Search Results
Search this site
738 results found with an empty search
- వాట్సాప్‌లో కొత్త అప్డేట్ AIని ఇలా ఉపయోగించండి
భారతదేశంలో మెటా ఎట్టకేలకు తన ఏఐ చాట్‌బాట్‌ను ఇటివల ప్రారంభించింది. దీంతో ఇప్పుడు మీరు WhatsApp, Facebook, Instagram, Messenger వంటి యాప్‌లలో AI చాట్‌బాట్‌ను ఉపయోగించవచ్చు. అయితే దీనిని ఎలా ఉపయోగించుకోవాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. #whatsapp #whatsappAI #AIinWhatsapp #ArtificialIntelligenceInWhatsapp భారతదేశంలో మెటా ఎట్టకేలకు తన ఏఐ చాట్‌బాట్‌ను ఇటివల ప్రారంభించింది. దీంతో ఇప్పుడు మీరు WhatsApp, Facebook, Instagram, Messenger వంటి యాప్‌లలో AI చాట్‌బాట్‌ను ఉపయోగించవచ్చు. Meta AI రెండు నెలల క్రితమే ప్రారంభించబడింది. దీనిని ముందుగా కేవలం న్యూజిలాండ్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో మాత్రమే ప్రవేశపెట్టారు. లామా 3 ఆధారంగా ai.meta.com అధికారిక బ్లాగ్ ప్రకారం మెటా ఏఐ లామా 3 ఆధారంగా పనిచేస్తుంది. మా అధునాతన మోడల్ Meta AI అనేది ఒక తెలివైన సహాయకుడిగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఇది అనేక ప్రశ్నలకు సమాధానం, సూచనలు ఇస్తుందని తెలిపారు. దీనికి నేరుగా సిఫార్సులు అందించడం ద్వారా Meta AIని సమర్ధవంతంగా వినియోగించవచ్చని వెల్లడించారు. Meta AI ఫేస్బుక్ ఫీడ్‌లో కూడా కనిపిస్తుంది. దీంతోపాటు మీరు meta.aiని సందర్శించడం ద్వారా కూడా దీన్ని ఉపయోగించవచ్చు. మెటా ఏఐ ప్రస్తుతం ఆంగ్ల భాషకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. వాట్సాప్‌లో Meta AIని ఎలా ఉపయోగించాలంటే.. ముందుగా మీ వాట్సాప్‌ని అప్డేట్ చేయండి ఆ తర్వాత మీకు యాప్‌లో గుండ్రంగా ఉండే Meta AI లోగో కనిపిస్తుంది దానిపై మీరు క్లిక్ చేసి మీకు నచ్చిన ప్రశ్నలను అడగవచ్చు Meta AI ప్రశ్నలను చదివి, ప్రత్యుత్తరం టెక్ట్స్ ఇస్తుంది మీరు రాజకీయాలు మినహా ఏదైనా అంశాలపై Meta AIని అడగవచ్చు మీరు ఫోటో, ఆడియో ద్వారా Meta AIకి ఎలాంటి ప్రశ్నలు అడగలేరు మీరు Meta AIకి గణిత శాస్త్ర ప్రశ్నలను కూడా సంధించవచ్చు ప్రస్తుతం ఇంగ్లీష్ బాషలో మాత్రమే ప్రశ్నలకు సమధానాలు ఇస్తుందనేది గుర్తుంచుకోవాలి
- ఎలిమెంటరీ స్థాయి ఉమ్మడి పరీక్ష (CBA) రద్దు: ఏపీ హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ లో 1 నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఉమ్మడి పరీక్ష నిర్వహించేందుకు వీలుగా గత జగన్ సర్కారు తీసుకువచ్చిన తరగతి గది ఆధారిత అంచనా పరీక్ష(సీబీఏ) విధానాన్ని హైకోర్టు కొట్టేసింది. విద్యాహక్కు చట్టం నిబంధనలకు విరుద్ధం తీర్పు వెల్లడి.. జగన్ విద్యావిధానాన్ని కొట్టేసిన హైకోర్టు రాష్ట్రంలో 1 నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఉమ్మడి పరీక్ష నిర్వహించేందుకు వీలుగా గత జగన్ సర్కారు తీసుకువచ్చిన తరగతి గది ఆధారిత అంచనా పరీక్ష(సీబీఏ) విధానాన్ని హైకోర్టు కొట్టేసింది. ఈ పరీక్ష కారణంగా విద్యార్థులు భయం, ఆందోళనకు గురవుతారని పేర్కొంది. సీబీఏ విధానంలో నిర్దిష్ఠ టైం టేబుల్ ప్రకటించడం, రాష్ట్రవాప్తంగా ఒకటే ప్రశ్నపత్రంతో పరీక్ష నిర్వహించడం వంటికి బోర్డు పరీక్షను పోలి ఉన్నాయని అభిప్రాయపడింది. ప్రభుత్వ నిర్ణయం విద్యాహక్కు చట్టంలోని సెక్షన్లు 29, 30కి విరుద్ధమని పేర్కొంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన సీబీఏ విధానం, దాని అమలుకోసం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వడ్డిబోయిన సుజాత ఇటీవల తీర్పు ఇచ్చారు. సపోర్టింగ్ ద ఆంధ్రా స్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 1 నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్ధులకు సీబీఏ విధానాన్ని తప్పనిసరి చేస్తూ స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎ్ససీఈఆర్టీ) 2022, అక్టోబర్ 3న ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలన్నీ ఈ విధానంలో భాగస్వామ్యం కావాలని, పరీక్ష నిర్వహణకు నిర్దిష్ఠ మొత్తాన్ని చెల్లించాలని పేర్కొంది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఫెడరేషన్ ఆఫ్ యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్, మరో విద్యాసంస్థ అదే ఏడాది హైకోర్టును ఆశ్రయించాయి. తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి ఇటీవల నిర్ణయాన్ని వెల్లడించారు.
- స్కూల్ అటెండెన్స్ యాప్ కి శుక్రవారం మళ్లీ అప్డేట్ వచ్చింది.. ఇక ఆ పని చేయకపోతే యాప్ ఓపెన్ అవదు అటెండెన్స్ పడదు
నిన్న గురువారమే అప్డేట్ అయినా స్కూల్ అటెండెన్స్ యాప్ కి నేడు అనగా శుక్రవారం మళ్లీ అప్డేట్ వచ్చింది. ఈ యాప్ పనితనాన్ని మెరుగుపరచి యాప్ కి అప్డేట్ తెచ్చారు. యాప్ వేగవంతంగా పనిచేసేలాగా మార్పు చేశారు. విద్యా శాఖ నుంచి మెసేజ్‌లు నేరుగా యాప్ లోకి వస్తాయి. ఈ మెసేజ్‌లు అన్నీ చదివిన తర్వాతనే యాప్ ఓపెన్ అవుతుంది. అన్ని మెసేజ్‌లు పూర్తిగా చదివితేనే అటెండెన్స్ వేయడం సాధ్యం అవుతుంది. స్కూల్ అటెండెన్స్ యాప్ కి వచ్చే మెసేజ్‌లు ముందుగా మన నోటిఫికేషన్ ప్యానెల్లోనే కనిపిస్తాయి. అంటే మనం స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేయకముందే విద్యా శాఖ నుంచి వచ్చిన మెసేజ్‌లను నోటిఫికేషన్స్ ప్యానెల్ లో చెక్ చేసుకోవచ్చు. అక్కడ కనిపించే మెసేజ్ లపై క్లిక్ చేస్తే యాప్ ఓపెన్ అయి నేరుగా మెసేజ్ లు ఓపెన్ అవుతాయి. అక్కడ కనిపించే అన్ని మెసేజ్‌లు చదివిన తర్వాతనే అటెండెన్స్ వేయడానికి ఓపెన్ అవుతుంది. ఈ అప్డేట్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి కింది లింక్ లేదా బటన్ క్లిక్ చేయండి. ఈ పోస్టు నచ్చితే కింద కనిపించే హార్ట్ సింబల్ మీద నొక్కి సపోర్ట్ చేయండి. తదుపరి ఆర్టికల్స్ కోసం సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WATCH DEMO VIDEO
- స్కూల్ అటెండన్స్ యాప్ కొత్త అప్డేట్.. ఇక సూపర్ స్పీడే
#schoolattendanceappupdate #apeducation #sims #facial_attendance ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖలో కృత్రిమ మేధతో పాఠశాలల ఉపాద్యాయులు మరియు విద్యార్థుల హాజరు నమోదు చేసే స్కూల్ అటెండన్స్ యాప్ ఇప్పుడే అప్డేట్ అయ్యింది. కింది బటన్ నొక్కి అప్ డేట్ చేసుకోవచ్చు. ఈ యాప్ గురించి AP ప్రభుత్వంలోని పాఠశాల విద్యా శాఖలో ఉపాద్యాయులు మరియు విద్యార్థుల హాజరు స్కూల్ అటెండెన్స్‌లో టీచర్ అటెండెన్స్, లీవ్ మేనేజ్మెంట్ మరియు స్టూడెంట్ అటెండెన్స్ ఉంటాయి. పాఠశాల క్యాంపస్‌లో ఫోటోలు తీయడం ద్వారా ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయుడిని చేర్చుకుంటారు. నమోదు చేసుకున్న తర్వాత, ఉపాధ్యాయుడు పాఠశాల క్యాంపస్‌లో హాజరును గుర్తించవచ్చు. ఉపాధ్యాయుడు సెలవు, విధులపై సెలవు, డిప్యుటేషన్ మరియు ప్రతి రకమైన సెలవుల కోసం ఆమోదం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. క్లాస్ టీచర్ విద్యార్థుల హాజరును గుర్తిస్తారు. విద్యార్థుల హాజరులో ఏవైనా దిద్దుబాట్లు ఉంటే లేదా హాజరును ఆమోదించినట్లయితే సంబంధిత పాఠశాల ప్రధాన మాస్టర్ సవరిస్తారు
- ఉపాధ్యాయుల బదిలీలపై మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు #naralokesh #apteacherstransfers
ఉపాధ్యాయుల బదిలీల్లో రాజకీయ జోక్యం ఉండొద్దు! టీచర్లపై అనవసర యాప్ ల భారాన్ని తగ్గించండి స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గుదలపై నివేదిక ఇవ్వండి #naralokesh పాఠశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష అమరావతిః ఇకపై ఉపాధ్యాయ బదిలీలు పారదర్శకంగా జరిగాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యలో చేపట్టాల్సిన మార్పులు, ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై పాఠశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సచివాలయంలో బుధవారం సాయంత్రం దాదాపు 3గంటలపాటు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయుల బదిలీల విషయంలో గతంలో మాదిరి రాజకీయ వత్తిళ్లకు తావులేకుండా విధివిధానాలని రూపొందించాలని కమిషనర్ ను ఆదేశించారు. ఈ విషయంలో ఉపాధ్యాయ సంఘాల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు, అనవసరమైన యాప్ ల భారాన్ని తగ్గించి, పూర్తిస్థాయి బోధనపైనే దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి పేరెంట్స్ కమిటీలను భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. రాబోయే సమీక్షలో మూసివేసిన పాఠశాలలకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ఎన్ని నిధులు అవసరమవుతాయనే అంశంపై అధికారులను వాకబుచేశారు. గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు పెద్దఎత్తున విద్యార్థులు బదిలీ కావడానికి గల కారణాలు అన్వేషించి సమగ్ర నివేదిక అందించాలని మంత్రి ఆదేశించారు. దీంతో పాటు చిల్డ్రన్ లెర్నింగ్ అవుట్ కమ్స్, విద్యా ప్రమాణాల పెంపునకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే అంశంపై సమగ్రంగా చర్చించారు. విద్యా ప్రమాణాల పెంపునకు దేశంలో అత్తుత్తమ విధానాలు ఎక్కడ అమలవుతున్నాయో అధ్యయనం చేసి నివేదిక అందించాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా జర్మనీ, ఆస్ట్రియాతోపాటు పలు అభివృద్ధి చెందిన దేశాల విద్యా వ్యవస్థలను మంత్రి ప్రస్తావించారు. రాయలసీమ ప్రాంతంలో ఎక్కడ పాఠశాలల కొరత ఉంది, ఎక్కన నూతన పాఠశాలలు ప్రారంభించాలనే అంశాలపైనా ఈ సమావేశంలో అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. ఈ సమీక్షా సమావేశంలో స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కోన శశిధర్, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సురేష్ కుమార్, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, అడల్ట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నిధి మీనా తదితరులు పాల్గొన్నారు.
- 7వ తరగతి విద్యార్థులకి పాఠంగా హీరోయిన్ తమన్నా జీవిత చరిత్ర?వ్యతిరేకిస్తున్న పేరెంట్స్ !
#thamanna #heroinethamanna #heroine_thamanna_life_history_as_lesson_in_7thClass #apteacherstvtelugu Tamannah Story in Text Book Controversy in Hebbal Bengaluru: బెంగళూరు హెబ్బల్‌లోని సింధీ కాలేజీలో, నటి తమన్నాపై 7వ తరగతి విద్యార్థులకు అందించిన టెక్స్ట్ బుక్ వివాదానికి దారితీసింది. దీన్ని తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బెంగళూరులోని హెబ్బాల్‌లోని సింధీ కాలేజీ ఈ వివాదానికి కారణమైంది. సింధీ కాలేజీ 7వ తరగతి పాఠ్యాంశంలో నటి తమన్నా గురించిన పాఠాన్ని చేర్చడం వివాదానికి దారితీసింది. తమన్నా పాఠాన్ని చేర్చడంపై పలువురు తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఇచ్చిన పాఠ్యాంశాలు మీడియాలో కూడా ప్రసారమయ్యాయి. సింధీ కాలేజ్ ఎక్స్ట్రా కరిక్యులర్‌లో తమన్నాపై పాఠం చేర్చబడింది. దాని యొక్క ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సింధీ కమ్యూనిటీకి తెలియజేసే ముఖ్యమైన విషయాలు రాసిన చోటే తమన్నా యొక్క పాఠం చేర్చబడింది. తమన్నా పుట్టిన తేదీ, తమన్నా చేసిన సినిమాల వివరాలు పాఠంలో ఇవ్వబడ్డాయి. సింధు సంఘం అనుకూలతలను పరిచయం చేయడానికి ఆమె గురించి ప్రచురించి ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. ఈ పాఠం 7వ తరగతి విద్యార్థులకు ఇవ్వబడుతుంది. తెలుగు మరియు తమిళంలో నటి చేసిన సినిమాలు మరియు ఆమె నటన గురించి టెక్స్ట్ లో పేర్కొన్నారు. సింధ్ విభజన తర్వాత జీవితం. తమన్నా యొక్క టెక్స్ట్ మైగ్రేషన్, కమ్యూనిటీ అండ్ కాన్ఫ్లిక్ట్ పేరుతో ఉంది. ఇక ఈ పాఠంలో బాలీవుడ్ నటుడు రణబీర్ సింగ్ గురించి కూడా మెన్షన్ చేశారు. తమన్నా గురించి పాఠంలో చేర్చడంపై తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ మా పిల్లలు ఆమె గురించి నేర్చుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. అలాంటి నటి నుంచి పిల్లలు ఏం నేర్చుకుంటారని ప్రశ్నించారు. తమన్నా పోర్న్ తరహా చిత్రాల్లో నటించిందని, పిల్లలు కూడా ఆమె గురించి మమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నారని తల్లిదండ్రులు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై యాజమాన్య బోర్డును ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. దీనిపై తల్లిదండ్రులు బాలల హక్కుల కమిషన్, ప్రైవేట్ పాఠశాలల సమాఖ్యకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
- 1న మెగా డీఎస్సీ షెడ్యూల్!
రాష్ట్రంలో ఉపాధ్యాయ కొలువుల భర్తీకి టీడీపీ కూటమి సర్కారు వడివడిగా అడుగులు వేస్తోంది. నిరుద్యోగుల కలలను సాకారం చేసేందుకు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. #megadsc #apdsc #apdscshedule #apdscnotification 16,347 పోస్టుల భర్తీకి సిద్ధం అదే రోజు టెట్ పరీక్షకు కూడా ఎన్నికల హామీని నిలబెట్టుకునే దిశగా వడివడిగా అడుగులు కేబినెట్లో సుదీర్ఘ చర్చ.. ఆమోదం రెండు రోజుల్లో పాత టెట్ ఫలితాలు రాష్ట్రంలో ఉపాధ్యాయ కొలువుల భర్తీకి టీడీపీ కూటమి సర్కారు వడివడిగా అడుగులు వేస్తోంది. నిరుద్యోగుల కలలను సాకారం చేసేందుకు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన మెగా డీఎస్సీ హామీని సాకారం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్, టెట్ నిర్వహణకు జూలై 1న షెడ్యూలు విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మెగా డీఎస్సీకి సోమవారం కేబినెట్ ఆమోదం లభించింది. దీంతో మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేసేందుకు మార్గం సుగమమైంది. ఎన్నికలకు ముందు గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన 6,100 పోస్టుల డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేయనున్నారు. జీవో త్వరలో జారీ కానుందని అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు ఎన్నికలకు ముందు నిర్వహించిన టెట్ పరీక్షల ఫలితాలను రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు. ఆ ఫలితాలు విడుదల చేసిన తర్వాత మళ్లీ టెట్ నిర్వహిస్తారు. తొలుత టెట్ నిర్వహించాలా? లేదా? అనే విషయంపై కేబినెట్లో చర్చించారు. తాజాగా బీఈడీ, డీఎడ్ కోర్సులు పూర్తిచేసిన వారికి మేలు చేసేలా మరోసారి టెట్ నిర్వహించాలని నిర్ణయించారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వంలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీచేయనందున ఈ ప్రభుత్వం మెగా డీఎస్సీని వీలైనంత వేగంగా పూర్తిచేయాలని భావిస్తోంది. గత ఐదేళ్లపాటు నిరుద్యోగులు డీఎస్సీ కోసం ఎదురుచూశారు. ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో హడావుడిగా నోటిఫికేషన్ జారీచేసినా పరీక్షలు నిర్వహించేలోగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. మరోవైపు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా సీఎం చంద్రబాబు మెగా డీఎస్సీ ఫైలుపైనే తొలి సంతకం చేశారు. గత ప్రభుత్వం తరహాలో అదిగో ఇదిగో అని నిరుద్యోగులను మభ్యపెట్టకుండా ఇచ్చిన హామీ ప్రకారం వీలైనంత వేగంగా భర్తీ పూర్తిచేయాలని ప్రయత్నిస్తోంది. తొలి కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై ఎక్కువ సేపు చర్చ జరిగింది. టెట్ నిర్వహిస్తే ఎలా చేయాలి? లేకుండా ఎలా చేయాలి? అనేదానిపై పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ రెండు ఆప్షన్లతో ప్రతిపాదనలు తయారుచేశారు. మంత్రి లోకేశ్ సూచనతో టెట్ నిర్వహణకే కేబినెట్ ఆమోదం తెలిపింది. సబ్జెక్టుల వారీగా పోస్టులు రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలను పాఠశాల విద్యాశాఖ రెండు కేటగిరీలుగా విభజించింది. జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్, గిరిజన సంక్షేమం(ఆశ్రమ) పాఠశాలల్లో 14,066 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపింది. వీటిలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు 655, హిందీ 536, ఇంగ్లీష్ 1086, గణితం 726, ఫిజికల్ సైన్స్ 706, బయోలాజికల్ సైన్స్ 957, సోషల్ స్టడీస్ 1368, వ్యాయామ విద్య 1691, ఎస్జీటీ 6,341 పోస్టులున్నాయి. ఏపీ రెసిడెన్షిల్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, బీసీ, గిరిజన(గరుకులాలు), దివ్యాంగ, జువెనల్ విభాగాల్లో 2,281 పోస్టులున్నాయి. వీటిని జోన్ల వారీగా పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోస్టులు 266, జోన్-1లో 405, జోన్-2లో 355, జోన్-3లో 573, జోన్-4లో 682 పోస్టులు ఉన్నాయి.
- ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలివే!
7 శాఖలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం ఏపీ కేబినెట్ భేటీ 4 గంటలపాటు కొనసాగింది. CM చంద్రబాబు చేసిన 5 సంతకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మెగా DSC లో 16 వేలకు పైగా ఉపాధ్యాయ నియామకాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అన్న క్యాంటీన్లు పునఃప్రారంభం పెన్షన్ల పెంపు స్కిల్ సెన్సస్ YSR హెల్త్ వర్సిటీ పేరు NTR హెల్త్ వర్సిటీగా మార్పునకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 7 శాఖలపై శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ భేటీ అనంతరం రాజకీయ అంశాలపై మంత్రులకు CM CBN దిశానిర్దేశం చేశారు. *మంత్రి మండలి సమావేశం నిర్ణయాలు* అమరావతి, 24-6-2024. అన్ని వర్గాలకు భరోసా కల్పించే విధంగా మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కె.పార్థసారధి మీడియాకు వివరించారు. 1. మెగా డీఎస్సీ : • మెగా డీఎస్సీ 2024 ద్వారా భర్తీ చేయనున్న 16 వేల 347 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. • ఇందులో భాగంగా ఎస్జీటీలు - 6,371, పీఈటీలు- 132, స్కూల్ అసిస్టెంట్ లు- 7,725, టీజీటీలు - 1781, పీజీటీలు - 286, ప్రిన్సిపాల్ లు - 52 పోస్టులను భర్తీ చేయనున్నారు. • గత ప్రభుత్వం 6,100 టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ మాత్రమే ఇవ్వగా మన ప్రభుత్వం ఏకంగా 16 వేల 347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనుంది. ముఖ్యమంత్రి వర్యులు పదవీ బాధ్యతలు చేపట్టిన రోజే తన తొలి సంతకాన్ని మెగా డీఎస్సీ పై చేయడం, తదనంతరం మంత్రి మండలిలో ఆమోదింప చేయడం మా ప్రభుత్వ చిత్తశుద్ధికి తార్కాణం. • డీఎస్సీ నిర్వహణ ఇకపై నిరంతర ప్రక్రియగా ఉంటుందని మంత్రి మండలి నిర్ణయించింది. అంటే ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహించబడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేబినెట్ ద్వారా తెలిపారు. గత ప్రభుత్వం టెట్ పరీక్షను ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహించకపోవడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారు. ఈ నేపథ్యంలో ఇకపై టెట్ (టీచర్ ఎలిజబులిటీ టెస్ట్) పరీక్షను కూడా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. • నాణ్యత గల విద్యను అందించడమే లక్ష్యంగా టీచర్లకు నియామకం కంటే ముందే శిక్షణ ఇవ్వాలి. ఈ శిక్షణ డిసెంబర్ 10వ తేదీ నుంచి ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధిత శాఖాధికారులకు సూచించారు. ప్రాథమిక స్థాయి నుంచే నాణ్యమైన విద్యాబోధనకు అవసరమైన విధివిధానాలను నిర్ణయించేందుకు ప్రస్తుత విద్యావిధానంతో పాటు జాతీయ విద్యా విధానాన్ని కూడా అధ్యయనం చేయాల్సిన అవసరముందని ఆ దిశగా అధికారులు సమాయత్తం అవ్వాలని ఆదేశించారు. 2. *ఆంధ్రప్రదేశ్ భూహక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్) 2022 రద్దు*: • ఆంధ్రప్రదేశ్ భూహక్కు చట్టం 2022 (యాక్టు సంఖ్య 27 ఆఫ్ 2023) రద్దు చేసే ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. • గత ప్రభుత్వం అమలుచేయ తలపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలను భయాందోళనకు గురిచేసిన విషయం మీకందరికి తెలిసిందే. • గత ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చే క్రమంలో ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా తీసుకొచ్చినట్లు గుర్తించాం. సరైన అవగాహన లేని టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ అనవసరమైన సమస్యలు సృష్టిస్తారని మేం గ్రహించాం. • నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టానికి, గత ప్రభుత్వం ఆమోదించిన చట్టానికి తీవ్ర వైరుద్యం ఉంది. కొన్ని వివాదాస్పద నిర్ణయాల వల్ల ఈ చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించాం. • ఈ యాక్ట్ ప్రకారం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ తర్వాత మధ్యంతర, జిల్లా, న్యాయ వ్యవస్థతో సంబంధం లేకుండా నేరుగా పరిష్కారానికి కక్షిదారులు హైకోర్టుకు ఆశ్రయించే పరిస్థితిని కల్పించారు. అంటే టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఏకీకృత నిర్ణయం తీసుకునే భయంకరమైన పరిస్థితి నెలకొన్నందున ఈ చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించాం. • రిజిస్ట్రేషన్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, న్యాయ వ్యవస్థలను అస్తవ్యస్థం చేసే ఈ చట్టాన్ని రద్దు చేయాలని మేం భావించాం. అంతేగాక భూయజమాని ఒరిజినల్ డాక్యుమెంట్ ను పొందే అవకాశాన్ని కల్పించాలని నిర్ణయించాం. • ఈ నేపథ్యంలో ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని సదరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసేందుకు మంత్రి మండలి తన ఆమోదం తెలియజేసింది. 3. *సామాజిక పింఛన్లకు సంబంధించి గతంలో ఉన్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకంగా పేరు మార్పు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది*. • ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లుగీత, మత్స్యకార, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు తదితర పింఛన్ల మొత్తాన్ని రూ.3 వేల నుంచి రూ.4 వేల రూపాయలకు పెంచుతూ మంత్రి మండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పెంచిన పెన్షన్ పెంపుదల నిర్ణయంతో 28 కేటగిరీలకు చెందిన దాదాపు 66 లక్షల మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూరనుంది. పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఏడాదికి రూ. 33వేల కోట్లకు పైగా ఖర్చు చేయనుంది. • ఈ మేరకు రూ. 4 వేలకు పెంచిన పింఛన్ మొత్తాన్ని ఏప్రిల్, మే, జూన్ లకు పెరిగిన రూ. వెయ్యి రూపాయల చొప్పున కలిపి ప్రతి పింఛన్ దారుకు మొత్తంగా రూ.7 వేల పింఛన్ ల మొత్తాన్ని జూలై 1వ తేదీన సచివాలయ ఉద్యోగులతో ఇంటివద్దనే అందించాలని మంత్రిమండలి నిర్ణయించింది. • దివ్యాంగులు, క్షయ వ్యాధిగ్రస్తులకు ఇస్తున్న పింఛన్ ను రూ. 3 వేల నుంచి రూ.6 వేల రూపాయలకు పెంచడం జరిగింది. • అదేవిధంగా పూర్తి అంగవైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులకు ఇస్తున్న రూ.5 వేల పింఛన్ ను రూ.15 వేల రూపాయలకు పెంచడం జరిగింది. • కిడ్నీ, లివర్, బైలేట్రల్ ఎలిఫెంటాసిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇస్తున్న ఫించన్ ను రూ.5 వేల నుంచి రూ.10 వేల రూపాయలకు పెంచడం జరిగింది. • కిడ్నీ డయాలసిస్, సికిల్ సెల్ ఎనీమియా, తలసేమియా, హెచ్ఐవీ తదితర వ్యాధిగ్రస్తులకు పెన్షన్ పంపిణీ డీబీటీ ద్వారా జరుగుతుందని మంత్రి మండలి నిర్ణయించింది. • ఈ విధంగా సామాజిక భద్రతా పింఛన్ల పెంపుదల వల్ల ప్రభుత్వంపై నెలకు రూ.819 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. ఏరియర్స్ తో కలిపి నెలకు రూ. 4,408 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంది. 4.*రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య సెన్సెస్-2024 నిర్వహణకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.* • ఏ దేశమైనా సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే నైపుణ్యం కలిగిన యువత ఎంతో అవసరం. అది గుర్తించిన మన ప్రభుత్వం అందుకనుగుణంగా ఆంధ్రప్రదేశ్ నైపుణ్య సెన్సెస్-2024 నిర్వహణకు తొలి మంత్రి మండలిలోనే ఆమోదం తెలియజేసింది. • ప్రతి సంవత్సరం రాష్ట్రంలో 310 ఇంజినీరింగ్ కాలేజీలు, 1400 డిగ్రీ కాలేజీలు, 267 పాలిటెక్నిక్ కాలేజీలు, 516 ఐటీఐ కాలేజీ ల నుండి దాదాపు 4.4 లక్షల యువత ఆయా కోర్సులను పూర్తి చేసుకొని బయటకు వస్తున్నారు. • అయితే డిమాండ్, సప్లై మరియు అందుబాటులో ఉన్న సదుపాయాల ఆధారంగా స్కిల్ గ్యాప్ ను అంచనా వేయడం, ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మన యువతను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా చేసి ప్రపంచ యవనిక పై మన ముద్ర ఉండేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. • యువతకు నైపుణ్య అవసరాలు అలాగే పారిశ్రామిక అనుబంధ సంస్థలు, వ్యవసాయ రంగం, మార్కెటింగ్ సంస్థలు, ప్రొడక్షన్ సంస్థలు వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆయా సంస్థల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య సర్వేని 3 నుంచి 4 నెలల వ్యవధిలో పూర్తి చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. • ఈ సెన్సెస్ లో అందుబాటులో ఉన్న స్కిల్ ప్రొఫైల్స్, స్కిల్ నీడ్స్, స్కిల్ ఇన్ డిమాండ్, స్కిల్ లభ్యత మధ్య అంతరాన్ని గుర్తించడం, అంచనా వేయడం, తదనుగుణంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణలు డిజైన్ చేసేలా ప్రభుత్వానికి సమాచారం అందించడం, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువత సదరు నైపుణ్యాలను సాధించేలా శిక్షణ అందించడం ఈ సెన్సెస్ ముఖ్య లక్ష్యాలు. అంతిమంగా మన రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడమే ప్రభుత్వ సంకల్పం. 5. *రాష్ట్రం లోని పేదవారి ఆకలి దప్పులను తీర్చే లక్ష్యంతో సబ్సిడీ ధరకు నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు గతంలో మంజూరు చేసిన అన్నా క్యాంటీన్లను పున: ప్రారంభించేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.* • గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను కక్షపూరితంగా మూసివేసి నిరుపేదల నోటి దగ్గర ముద్ద తీసేసింది. పేదవాడి ఆకలి దప్పులను తీర్చేందుకు సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన రోజునే అన్నా క్యాంటీన్ లను పునరుద్ధరిస్తూ సంతకం పెట్టారు. • ఆ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్ లను పున: ప్రారంభించేందుకు చర్యలు తీసుకోనున్నారు. తొలి దశలో 183 అన్నా క్యాంటీన్లను ఒకేసారి ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మిగిలిన 20 క్యాంటీన్లను కూడా తదుపరి దశలో ప్రారంభించాలని నిర్ణయించింది. • ఈ అన్నా క్యాంటీన్ ల ద్వారా పేద అన్నార్తులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం సబ్సిడీ ధరకే అందించడం జరుగుతుంది. *6. విజయవాడలోని డా.వైయస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయంగా పునర్ నామకరణం చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.* • 1986లో నాటి రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ను ఏర్పాటు చేసింది. • 1998లో ఈ చట్టానికి సవరణ చేసి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గాడ నామకరణం చేసింది. • అనంతరం 2006లో డా.ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా మార్పు చేసింది. 2022లో ఈ యూనివర్సిటీ పేరును గత ప్రభుత్వం డా.వైయస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా మార్చింది. • ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఆ చట్టాన్ని సవరిస్తూ స్వర్గీయ డా. నందమూరి తారక రామారావు ప్రజలకు చేసిన సేవలకు గుర్తింపుగా యూనివర్సిటీకి ఆయన పేరుతో పునర్ నామకరణం చేయాలన్న ప్రతిపాదనకు మండలి ఆమోదం తెలిపింది. • విదేశాలకు వెళ్ళే వైద్య విద్యార్థులకు కళాశాల పేరు మారడం వలన సాంకేతిక పరమైన సమస్యలు ఎదుర్కొంటున్న కారణంగా తిరిగి అదే పేరును పునరుద్ధరించేందుకు నిర్ణయించడం జరిగింది. *7. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గా దమ్మాలపాటి శ్రీనివాస్ ను నియమిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.* • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వపు అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిల రాజీనామాలను ఆమోదిస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. *ఇతర అంశాలు* : • ప్రజల్లో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలపై అవగాహన కల్పించేందుకు 7 శ్వేత పత్రాలను విడుదల చేయాల్సిందిగా మంత్రి వర్గానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. • పోలవరం, అమరావతి, విద్యుత్, పర్యావరణం( ల్యాండ్, శాండ్, మైన్స్, జియాలజీ మొదలైనవి), లిక్కర్ అండ్ ఎక్సైజ్, లా అండ్ ఆర్డర్ మరియు ఆర్థిక శాఖల పై శ్వేత పత్రాలను విడుదల చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. • ఈ నెల 28 నుండి జులై 18 వరకు రెండు మూడు రోజులకొకసారి శ్వేత పత్రాలు విడుదల చేయడం జరుగుతుంది. • గత 5 సంవత్సరాల్లో సంస్థలు ఏ విధంగా కుంటు పడ్డాయన్న విషయాన్ని ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులకు ఉందన్నారు. • ఇవే గాక అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీల పారిశుద్ధ్య పనులను వెంటనే ప్రారంభించాలి. • చివరి ఆయకట్టుకు నీరు అందించే దిశలో కాల్వలు, చెరువుల్లో పూడిక, డెక్క తొలగించే కార్యక్రమాన్ని సత్వరమే చేపట్టాలి. • వర్షాకాలం ప్రారంభం అయినందున సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లతో సమాయత్తం కావాలని మంత్రి వర్గానికి సూచనలు జారీ • అధ్వాన్నంగా మారిన రోడ్లు, రహదారులు గతుకులమయం అయినందున వెంటనే పాట్ హోల్స్ ను పూడ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బీకి ఆదేశాలు జారీ.. • మత్తు, మాదక ద్రవ్యాల వినిమయం రాష్ట్రంలో అధికమైన నేపథ్యంలో వాటి నుండి యువతను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఒక కార్యాచరణ ప్రణాళికను తయారు చేసేందుకు ఐదుగురు మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో విద్యాశాఖ, ఆరోగ్యశాఖ, హోం, ఎక్సైజ్, ట్రైబల్ వెల్ఫేర్ వంటి శాఖల మంత్రులు ఉంటారు. భావితరాల భవిష్యత్ కాపాడటం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
- నా భార్య నల్లపూసల దండ తెంపేశారు.సజ్జల నన్ను లేపేస్తానన్నారు:ఉద్యోగుల సంఘం ఛైర్మన్ కె ఆర్ సూర్యనారాయణ.#krsuryanarayana
నా భార్య నల్లపూసల దండ తెంపేశారు.సజ్జల నన్ను లేపేస్తానన్నారు:ఉద్యోగుల సంఘం ఛైర్మన్ కె ఆర్ సూర్యనారాయణ.#krsuryanarayana ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జుడీషియల్ ప్రివ్యూ కమిషన్ (Judicial Review Commission)ను నియమించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్ కె.ఆర్. సూర్య నారాయణ (Surya Narayana) ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై ఈనెల 24న జరిగే ఏపీ క్యాబినెట్ మెుదటి సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. AP Politics: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జుడీషియల్ ప్రివ్యూ కమిషన్(Judicial Review Commission)ను నియమించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్ కె.ఆర్. సూర్య నారాయణ(Surya Narayana) ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై ఈనెల 24న జరిగే ఏపీ క్యాబినెట్ మెుదటి సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గత వైసీపీ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు పడ్డ ఇబ్బందులను వివరించారు. ఈ నేపథ్యంలోనే జుడీషియల్ ప్రివ్యూ కమిషన్‌ను కోరుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్ కె.ఆర్. సూర్య నారాయణ మాట్లాడుతూ.." వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తున్నానని నన్ను అణచి వేయాలని చూశారు. ఏ కేసు పెట్టారో కూడా చెప్పకుండా విచారణకు పిలిచి నన్ను, నా కుటుంబాన్ని వేధింపులకు గురి చేశారు. నా భార్య మెడలోని నల్లపూసల గొలుసు తీయించి పోలీసులు దారుణంగా వ్యవహరించారు. వైసీపీ పాలనలో నా ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసులు మోహరించేవారు.. నేనేమైన్నా సంఘ విద్రోహ శక్తినా?. హైదరాబాద్‌లో బంధువుల ఇళ్లకు వెళ్లి మరీ వారిని భయందోళనలకు గురి చేశారు. రాత్రి సమయంలోనూ పోలీసులు అక్కడే ఉండేవారు. నా ఇంటికి సీల్ వేసే అధికారం పోలీసులకు ఎక్కడిది?" అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను చంపమని సజ్జల పోలీసులకు చెప్పారు.. తన కుటుంబాన్ని వేధించిన పోలీస్ అధికారులు రావి సురేశ్ రెడ్డి, భాస్కరరావులపై ఎన్డీయే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూర్య నారాయణ అభ్యర్థించారు. గత సీఎస్ జవహర్ రెడ్డి ఒక దినపత్రికలో తనపై వచ్చిన వార్త ఆధారంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధపడ్డారని, మరి జవహర్ రెడ్డి మీద వచ్చిన వార్తలకు ఆయన మీద ఏం చర్యలు తీసుకోవాలంటూ ప్రశ్నించారు. తన ఫోన్ ట్యాప్ చేసి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును కలిస్తే నిన్ను దేవుడు కూడా కాపాడలేడని బెదిరించారని సూర్యనారాయణ చెప్పుకొచ్చారు. చంద్రబాబును కలిసిన తర్వాత పోలీసులు తన డ్రైవర్‌ను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యనారాయణ దొరికాడా అంటూ పోలీసులకు సజ్జల రామకృష్ణ రెడ్డి ఫోన్ చేయడం తన డ్రైవర్ విన్నాడని వెల్లడించారు. సూర్యనారాయణ దొరికితే "చంపేయండి" అంటూ సజ్జల పోలీసులను ఆదేశాలు జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులు పడిన వారికి చంద్రబాబు ప్రభుత్వం న్యాయం చేయాలని సూర్యనారాయణ కోరారు. అందుకే తొలి మంత్రివర్గ సమావేశంలోనే జుడీషియల్ ప్రివ్యూ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సంచలన వీడియో చూడండి https://www.youtube.com/apteacherstvtelugu
- నీట్ పేపర్ లీకేజీపై సీబీఐ దూకుడు.. తొలి ఎఫ్ఐaఆర్ నమోదు #NEET_UG_Paper_Leak_Case
నీట్ పేపర్ లీకేజీపై సీబీఐ దూకుడు.. తొలి ఎఫ్ఐaఆర్ నమోదు #NEET_UG_Paper_Leak_Case దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీకేజీ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. కేంద్రప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు లక్ష్యంగా చేసుకోవడంతో ఈకేసుపై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది. మరోవైపు యూజీసీ నెట్, నీట్ పరీక్షల పేపర్ లీకేజీలకు ప్రధాని మోదీ బాధ్యత వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. మోదీ ప్రభుత్వం మొత్తం విద్యావ్యవస్థను మాఫియాకు, అవినీతిపరులకు అప్పగించిందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఈక్రమంలో కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. దీంతో నీట్ పేపర్ లీకేజీపై సీబీఐ మొదటి ఎఫ్ఐఆర్ను నమోదు చేసింది. దర్యాప్తు బాధ్యతలు స్వీకరించిన రెండో రోజు సీబీఐ నీట్ పేపర్ లీకేజీ కేసుపై తొలి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. రానున్న రోజుల్లో ఈ పేపర్ లీకేజీ ఘటనలో మరింతమంది వ్యక్తులను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉన్నతస్థాయి సమీక్ష తర్వాత.. నీట్ పేపర్ లీకేజీ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపడంతో విద్యాశాఖ మంత్రిత్వశాఖ ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించింది. నీట్ పరీక్ష ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం కోల్పోకుండా ఉండేందుకు పేపర్ లీకేజీ ఘటనపై సీబీఐకి అప్పగించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా కేంద్రవిద్యాశాఖ అధికారులు తెలిపారు. పేపర్ లీకేజీ వ్యవహరంలో ఏదైనా వ్యక్తి, సంస్థ ప్రమేయం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే కేంద్రప్రభుత్వం హెచ్చరించిన విషయం తెలిసిందే. ఎన్టీఏ చీఫ్ తొలగింపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటన సంచలన రేపడంతో కేంద్రప్రభుత్వం ఎన్డీఏ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఆయన స్థానంలో సీనియర్ అధికారి ప్రదీప్ సింగ్ ఖరోలాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డీజీగా నియమించింది. ఈ పోస్ట్ నచ్చితే కిందనున్న హృదయం గుర్తుపై నొక్కి సపోర్ట్ చేయగలరు. ధన్యవాదాలు
- "ఇకోక్లబ్స్ మిషన్ ఫర్ మేరీ లైఫ్" నేటి కార్యక్రమాలు :: 18.06.2024
ఇకోక్లబ్స్ మిషన్ ఫర్ మేరీ లైఫ్ :: 18.06.2024 ---------------------------------------- నేటి లక్ష్యం : సుస్థిర ఆహార వ్యవస్థలను నిర్మించుకొనుట ----------------------------------------- భాగస్వామ్యులు : వ్యవసాయ మరియు ఉద్యాన శాఖల ప్రతినిధులు ----------------------------------------- 🌱 పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెన్ మైన్టైన్ చేయుటకు పిల్లల్ని భాగస్వాములను చేయాలి. 🌿 పాఠశాలలో ఉత్పత్తయిన తడిచెత్త నుంచి కంపోస్ట్ ఎరువు తయారుచేసి కిచెన్ గార్డెన్ కోసం వాడవలెను. తద్వారా రసాయన ఎరువులు , విషరసాయన పురుగుమందులను విస్మరించవచ్చు. స్వచ్చమయిన సహజమైన కూరగాయలు,ఆకుకూరలు పొందవచ్చు . 🪴 తోటలో బయో ఎంజైమ్స్ వంటి చెత్త నుంచి తయారు చేసిన పర్యావరణహిత పురుగుమందులను వాడమని ప్రోత్సహించవలెను. 🌳 పాఠశాల ఆవరణలో తోట పెంచుటకు తగిన ఖాళీ లేనిచో ఉన్న స్థలంలోనే పాత బకెట్స్ , ప్లాస్టిక్ బాటిల్స్ మరియు నేలలో పాతిపెట్టే మట్టి కుండల్లో విత్తనాలు ,మొక్కలు నాటమని పిల్లల్ని ప్రోత్సహించాలి. 🌴 ఎక్కువ స్థలం ఆక్రమించని గుమ్మడి,బీర,కాకర,చిక్కుడు,ఆనప వంటి తీగలు,పాదులు నాటవలెను 🌱 తోటలో ప్రతినెలా ఎంత మొత్తంలో కూరగాయలు కోస్తున్నారో ఒక రికార్డు నిర్వహించాలి 🌿 తోటలో కాసిన కూరగాయలను పీఎం పోషణ్ భోజనంలో వండి వడ్డించవచ్చు. లేదా పిల్లలు,సిబ్బందికి పంపిణీ చేయవచ్చు ☘️ ఈ తోటలోని కూరగాయలు తినడం వల్ల కలిగే దీర్ఘకాల ఆరోగ్యప్రయోజనాల గురించి మరియు పర్యావరణ ప్రయోజనాల గురించి అవగాహన కల్పించుటకు పిల్లలకు ఫ్యాన్సి డ్రస్ కాంపీటీషన్స్ వంటి ఆసక్తికరమైన పోటీలు నిర్వహించవలెను. 🍀 ఈ కార్యక్రమాలను ప్రేరణగా తీసుకొని , తోటపనిలో నేర్చుకున్న అనుభవాలను ఉపయోగించి పిల్లల్ని వారి ఇళ్లవద్ద పెరడుతోటలను పెంచుకోవాలని ప్రోత్సహించవలెను. 🪴 పాఠశాలలో ఎన్ని పెరడు తోటలు పెంచుతున్నారు? ఎన్ని కేజీల సేంద్రీయ ఆహారపదార్ధాలను ఉత్పత్తి చేశారు వంటి వివరాలను ఇకో క్లబ్ రిజిస్టర్ లో నమోదు చేయవలెను. 🎋 అనువాదం : ఏపీ టీచర్స్ టీవీ 🍃🌵🌴🌳🪴🌱🌿☘️🍀
- నీట్ లో అక్రమాలు నిజమే! రెండుచోట్ల వెలుగులోకి వచ్చాయి -కేంద్ర విద్యామంత్రి
నీట్ లో అక్రమాలు నిజమే.. రెండుచోట్ల వెలుగులోకి వచ్చాయన్న -కేంద్ర విద్యామంత్రి ఎన్టీఏ తీరు మారాలని వ్యాఖ్యనీట్లో.. దోషులను వదిలిపెట్టేది లేదని వెల్లడి బీహార్‌లో పేపర్ లీక్ నేరాన్ని అంగీకరించిన ఇద్దరు నిందితులు నీట్‌పై రెండు రోజుల దేశవ్యాప్త ఆందోళనకు విద్యార్థుల పిలుపు ‘నీట్’ ఓ స్కామ్ అన్న స్టాలిన్ అక్రమాల ఆరోపణలపై సుప్రీంకోర్టు కమిటీతో దర్యాప్తు జరిపించాలి రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ డిమాండ్ న్యూఢిల్లీ/చెన్నై, జూన్ 16: నీట్ పరీక్షకు సంబంధించి రెండు చోట్ల అక్రమాలు వెలుగులోకి వచ్చాయని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంగీకరించారు. అయితే ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొన్నదని, విద్యార్థులు, తల్లిదండ్రులు భయపడొద్దని ఆయన ఆదివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ అన్నారు. సుప్రీంకోర్టు సూచన మేరకు 1,563 మంది విద్యార్థులకు తిరిగి పరీక్ష నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలు నిర్వహించే బాధ్యతలు కలిగిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)లో చాలా మెరుగుపడాల్సిన అవసరం ఉన్నదని కేంద్ర మంత్రి అన్నారు. ఎన్టీఏ ఉన్నతాధికారులైనా దోషులుగా తేలితే, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. గుజరాత్, బీహార్లలో నీట్ పరీక్షలో అక్రమాలపై వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆయా రాష్ర్టాల్లో పలువురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సామాజిక న్యాయానికి వ్యతిరేకం మెరిట్‌కు కొలమానమనే ముసుగులో ఉన్న నీట్ ఒక ‘స్కామ్’ అని తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఆరోపించారు. ఈ జాతీయ స్థాయి పరీక్ష విద్యార్థుల ప్రయోజనాలకు, సామాజిక న్యాయం, పేదలకు వ్యతిరేకంగా ఉన్నదని అన్నారు. నీట్ పరీక్షను సమర్థించుకోవడం ఆపాలని కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు. ప్రస్తుతం నీట్ చుట్టూ రేగిన వివాదాలు దాని ప్రాథమిక అసమాన స్వభావాన్ని చూపుతున్నాయని స్టాలిన్ ఎక్స్ పోస్టులో అభిప్రాయపడ్డారు. వేలాది సంవత్సరాల పాటు విద్య నిరాకరణకు గురైన సమాజంలో.. అణచివేతకు గురైన వారు ఉన్నతి సాధించేలా మరిన్ని అవకాశాలు ఇవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. అయితే అందుకు విరుద్ధంగా నీట్ అలాంటి విద్యార్థులకు అవకాశాలను నాశనం చేస్తున్నదని విమర్శించారు. కోట్లాది రూపాయలు లంచాలు తీసుకొని ఓఎంఆర్ షీట్లను ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణలపై గుజరాత్ పోలీసులు ఇన్విజిలేటర్లపై కేసు నమోదు చేశారని తెలిపారు.











