో ముందుకెళ్లడం సర్వత్రా శిరోధార్యం! - మోహన్ దాస్, ఎపిటీఎఫ్ రాష్ట్ర నాయకులు.
- జీర్ణకోశం ఆరోగ్యంగా ఉండాలంటే !
#guthealth #digestive ఛాతీ మంట, దీర్ఘకాల మలబద్ధకం, పేగు పూత.. వంటి జీర్ణకోశ సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. వీటిల్లో కొన్నింటికి మందులు వేసుకోవాల్సి ఉంటుంది. కొన్నింటికి శస్త్రచికిత్స అవసరమవ్వచ్చు. కానీ కొన్ని మాత్రం జీవనశైలి మార్పులతోనే చక్కబడొచ్చు. జీర్ణకోశ సమస్యలేవీ లేకపోయినా కొన్ని అలవాట్లతో పేగులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. సరైన వేళకు సరైన పదార్థాలు పేగుల ఆరోగ్యానికి అన్నింటికన్నా ముఖ్యమైనది ఇదే. పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందటానికి సమతులాహారం కీలకం. పండ్లు, కూరగాయలు, నిండు గింజ ధాన్యాలు ఎక్కువగా.. మాంసం, ప్రాసెస్డ్ ఫుడ్స్ తక్కువగా తినటం మంచిది. క్యాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలను అందించే పాలు, మజ్జిగ, పెరుగు వంటివీ మేలే. లాక్టోజ్ పడనివారు మాత్రం పాల పదార్థాలకు దూరంగా ఉండాలి. రోజూ తగినంత పీచు లభించేలా చూసుకోవటమూ ముఖ్యమే. మగవారు రోజుకు 38 గ్రాములు, ఆడవారు 25 గ్రాముల పీచు తినాలని మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. ఎప్పుడు తింటున్నామనేదీ ప్రధానమే. ఉదాహరణకు- ఛాతీలో మంటతో బాధపడేవారు పడుకోవటానికి కనీసం 2 గంటల ముందే రాత్రి భోజనం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఒకేసారి ఎక్కువెక్కువ కాకుండా తక్కువ తక్కువగా ఎక్కువ సార్లు తినటమూ ఉపయోగపడుతుంది. విసర్జన మార్పులపై దృష్టి మల విసర్జన తీరుతెన్నులు ఆరోగ్యం గురించి విలువైన సమాచారాన్ని ఇస్తాయి. ఎప్పుడో అప్పుడు నీళ్ల విరేచనాలు అవటం మామూలే. దీనికి చింతించాల్సిన పనిలేదు. కానీ తరచూ విరేచనాలు అవుతున్నా, నాలుగైదు రోజుల వరకూ తగ్గకున్నా ఏదో తేడా ఉందని అనుమానించాలి. మలంలో రక్తం పడటం, రాత్రిపూట విసర్జన కోసం మేల్కోవటం, విరేచనాలతో పాటు బరువు తగ్గటం లాంటివి సిలియక్ డిసీజ్, పేగు పూత, పేగు ఇన్ఫెక్షన్ వంటి సమస్యలకు సంకేతాలు కావొచ్చు. విసర్జనలో మార్పులు లేకపోయినా 45 ఏళ్లు దాటాక పెద్దపేగు ముందస్తు పరీక్ష (కొలనోస్కోపీ) అవసరం. యాభై ఏళ్లు పైబడటం, మగవారు కావటం, పొగ తాగటం, ఊబకాయం, ఛాతీలో మంట వంటి ముప్పు కారకాలు గలవారు అన్నవాహిక క్యాన్సర్ ముందస్తు పరీక్ష కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. బద్ధకం వీడాలి శారీరకంగా చురుకుగా ఉండటం పేగు ఆరోగ్యానికి కీలకం. మలబద్ధకం గలవారికిది మరింత ముఖ్యం. ఎంత ఎక్కువగా శ్రమ చేస్తే అంత ఎక్కువగా పేగులు కదులుతాయి. పెద్ద పేగు ద్వారా ఆహారం త్వరగా ముందుకు కదలటానికి వ్యాయామం తోడ్పడుతుంది. మల బద్ధకం, కాలేయ కొవ్వు తగ్గటానికే కాకుండా పేగుల్లో సూక్ష్మక్రిముల వైవిధ్యానికీ, మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందటానికీ వ్యాయామం దోహదం చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజుకు అరగంట చొప్పున వారానికి మూడు రోజులు తీవ్ర వ్యాయామం చేయటం మంచిదన్నది నిపుణుల సూచన. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే ప్రతిరోజూ అరగంట సేపు నడిచినా మంచిదే. వీలైనంత వరకూ రోజులో ఎక్కువసేపు కదిలేలా చూసుకోవటం ముఖ్యం. తగినంత నీరు మన శరీరంలో చాలా వ్యవస్థలు నీటితోనే ముడిపడి ఉంటాయి. నీరు తగ్గితే జీర్ణక్రియ సరిగా సాగదు. కాబట్టి తగినంత నీరు, ద్రవాలు తీసుకోవాలి. పీచుతో పాటు తగినంత నీరు తీసుకుంటే మరింత మంచి ఫలితం కనిపిస్తున్నట్టు కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నారు. అవసరమైన మేరకు నీళ్లు తాగితే పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది కూడా. అలాగే కృత్రిమ తీపి పదార్థాలతో చేసిన పానీయాలకు దూరంగా ఉండాలి కూడా. కృత్రిమ తీపి పదార్థాలతో పేగుల్లో బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతింటోందని అధ్యయనాలు చెబుతున్నాయి. మరీ తీయగా ఉండాలనుకుంటే తేనె వంటి సహజ పదార్థాలు ఎంచుకోవాలి. మద్యం, నొప్పి మందులు పరిమితం మద్యం, ఎన్ఎస్ఏఐడీ రకానికి చెందిన నొప్పి మందులు పేగులకు హాని చేస్తాయి. మద్యం కాలేయానికి హాని తల పెట్టటమే కాదు.. నేరుగా జీర్ణాశయం, పేగుల మీదా ప్రభావం చూపుతుంది. అతిగా మద్యం తాగిన మర్నాడు చాలామంది కడుపునొప్పి, విరేచనాలతో బాధపడటం చూస్తూనే ఉంటాం. ఇటీవలి కాలంలో మద్యం అతిగా తాగినవారిలో జీర్ణాశయం ఉబ్బుతున్నట్టు ఎండోస్కోపీ పరీక్షలో కనిపిస్తోందనీ నిపుణులు చెబుతున్నారు. మద్యం విషయంలో ఆరోగ్యకరమైన పరిమితి అంటూ ఏదీ లేదు. అసలు దీని జోలికి వెళ్లకపోవటం ఉత్తమం. ఒకవేళ అలవాటుంటే పరిమితి పాటించాలి. ఎప్పుడో అప్పుడంటే ఏమో గానీ మాటి మాటికీ నొప్పి మాత్రలు వేసుకుంటే జీర్ణాశయంలో, పేగుల్లో వాపు పక్రియ ప్రేరేపితమవుతుంది. పేగుల్లో పుండ్లు పడొచ్చు. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
- ఏపీ టీచర్స్ బదిలీలు - తాజా సమాచారం
#apteacherstransfers (3) బదిలీలకు సంబంధించి ప్రతి సంవత్సరం మే 31 నాటికి బదిలీల ప్రక్రియ పూర్తి అవుతుంది. ప్రతి సంవత్సరం జూన్ 1 నుండి మే 31 వరకు అకడమిక్ ఇయర్ గా పరిగణిస్తారు. బదిలీలకు కనిష్ట, గరిష్ట కాల పరిమితులు - ఎసిటి / స్కూల్ అసిస్టెంట్ తత్సమాన క్యాడర్లకు మినిమమ్ 2 సం॥లు మాగ్జిమమ్ 8 సం||లు - గజిటెడ్ హెడ్మాష్టర్లకు మినిమమ్ 2 సం॥లు - మాగ్జిమమ్ 5 సం||లు స్టేషన్ పాయింట్లు : హెచ్‌ఎన్‌ఏ ఆధారంగా పాఠశాలలను నాలుగు కేటగిరీలుగా విభజిస్తారు. వీటి ఆధారంగా స్టేషన్ పాయింట్లు నిర్ణయిస్తారు. కేటగిరీ-ఏ : 16% హెచ్ఎస్ఏ కలిగిన ప్రాంతాలు -కేటగిరీ-బి : 12% హెచ్ఎస్ఏ కలిగిన ప్రాంతాలు -కేటగిరీ-సి : 10% హెచ్ఎస్ఏ కలిగి 5వేలుకంటే ఎక్కువ జనాభా కలిగిన హేబిటేషన్లు / గ్రామ పంచాయితీలు -కేటగిరీ-డి : 10% హెచ్‌ఎన్‌ఏ కలిగి 5వేలుకంటే తక్కువ జనాభా కలిగిన హేబిటేషన్లు / గ్రామ పంచాయితీలు సర్వీస్ పాయింట్లు : ప్రతి ఒక సంవత్సరం సర్వీస్‌కు ఒక పాయింట్ చొప్పున సర్వీస్ పాయింట్లు కేటాయిస్తారు. మినహాయింపులు: 100% Visually Handicapped 70% Orthopedically Handicapped 2, 3 సం॥లలోపు రిటైర్మెంట్ కలిగిన వారికి బదిలీల నుండి మినహాయింపు ఇవ్వాలని సంఘాలు కోరాయి. స్పెషల్ కేటగిరీ : ఈ క్రింది స్పెషల్ కేటగిరీ ఉపాధ్యాయులకు 5 పాయింట్ల చొప్పున అదనపు పాయింట్లు ఇవ్వాలని 2. (1) Un married female above 40 years age, (2) Spouse cases, (3) Phisically Handicapped 40% to 69%, (4) Diveroced women with dependent children under the age of 15 years (5) Single men with dependent children under the age of 15 years (6) NCC teachers (7) Spouse working in defenece services (8) Ex-service men (min 15 years service) (9) Recognized associations (State 10 points, District 5 points) ప్రిఫరెన్షియల్ కేటగిరీ : గతం కంటే ప్రిఫరెన్షియల్ కేటగిరీలు తగ్గించాలని నిర్ణయించారు. ఈ క్రింది కేటగిరీలు ప్రిఫరెన్షియల్ కేటగిరీలుగా పరిగణిస్తారు. (1) 70%, అంతకంటే ఎక్కువ అంగవైకల్యం కలిగినవారు (2) తీవ్రమైన వ్యాధులతో ఇబ్బంది పడేవారు (క్యాన్సర్, బ్లడ్ డయాలసిస్, ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్) (3) తీవ్రమైన వ్యాధులతో ఇబ్బంది పడుతున్న మరియు మెంటల్లీ రిటార్డెడ్ ఆధారిత పిల్లలు / స్పౌజ్ మైనస్ మార్కులు : POSCO చట్టం పెట్టబడిన వారు, డిసిప్లినరీ యాక్షన్‌కు గురైనవారికి పాయింట్ల తగ్గింపు ఉండాలని ప్రతిపాదన. (4) బదిలీలు, ప్రమోషన్లు షెడ్యూల్: బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించి షెడ్యూల్ ఈ క్రింది విధంగా ఉండేలా రూపకల్పన చేయాలని ఆలోచిస్తున్నారు. (1) TIS అప్డేషన్ - డిసెంబర్ 20 నుండి ఫిబ్రవరి 10లోపు (2) సీనియార్టీ లిస్టుల తయారీ ఫిబ్రవరి 15 నుండి మార్చి 15లోపు (3) ໙໖໖ - హెడ్మాష్టర్లు- ఏప్రిల్ 10 నుండి 15లోపు, స్కూల్ అసిస్టెంట్లు ఏప్రిల్ 21 నుండి 25లోపు ఎస్ టిలు - మే 1 నుండి 10లోపు (4) ప్రమోషన్లు - హెడ్మాష్టర్లు ఏప్రిల్ 16 నుండి 20లోపు, స్కూల్ అసిస్టెంట్లు ఏప్రిల్ 26 నుండి 30లోపు (5) డిఎస్సి రిక్రూట్మెంట్ - మే 11 నుండి 30లోపు
- స్కూల్ టీచర్స్ నేటి ముఖ్య వార్తలు
ఆధార్ లోని DOB తో విద్యార్థుల School Record DOB టాలీ కాక HIgh school HM లకు అపార్ కష్టాలు "అపారం". అది ఏదో చిటికెలో అయిపోయే దానిలా అధికారులు HMలను ఒత్తిడి చేసి తీవ్ర మానసిక వేదనకు గురి చేస్తున్నారు. ➡️ ఆధార్ లలో మార్పులకు తల్లి దండ్రులు కూలీ పనులు మానుకొని వెళ్ళటం లేదు ➡️18యేళ్ళు నిండితేనే ఆధార్ లో date of birth మార్పు జరుగును అంటున్న ఆధార్ సెంటర్లు ➡️ఆధార్ లోDOB గా Year మాత్రమే ఉన్న వాటిని స్కూల్ రికార్డు లోని DOB లో Year మ్యాచ్ అయితే HM ఇచ్చేCertifucate ఆథారంగా Date of Birth ను మారుస్తారు.అదే విధంగా పేరు లో కూడా మార్పులు జరుగుచున్నవి ➡️ఆధార్ సెంటర్ల లో 500 నుండి రు1000 లు వసూలు చేస్తున్నారు ➡️ఆధార్ లో చేసిన మార్పులు కనపడటానికి కనీసం15 రోజులు పడుతుంది ➡️ ఆధార్ సెంటర్ల లో పెట్టిన అప్లికేషన్లలలో ఎక్కువ Reject అగుచున్నవి ➡️ ఆధార్ డేటా ను Proof గా తీసుకొని School Data ను మార్చరాదు ➡️PS లలో Record Sheet లేకుండా Parent Declaration తో First level Admission Forms ఉంటాయి కనుక Parents ను ఒప్పించి Aadhar లోని Data ను School Records లో Reflect అయ్యేలా చూసుకొంటున్నారు కనుక Apar Id creation % చాలా ఎక్కువగా ఉన్నది.అదే HS లలో Record Sheets /TC లతో Admissions కనుక అలా మార్చటం కుదరదు ➡️www.gunturbadi.in లో Apar id కోసం Parents ను Aadhar updation చేసుకొనమని సమాచార పత్రం, School Data పై HMcertificate,School Records correction చేస్తూ HM procs, Parent letter నమూనా లు ఉన్నవి. 👉బదిలీలు , పదోన్నతులు పై శాశ్వత చట్టం తయారీ పనిలో విద్యాశాఖ ➡️ 50 యేళ్ళనుండి బదిలీలపై శాశ్వత చట్టాలపై ఆశలు....నెరవేరేనా? గతంలో ఇచ్చిన కోర్టు తీర్పులన్నీ కొత్త చట్టంలో అమలు చేస్తే నే సాధ్యం .లేకపోతే మరల కోర్టుల పాలు ➡️ 6-8 తరగతులలో 30 కంటే తక్కవ రోలు ఉన్న UP లకు PS లుగా రివర్షన్.అదే 60 కంటే ఎక్కువ రోలు ఉంటేUP నుండి H S గా ప్రమోషన్ ➡️3-5 తరగతులు HS లలో విలీనం పై "పీఛేమూడ్" . మోడల్ PS లలో చిన్న PS ల విలీనం SA నుండి LFL HM పోస్టులకు కన్వర్షన్ ➡️ 100 కంటే ఎక్కువ రోలు ఉన్న PS లు మోడల్ స్కూల్ ➡️PS లలో TPR 1:30 HS లలోTPR1:35 ➡️ ఏ Preferential కేటగిరీ వారైనా సర్వీసులో ఒక్క సారే 8 యేళ్ళు కేటగిరీ I&II లలో పని చేస్తారు . ➡️ Min 2 years Max 8 years (For HMs 2 years) ➡️ ఈ నెలాఖరు లోగా Draft G.O &DSE నుండి ప్రభుత్వానికి ప్రతిపాదనలు ➡️ ప్రతి వారం సంఘాలతో సమావేశము నిర్వహించి Updates ఇవ్వటం అభినంద నీయం Wait For more info 👉 SC వర్గీకరణ(A,B,C.) కోసం One man కమీషన్ 60 రోజులలో రిపోర్టు ఇవ్వాలి. ఈవర్గీకరణ తేలేదాకా మెగా నియామకాల క పదోన్నతుల కౌన్సిలింగ్ లు ఉండకపోవచ్చును 👉DEC 5 న మెగా పేరెంట్స్ మీటింగ్ ఆ మీటింగ్ లో మెర్జింగ్, మీడియం లపై నిర్ణయాలు? 👉 ఈ నెల 19&20 తేదీలలో School complex 👉 క్రమేణా ప్రవీణ్ ప్రకాష్ ను తలపించేలా ఉపాధ్యాయులపై రాష్ట్ర అధికారులు" అత్యవసర అనవసర ఒత్తిడి" పెరుగు చూ ఉన్నది. Apar Id ,FA 2 మార్కుల ఎంట్రీ పై క్రింది స్ధాయి అధికారులను తీవ్ర ఒత్తిడి కి గురి చేస్తున్నారు. ఈహడావుడి తో HM scrutiny లేకుండానే Marks Upload అవుతున్నాయి.IMMS app లోTeachers వేసిన మార్కులు HM లకు కనపడవు .కేవలం Report మాత్రమే వస్తుంది . 👉క్రొత్త MDM Menu పై State Level లో Zone వారీగా Menu పై ఉత్తర్వులు వచ్చేదాకా ఆగాలి.బహుశా Dec 1 నుండి అమలు? 👉 Pending S L,PFA PGLI,EEL బిల్లుల సొమ్ము Feb2025 తర్వాత Priority లో Rs 20000 కోట్ల పైగా Pending Bills ఉన్నవి. Budget లో ఉన్నా రెవిన్యూ లోటు తో చెల్లింపులు జరగవు 👉SA 2 పరీక్షలు Dec 9 నుండి .. Nov వరకు Syllabus 👉SSC 2025 Exams Fee due date ఒక వారం పెంచవచ్చు?
- మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వాయిదా
పత్రికా ప్రకటన (12.11.2024) మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వాయిదా • సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి శ్రీనివాసరావు IAS., పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ఈ నెల 14న అన్ని పాఠశాలల్లో నిర్వహించాల్సిన మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ (మెగా పీటీఎం) తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి.శ్రీనివాసరావు IAS., గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని డిసెంబరు మొదటి వారంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, త్వరలో తేదీ, ఇతర వివరాలను ప్రకటిస్తామని వెల్లడించారు. రాష్ట్ర పథక సంచాలకులు (వారి తరఫున) సమగ్ర శిక్షా, ఆంధ్రప్రదేశ్.
- రూ.6కే అన్లిమిటెడ్.. బీఎస్ఎన్ఎల్లో బెస్ట్ ప్లాన్
#bsnl #bsnlunlimitedplan ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్.. తన చవక రీచార్జ్ ప్లాన్లతో ప్రైవేట్ టెలికాం కంపెనీలకు నిద్రలేకుండా చేస్తోంది. ఈసారి రోజుకు రూ. 6 ఖర్చుతోనే అపరిమిత కాలింగ్, 2జీబీ డేటాను అందించే అద్భుతమైన ప్లాన్‌ను తీసుకొచ్చింది. అది ఏ ప్లాన్.. ఎన్ని రోజులు వ్యాలిడిటీ.. బెనిఫిట్స్ ఏంటి అన్నవి ఇక్కడ తెలుసుకుందాం… ఇటీవల, ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. కానీ ప్రభుత్వ టెల్కో అయిన బీఎస్ఎన్ఎల్ మాత్రం రీఛార్జ్ ప్లాన్ల ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో ఖరీదైన టారిఫ్ ప్లాన్లను భరించలేని లక్షల మంది వినియోగదారులు ఆయా కంపెనీలను వీడి బీఎస్ఎన్ఎల్కి మారుతున్నారు. #bsnl #bsnlunlimitedplan కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి, పాత యూజర్లను ఆకట్టుకునేందుకు బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా రోజుకు 6 రూపాయల కంటే తక్కువ ధరతో అపరిమిత కాలింగ్, 2GB డేటా, ఇతర అనేక ప్రయోజనాలను అందించే ప్లాన్ అందిస్తోంది. ఇది ఏడాదికిపైగా సుదీర్ఘ వ్యాలిడిటీని అందిస్తుంది. తరచుగా రీఛార్జ్ చేసే టెన్షన్‌ను తొలగిస్తుంది. ప్లాన్ వివరాలు ఈ ప్లాన్ ధర రూ. 2399. దీని వ్యాలిడిటీ 395 రోజులు. రోజు ప్రకారం చూస్తే రూ. 6 కంటే తక్కువ ఖర్చుతో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. బడ్జెట్ విభాగంలో ఈ ప్లాన్ చాలా అద్భుతంగా కనిపిస్తోంది. ఇందులో అపరిమిత కాలింగ్, రోజువారీ 2GB డేటా, 100 ఎస్ఎంఎస్లు వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఒక్క సారి రీఛార్జ్ చేస్తే నాన్‌స్టాప్ ఇంటర్నెట్, కాలింగ్‌ని ఆస్వాదించవచ్చు.
- డిసెంబర్ 14 డెడ్‌లైన్.. ఆ తర్వాత ఆధార్ కార్డులు రద్దు!
ఆధార్ కార్డులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారమిది. ఆధార్ కార్డు తీసుకుని చాలా కాలమైనా అప్డేట్ చేయనివారి ఆధార్ కార్డులు ప్రభుత్వం రద్దు చేయవచ్చు. కాబట్టి అలాంటి ఆధార్ కార్డులను గడువులోపు అప్డేట్ చేసుకోవడం చాలా అవసరం. ఆధార్ కార్డ్‌లు జారీ చేసి పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలమైనవారు తమ సమాచారాన్ని అప్డేట్ చేసుకునేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఉచిత ఆన్లైన్ సదుపాయాన్ని అందించింది. ఇందుకు అనేకసార్లు గడువును పొడిగించింది. కానీ ఇప్పటికీ వేలాది మంది ఈ పని చేయలేదు. ఇలాంటి ఆధార్ కార్డులను ప్రభుత్వం రద్దు చేయవచ్చు. దీని కోసం, మీరు 'MyAadhaar' పోర్టల్‌కి వెళ్లి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి. ఆధార్ అప్డేట్ ఆవశ్యకత ప్రభుత్వ పథకాల నుంచి బ్యాంకు ఖాతా తెరవడం వరకు అన్నింటికీ ఉపయోగించే ఆధార్ కార్డు ప్రస్తుతం ముఖ్యమైన గుర్తింపు కార్డుగా మారింది. పదేళ్లలో మీ చిరునామా, ఫోటో మారి ఉండవచ్చు. ఆ సమాచారాన్ని ఆధార్‌లో అప్డేట్ చేయడం వల్ల మోసాలను నిరోధించవచ్చు. డిసెంబర్ 14 ఆఖరి గడువు? పదేళ్లు దాటిన ఆధార్‌లో సమాచారాన్ని అప్డేట్ చేయడానికి యూఐడీఏఐ డిసెంబర్ 14 వరకు సమయం ఇచ్చింది. ఈ గడువును ఇప్పటికే మూడుసార్లు పొడిగించింది. మొదట మార్చి 14, ఆపై జూన్ 14, ఆ తర్వాత సెప్టెంబర్ 14 గడువు విధించగా ఇప్పుడు డిసెంబర్ 14 వరకూ అవకాశం ఇచ్చింది. అయితే ఇదే చివరి గడువు అని భావిస్తున్నారు. ఆధార్ కార్డును అప్డేట్ చేయండిలా.. ⇒ 'MyAadhaar' పోర్టల్‌కి వెళ్లి లాగిన్ చేసి, మీ ఆధార్ నంబర్ , మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి. ⇒ అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి. మీ గుర్తింపు, చిరునామా కోసం కొత్త పత్రాలను అప్లోడ్ చేయండి. ⇒ ఈ సర్వీస్ ఉచితం కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుని వీలైనంత త్వరగా దీన్ని అప్డేట్ చేసుకోండి. ఆధార్ కార్డ్ అప్డేట్కు అవసరమైన పత్రాలు రేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం, జన-ఆధార్ కార్డ్, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్, లేబర్ కార్డ్, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, సీజీహెచ్ఎస్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి.
- పాన్ కార్డ్ కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు తప్పనిసరి!
ఆర్థిక మోసాలను అరికట్టేందుకు పాన్ కార్డుదారులందరికీ భారత ప్రభుత్వం కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. వచ్చే డిసెంబర్ 31 లోపు పాన్ కార్డులను ఆధార్ కార్డులతో లింక్ చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. Link PAN card With Aadhaar లేకపోతే ఆయా పాన్ కార్డ్ డియాక్టివేట్ కావడంతోపాటు ఇతర సమస్యలకు దారి తీస్తుంది. పలు ఫిన్‌టెక్ సంస్థలు వినియోగదారు అనుమతి లేకుండానే కస్టమర్ ప్రొఫైల్‌లను రూపొందించడానికి వారి పాన్ సమాచారాన్ని ఉపయోగిస్తున్నాయి. దీంతో గోప్యతా సమస్యలతోపాటు ఆర్థిక మోసాల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించే లక్ష్యంతో పాన్ ద్వారా వ్యక్తిగత వివరాల యాక్సెస్‌ను పరిమితం చేయాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదాయపు పన్ను శాఖను ఆదేశించింది. లింక్ చేయకపోతే ఏమౌతుంది? డిసెంబరు 31 లోపు ఆధార్ కార్డ్‌ని పాన్ కార్డ్‌తో లింక్ చేయకపోతే తీవ్ర పరిణామాలు సంభవించవచ్చు. రెండు కార్డ్‌లను లింక్ చేయడంలో విఫలమైతే పాన్ కార్డ్ డియాక్టివేట్ అవుతుంది. తదుపరి లావాదేవీలలో ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా దాన్ని మళ్లీ యాక్టివేట్ చేయడం కూడా కష్టం. ఆన్లైన్లో వ్యక్తిగత డేటాను బహిర్గతం చేసేటప్పుడు డేటా గోప్యతా చట్టాల గురించి తెలుసుకోవడం, జాగ్రత్తగా ఉండటం ముఖ్యం.
- ఏపీ రాష్ట్ర అవార్డులు అందుకోనున్న ఉత్తమ ఉపాధ్యాయుల జాబితా
మహోన్నత గౌరవం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి రాష్ట్ర అవార్డులు అందుకోనున్న ఉత్తమ ఉపాధ్యాయుల జాబితా ఉపాధ్యాయుల అంకితభావం మరియు కృషిని గౌరవించేందుకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంవత్సరం రాష్ట్ర అవార్డుల కోసం ఎంపికైన ఉపాధ్యాయుల జాబితాను ప్రకటించింది. విద్యా రంగ అభివృద్ధికి, విద్యార్థుల జీవితాలలో మార్పును తీసుకురావడంలో గర్వకారణంగా నిలుస్తున్న ఈ ఉపాధ్యాయులను ప్రతిరోజూ సమాజం గుర్తించడానికి వీలుగా ప్రతి సంవత్సరం ఈ గౌరవాన్ని అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ విద్యా సంస్థలకు చెందిన ఉపాధ్యాయులు ఈ జాబితాలో నిలిచారు, వీరు ప్రభుత్వ విద్యా రంగంలో తమ సేవలందిస్తూ ప్రతిభను ప్రతిబింబిస్తున్నారు. కొత్తతరహా బోధన, విద్యార్థుల జాగృతి మరియు సమాజంతో కలిసికట్టుగా పనిచేసే కార్యశీలత ఈ ఉపాధ్యాయులను ముఖ్యంగా ఉద్దేశించిన నాయకులుగా నిలిపింది. ఉపాధ్యాయులను గౌరవించడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం: ఉపాధ్యాయులు సమాజ భవిష్యత్తును నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తారు. పసిపిల్లల మేథా, సాంఘిక అభివృద్ధికి మార్గదర్శకులు, మెంటార్లు మరియు ఆదర్శంగా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి గౌరవాలతో వారి సేవలకు గుర్తింపునివ్వడం ద్వారా ఉపాధ్యాయులు చేయాల్సిన సేవల ప్రాముఖ్యతను పునరుద్ఘాటిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవార్డుల కోసం ఎంపికైన ఉపాధ్యాయుల జాబితా ఈ ఏడాది రాష్ట్ర అవార్డుల ఎంపికలో నిలిచిన అసాధారణ ఉపాధ్యాయుల జాబితా ఇదే: ఇక్కడ నొక్కి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల జాబితా చూడవచ్చు మరియు డౌన్లోడ్ చేసుకోవచ్చు 👈 విద్యార్థులకు అద్భుతమైన విద్యను అందించడం, వినూత్న బోధన పద్ధతుల ద్వారా ఉపాధ్యాయ వృత్తిని అభివృద్ధి చేయడం, మరియు సమాజంలో తమ సువర్ణ సేవలను అందించడం వంటి విధానాల్లో ఈ ఉపాధ్యాయులు నిలిచారు. అవార్డు కార్యక్రమం ఈ అవార్డులను ప్రదానం చేసే కార్యక్రమం నవంబర్ 11న జరగనుంది. ఈ కార్యక్రమంలో, విద్యా శాఖ అధికారులు ఈ గౌరవాన్ని అందజేస్తూ, ఉపాధ్యాయుల అసాధారణ కృషికి గౌరవానివ్వబోతున్నారు. కొత్త తరాలకు స్పూర్తి ఈ ప్రోత్సాహంతో, ఉపాధ్యాయులు తమ బోధన పద్ధతుల్లో సృజనాత్మకత మరియు అంకితభావంతో విద్యార్థుల బాగోగుల కోసం ఇంకా ముందుకు సాగేందుకు ప్రేరణ పొందుతారు. ఈ అవార్డులు కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే కాకుండా, మొత్తం రాష్ట్రంలో ఉన్న విద్యా ప్రమాణాలకు ఒక గౌరవప్రద గుర్తింపుగా నిలుస్తాయి. ఈ గౌరవం అందుకున్న వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ, విద్యార్థుల మెరుగైన భవిష్యత్తును నిర్మించడంలో వారి పాత్రకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం వెలుగు వెచ్చించే వీరులు ఈ ప్రతిభావంత ఉపాధ్యాయుల విజయం మనందరికీ విద్య యొక్క శక్తిని గుర్తుచేసే మార్గదర్శకం. ఈ గౌరవానికి ఎంపికైన వారు అందరికీ మనమందరం కలసి అభినందనలు తెలుపుదాం.
- ఏపీ టెట్ ఫలితాలు విడుదల ఇక్కడ చెక్ చేసుకోవచ్చు
ఏపీ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం ఉదయం మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. టెట్ ఫలితాల్లో 50.79 శాతం మంది అర్హత సాధించారు. మొత్తం 1,87,256 మంది అర్హత పొందారు. అమరావతి, నవంబర్ 4: ఏపీ టెట్ - 2024 (AP TET) ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం ఉదయం మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఫలితాలను విడుదల చేశారు. టెట్ ఫలితాల్లో 50.79 శాతం మంది అర్హత సాధించారు. మొత్తం 1,87,256 మంది అర్హత పొందారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో యువత, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది అక్టోబర్‌లో నిర్వహించిన టెట్ -2024 ఫలితాలను ఈరోజు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 3,68,661 మంది హాజరుకాగా అందులో 1,87,256 ( 50.79 శాతం) మంది అర్హత సాధించారన్నారు. ఫలితాలను ( https://cse.ap.gov.in ) వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు. నిరుద్యోగ టీచర్లకు ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. టెట్‌లో అర్హత సాధించిన వారందరికీ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా.. గత నెలలో (అక్టోబర్) ఏపీ టెట్ -2024 పరీక్షను నిర్వహించారు. టెట్‌కు మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661 మంది పరీక్ష రాశారు. 58,639 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు. అయితే త్వరలోనే 16,347 పోస్టులతో మెగాడీఎస్సీ నోటిఫికేషన్‌ను సర్కార్ జారీ చేయనున్న నేపథ్యంలో టెట్ ఫలితాలపై అభ్యర్థుల్లో ఆసక్తి పెరిగింది. టెట్‌లో అర్హత సాధించినవారికి డీఎస్సీలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అంతకుముందు టెట్ అర్హత సర్టిఫికెట్ ఏడేళ్లు మాత్రమే చెల్లుబాటయ్యేది. 2022 నుంచి దీన్ని జీవిత కాలానికి మార్చారు. 2022 టెట్‌లో చాలామంది అర్హత సాధించినా మార్కుల్లో మెరుగుదల కోసం చాలామంది ఇప్పుడు మరోసారి పరీక్ష రాశారు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.
- నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు
నేడు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నేడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు చర్చలు జరపనున్నారు. మంగళగిరిలోని పాఠశాల విద్య కమిషనరేట్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. గత రెండు వారాలుగా సంఘాల నేతలో చర్చలు జరిపిన డైరెక్టర్ పలు కీలక నిర్ణయాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. గత శుక్రవారం సంఘాల నేతలతో చర్చలు జరిపిన అనంతరం ఆరు సంవత్సరాలుగా ఎదురుచూస్తోన్న మున్సిపల్ టీచర్ల పదోన్నతులు, బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ తరుణంలోనే నేడు జరుగనున్న చర్చలలో తెలుగు మీడియం ఏర్పాటును ప్రస్తావించనున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం కేవలం ఇంగ్లీషు మీడియాన్నే ఉంచడంపై అపుడు ప్రతిపక్షంలో టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. దీంతో ఇపుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నేతలు తెలుగు భాషకు తగిన ప్రాధాన్యతనిస్తామని ఆది నుంచి చెబుతున్నారు. మాతృభాషకు తప్పనిసరిగా ప్రాధాన్యత ఉంటుంది. ఇటీవల జరిగిన తెలుగు భాషా దినోత్సవాల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ు ప్రకటించారు. విద్యార్థులకు ఎంతో కీలకమైన పదవ తరగతి పరీక్షలలో వారి మార్కులపై భాష ప్రభావం పడకూడదని విద్యా వేత్తలు సైతం హెచ్చరిస్తున్నారు. కూటమి ముఖ్య నేతల నిర్ణయాలకు అనుగుణంగా ఇప్పటికే తెలుగు మీడియం ఏర్పాటుపై అధికారులకు ఇప్పటికే ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. కానీ ప్రకటనకు నోచుకోకపోవడంతో సందేహం నెల కొంది. నేడు పాఠశల డైరెక్టర్ జరుపనున్న చర్చలలో ఆప్షనల్ లాంగ్వే జ్స్ తెలుగు మీడియం ఏర్పాటుపై స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. జీవో 117 రద్దు, టీచర్ల పదోన్నతులు, బదిలీలపై ఇప్పటికే స్పష్టత ఇచ్చిన డైరెక్టర్ విజయరామరాజు తెలుగు మీడియం ఏర్పాటుపై కూడా నేడు ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజా: సమావేశం 8వ తేదీకి వాయిదా పడిందని విశ్వసనీయ సమాచారం.







