top of page

Search Results

Search this site

738 results found with an empty search

  • డాక్టర్ ఘనత! తాను కనిపెట్టిన వైద్యంతో తన బ్రెయిన్‌ కేన్సర్‌ని జయించాడు! #cancertreatment

    డాక్టర్ ఘనత! తాను కనిపెట్టిన వైద్యంతో తన బ్రెయిన్‌ కేన్సర్‌ని జయించాడు! #cancertreatment కేన్సర్‌ అంటేనే.. ఎలాంటి వాళ్లు అయినా ఒక్కసారిగా ఉలిక్కిపడతారు. ఏ స్టేజ్‌లో ఉందో? నయం అవుతుందో? లేదా? అన్న భయాలు మొదలైపోతుంటాయి. ఎంతటి వాడినైనా కుదేలయ్యిపోయేలా చేస్తుంది. అలాంటి కేన్సర్‌ మహ్మమ్మారిని తను కనిపెట్టిన వైద్య విధానంతో స్వీయ చికిత్స తీసుకుని జయించి చరిత్ర సృష్టించాడు ఓ వైద్యుడు. తన జీవితాన్ని పొడిగించుకున్నందకు సంబరపడిపోతున్నాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. ప్రముఖ ఆస్ట్రేలియా వైద్యుడు ప్రొఫెసర్‌ రిచర్డ్‌ స్కోలియర్‌ బ్రెయిన్‌ కేన్సర్‌ ఉన్నట్లు వైద్య పరీక్షల్లో నిర్థారణ అయ్యింది. అప్పుడు ఆయనకు 57 ఏళ్లు. నిజానికి ఈ వ్యాధి వచ్చిన వాళ్లు 12 నెలలకు మించి బతకరు. దీంతో ఈ వ్యాధిపై అవగాహన ఉన్న రిచర్డ్‌ ..తన  స్నేహితుడు ప్రొఫెసర్‌ జార్జినా లాంగ్‌ సాయంతో కొత్త చికిత్సా విధానాన్ని అభివృద్ధి చేశారు. దాన్ని తనపైనే ప్రయోగం చేసుకున్నాడు రిచర్డ్‌. ఈ చికిత్స విధానం సర్జరీ రహితం. ఆశ్చర్యకరంగా ఆ చికిత్స బాగా పనిచేసి మెదడులోని కణుతులన్నీ మాయమైపోయాయి. తాజాగా ఎమ్మారై తీయగా కణితులు కనిపించకపోవడంతో రిచర్డ్‌ ఆనందం వ్యక్తం చేశారు. తానిప్పుడు చెప్పలేనంత భావోద్వేగానికి గురవ్వుతున్నానని అన్నారు. తన జీవితకాలాన్ని పొడిగించుకున్నాని, తన భార్య, పిల్లలతో కలిసి మరికొంత కాలం కలిసి జీవించే అవకాశం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు రిచర్డ్‌. ఈ చికిత్స విధానం సుమారు మూడు లక్షల మందికి ఉపయోగపడుతుందని చెప్పారు. సర్జరీ లేకుండా చేసే ఈ "ఇమ్యూనో థెరపీ' పెద్ద సంఖ్యలో ఉపయోగడుతుందని ధీమాగా చెబుతున్నారు. అంతేగాక ఈ చికిత్సలో మరిన్ని విప్లవాత్మక మార్పులు తెచ్చి మరింతగా అభివృద్ధి చేయడమే గాక విస్తృతమైన క్లినకల్‌ ట్రయల్స్‌ నిర్వహించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉందని జార్జిన్‌ లాంగ్‌ అన్నారు. ఇవి కూడా చదవండి 👇 కోవాగ్జిన్‌తోనూ సైడ్‌ ఎఫెక్ట్స్‌.. ఆందోళన కలిగిస్తున్న అధ్యయనం ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా! ఈ జాగ్రత్తలు తప్పనిసరి !! మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక జీవోలు

  • కోవాగ్జిన్‌తోనూ సైడ్‌ ఎఫెక్ట్స్‌.. ఆందోళన కలిగిస్తున్న అధ్యయనం #covaccinesideeffects

    కోవాగ్జిన్‌తోనూ సైడ్‌ ఎఫెక్ట్స్‌.. ఆందోళన కలిగిస్తున్న అధ్యయనం: బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా సంస్థ తయారు చేసిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌పై ఆందోళనలు తగ్గేలోపే భారతీయ కంపెనీ తయారు చేసిన మరో కోవిడ్‌ వ్యాక్సిన్‌ ‘కోవ్యాక్సిన్‌’తోనూ సైడ్‌ ఎఫెక్ట్స్‌ తలెత్తినట్లు ఓ తాజా అధ్యయనం వెలువడింది. భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ను తీసుకున్న కొంతమందిని బనారస్ హిందూ యూనివర్సిటీ పరిశోధక బృందం ఏడాదిపాటు పరిశీలించి అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు మూడింట ఒకవంతు మంది ప్రతికూల సంఘటనలను నివేదించారు. 635 మంది టీనేజర్లు, 291 మంది పెద్దలు మొత్తం 1,024 మంది ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. వీరిలో 304 (47.9 శాతం) మంది టీనేజర్లు, 124 మంది (42.6 శాతం) పెద్దలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఎదుర్కొన్నట్లు నివేదించారు. 10.5 శాతం మందిలో చర్మ సమస్యలు, 10.2 శాతం మందిలో సాధారణ రుగ్మతలు, 4.7 శాతం మందిలో నాడీ సంబంధిత సమస్యలు, 4.6 శాతం మంది మహిళల్లో రుతుక్రమ సమస్యలు, 2.7 శాతం మందిలో కంటి సమస్యలు గుర్తించారు. సైడ్‌ ఎఫెక్ట్స్‌ వార్తల నేపథ్యంలో బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా సంస్థ తయారు చేసిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను వాణిజ్య కారణాలతో మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకున్న కొన్ని రోజులకే ఈ అధ్యయనం వెలువడటంతో కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలోనూ ఆందోళన మొదలైంది. ఇవి కూడా చదవండి : పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల: ఎవరిది వారు ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏపీ (TEXT BOOKS) పాఠ్యపుస్తకాల్లో మార్పులు. కొత్త పుస్తకాలు ఇక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక జీవోలు

  • పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల: ఎవరిది వారు ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు #sscsuplimentaryhalltickets

    పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల: ఎవరిది వారు ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు #sscsuplimentary ఏపీ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఎవరి హాల్ టికెట్లు వాళ్లే డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయవలసిన అవసరం లేదు. కేవలం జిల్లా పేరు స్కూలు పేరు విద్యార్థి పేరు పుట్టిన తేదీ ఎంటర్ చేసి కింద కనిపించే డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే చాలు వెంటనే డౌన్లోడ్ అయిపోతుంది. క్రింది స్క్రీన్ షాట్ గమనించవచ్చు. #sscsuplimentaryhalltickets కింది లింక్ నొక్కి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ పోస్టు నచ్చితే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి పోస్ట్ కిందనున్న హార్ట్ సింబల్ నొక్కి లైక్ చేయండి. ఇలాంటి తాజా సమాచారం ఎప్పటికప్పుడు మీ ఫోన్లోకి అందుకోవాలంటే ఈ పోస్టు కింద ఉన్న సబ్స్క్రైబ్ ఫారం నింపి సబ్మిట్ చేయండి ధన్యవాదాలు

  • టమాటా పప్పు.. కోడిగుడ్డు కూర.. పోలింగ్‌ సిబ్బందికి మెనూ ఇదే!

    టమాటా పప్పు.. కోడిగుడ్డు కూర.. పోలింగ్‌ సిబ్బందికి మెనూ ఇదే! ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి సమతుల ఆహారం అందించాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది ఎండల తీవ్రత పెరిగింది. ఈ తరుణంలో పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం తప్పనిసరి. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి సమతుల ఆహారం అందించాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. ముందుగా సిబ్బంది ఈ నెల 12న ఎన్నికల సామగ్రితో వారికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు సమోసా, మజ్జిగ, 5 గంటలకు మజ్జిగ లేదా నిమ్మరసం అందిస్తారు. రాత్రి 7 నుంచి 8 గంటల మధ్యలో భోజనం (అన్నం, కూర, చపాతీ, టమాటా పప్పు, పెరుగు, చట్నీ) అందిస్తారు. పోలింగ్‌ రోజు 13న ఉదయం 6 గంటలకు టీ, రెండు అరటి పండ్లు, 8 నుంచి 9 మధ్య క్యారట్‌, టమాటాతో కూడిన ఉప్మా, పల్లీల చట్నీ, 11, 12 గంటల సమయంలో మజ్జిగ పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం (కోడిగుడ్డు కూర, ఓ కూరగాయ, చట్నీ, సాంబారు, పెరుగు) అందిస్తారు. మధ్యాహ్నం 3, 4 గంటల సమయాల్లో మజ్జిగ లేదా నిమ్మరసం పంపిణీ చేస్తారు. 5.30కి టీ, బిస్కెట్లు అందిస్తారు. ఈ ప్రక్రియ గ్రామాల్లో పంచాయతీ అధికారుల, పురపాలికల్లో ప్రత్యేకంగా నియామకమైన వారు పర్యవేక్షించేలా కార్యాచరణ రూపొందించారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఫ్యాన్లు, అవసరమైతే కూలర్లు ఏర్పాటు చేయనున్నారు.

  • ఎన్నికల గురించి ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రెస్ మీట్, ఈ సారి కొన్ని ప్రత్యేకం కొన్ని ఆసక్తికరం

    ఎన్నికల గురించి ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రెస్ మీట్, ఈ సారి కొన్ని ప్రత్యేకం కొన్ని ఆసక్తికరం: ఈరోజు మీడియా పాయింట్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారం వివరించారు. రాష్ట్రమంతటా 13వ తారీఖున అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలఎన్నికలు జరుగుతాయని పోలింగ్ ఉదయం ఏడు గంటలకు మొదలై ఆరు గంటలకు ముగుస్తుంది అన్నారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, పాడేరు, అరకు, రంపచోడవరం నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, మన్యం జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. ఈ సాయంత్రం 6 గంటల నుంచి సైలెంట్ పీరియడ్ మొదలవుతుందని ఈ సమయంలో ఎవరు కూడా ప్రచారం నిర్వహించడానికి వీలులేదని అది మైక్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా గాని ప్రచారం నిర్వహించడానికి వీలులేదని అయితే ప్రింట్ మీడియా ద్వారా రెండు రోజులు ప్రచారం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. పోలింగ్ రోజున పోలీస్ స్టేషన్ ఆవరణలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని అన్నారు. పర్యాటకులు వచ్చే తిరుపతి, అరకు వంటి ప్రాంతాలలో బోగస్ ఓట్లు జరిగే అవకాశం ఉన్నందున అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పోలింగ్ సిబ్బంది రేపు అనగా 12 వ తారీకు ఉదయాన్నే పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కి హాజరుకావాలని రేపు వారికి మరొకసారి శిక్షణ జరుగుతుందని అనంతరం సాయంత్రానికల్లా వారు పోలింగ్ స్టేషన్ కి సామాగ్రి తో సహా చేరుకుంటారని పోలింగ్ సిబ్బంది ఆ రాత్రి పోలింగ్ స్టేషన్లోనే బస చేయాలని పేర్కొన్నారు. అదే సాయంత్రం పోలింగ్ ఏజెంట్లు నియామకం జరుగుతుందని వారికి నియామక పత్రాలు అందచేస్తారని తెలియజేశారు. 13వ తేదీ ఉదయం 5:30 కి ఏజెంట్ల సమక్షంలో మాక్ పోల్ నిర్వహిస్తారని తెలియజేశారు. ఒక పార్టీ తరఫున ఒక ఏజెంట్ మాత్రమే నియమించబడతారు. ఏజెంట్లు నియామకం విషయంలో ఎటువంటి నిబంధనలు లేవని అయితే ఉద్యోగులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఏజెంట్లుగా అర్హులు కారని తెలియజేశారు. అదే అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏ ఓటర్ అయినా ఏజెంట్గా కూర్చోవడానికి అర్హుడని అన్నారు. ఏజెంట్లుగా నియమించబడిన వారితో పాటు ఇద్దరూ రిలీవింగ్ ఏజెంట్లను కూడా నియమిస్తారని చెప్పారు. పోలింగ్ స్టేషన్ కి రెండు వందల మీటర్ల దూరంలో ఎటువంటి ప్రచారం గానీ పార్టీల ప్రజల సందడి గాని ఉండకూడదని 200 మీటర్ల అవతల పార్టీలు తమ టెంట్లు వేసుకొని అభ్యర్థులకు స్లిప్పులు అందించవచ్చు అని అయితే ఆ స్లిప్పుల్లో పార్టీ సింబల్ గానీ అభ్యర్థుల పేర్లు గాని ఉండకూడదని తెలిపారు ఏ పార్టీ వారైనా ఓటర్లను పోలింగ్ స్టేషన్ వద్దకు వారి ఖర్చులతో వాహనాల ద్వారా తీసుకురావడానికి వీల్లేదని అలా తీసుకువచ్చినట్లైతే వాహనాలను సీజ్ చేస్తామని అన్నారు. సొంత వాహనాల్లో వచ్చిన ఓటర్లు తమ సొంత వాహనాన్ని 200 మీటర్ల అవతల పార్కింగ్ చేసుకోవాలని తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న అభ్యర్థుల మూడు వాహనాలు పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేస్తున్న అభ్యర్థుల మూడు వాహనాలు అనుమతించబడతాయని తెలిపారు. పోలింగ్ స్టేషన్ ప్రాంగణంలోకి ఏ వ్యక్తి కూడా ఆయుధాలతో గాని మొబైల్ ఫోన్స్ తో గాని అనుమతించబడరు. పోలింగ్ స్టేషన్లో ప్రీసైడింగ్ ఆఫీసర్ మాత్రమే మొబైల్ ఫోన్ వాడటానికి అనుమతి ఉంటుంది. ఈసారి అనేక పోలింగ్ స్టేషన్లో వెబ్ కెమెరాల ద్వారా వెబ్ కాస్టింగ్ చేస్తారు. బందోబస్తు కోసం కేంద్రం నుంచి సీఆర్పీఎఫ్, మన రాష్ట్రంలోని పోలీసులతో సహా తమిళనాడు కర్ణాటక ఇతర రాష్ట్రాల నుంచి వేలమంది పోలీసు సిబ్బందిని రప్పిస్తున్నారు. క్యూ లైన్లు నిర్వహించడానికి ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ మరియు ఎక్స్ ఆర్మీ, రిటైర్డ్ ఆర్మీ పర్సన్స్ ని నియమిస్తారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులైన ప్రస్తుత ఎమ్మెల్యేలు గానీ ఎంపీలు గాని మంత్రులు గాని ఎవరైనా వారి సంరక్షకులతో ఆయుధాలతో పోలింగ్ స్టేషన్ లోకి ప్రవేశించడానికి అనుమతి లేదు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల 44 వేలకు పైగా పోస్టల్ బ్యాలెట్లు నమోదు అయ్యాయి. ప్రెస్ మీట్ లోని మిగతా ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడానికి ఈ క్రింది వీడియో చూడగలరు 👇

  • ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా! ఈ జాగ్రత్తలు తప్పనిసరి !! #BuyingHouse

    ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా! ఈ జాగ్రత్తలు తప్పనిసరి !! #BuyingHouse ఇల్లు కొనడం(House Buying) ప్రతి ఒక్కరి కల, కానీ ఇల్లు కొనడం అంత ఈజీ అయితే కాదు. మధ్యతరగతి వ్యక్తులు అనేక విధాలుగా పొదుపు చేసి ఇల్లు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఇల్లు కొనుగోలు చేసే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు(precautions) తీసుకోవాలో ఇప్పుడు చుద్దాం ఇల్లు కొనడం(House Buying) ప్రతి ఒక్కరి కల, కానీ ఇల్లు కొనడం అంత ఈజీ అయితే కాదు. మధ్యతరగతి వ్యక్తులు అనేక విధాలుగా పొదుపు చేసి ఇల్లు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఇల్లు కొనుగోలు చేసే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు(precautions) తీసుకోవాలో ఇప్పుడు చుద్దాం.  #BuyingHouse మీరు చాలా కాలం పాటు పెట్టుబడి పెట్టినట్లయితే, మీ ఇల్లు(house) కొనుగోలు చేయాలనే మీ కల నెరవేరుతుంది. మీరు రుణం తీసుకోకుండా పూర్తి చెల్లింపుతో ఇంటిని పొందవచ్చు. ముందుగా ఇల్లు కొనడానికి సరైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. సరసమైన ధర, అవసరం, చట్టపరమైన ఆమోదం మొదలైనవాటిని దృష్టిలో ఉంచుకుని మీరు స్థలాన్ని ఎంచుకోవచ్చు. డీల్‌ను ఖరారు చేసుకోవడానికి ముందు ఆ ప్రాంతంలోని వ్యక్తులను కలవండి. ఆస్తుల సగటు రేట్ల గురించి సమాచారం తెలుసుకోండి. ఆపై డీల్ మంచి రేటుకు వస్తుందా లేదా అని డెవలపర్‌తో చర్చలు జరిపి ఫైనల్ చేసుకోండి. ఇక లోన్ ద్వారా ఇల్లు తీసుకోవాలని భావిస్తే డౌన్ పేమెంట్ చేయడానికి మీ వద్ద తగినంత మొత్తం ఉండాలి. ఇంటిని కొనుగోలు చేయడానికి, మీరు దాని ధరలో 30 శాతం నగదును కలిగి ఉండాలి, తద్వారా మీరు డౌన్ పేమెంట్ చేయడం ద్వారా ఇంటిని కొనుగోలు చేయవచ్చు. ఇక ఏజెంట్ ద్వారా ఇల్లు కొనుగోలు చేస్తే, వారు ఒకటి నుంచి రెండు శాతం కమీషన్ తీసుకుంటారు. ఏజెంట్లు విక్రయదారుల నుంచి కమీషన్ కూడా తీసుకుంటారు. ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డెవలపర్, కొనుగోలుదారు మధ్య ఏజెంట్ లేకుంటే కమీషన్ సేవ్ చేయబడుతుంది. కాబట్టి డెవలపర్లు లేదా విక్రేతల నుంచి నేరుగా ఇళ్లను కొనుగోలు చేయడానికి ప్రయత్నించండి. గృహాలను కొనుగోలు చేసే విషయంలో ఎక్కువ నగదు రూపంలో చెల్లించడానికి ప్రయత్నించండి. ఇది మీకు మరింత తగ్గింపును ఇస్తుంది. మిగతా మొత్తాన్ని లోన్ ద్వారా చెల్లించవచ్చు. పండుగల సీజన్లో, డెవలపర్లు, విక్రేతలు గృహ కొనుగోలుదారుల కోసం ఆఫర్లు, డిస్కౌంట్లతో ముందుకు వస్తారు. అలాంటి సమయాల్లో కొనుగోలు చేస్తే మరింత తగ్గింపులను పొందవచ్చు. ఇప్పటికే ఇంటిని కొనుగోలు చేసిన మీ స్నేహితులు లేదా పొరుగువారితో మాట్లాడండి. అమ్మకానికి అందుబాటులో ఉన్న ఇళ్ల గురించి వారు మీకు సమాచారాన్ని అందించగలరు. అప్పుడు నేరుగా మీరు సంబంధిత వ్యక్తులను సంప్రదించవచ్చు. మీరు ఇల్లు కొనుగోలు చేసే సమయంలో మీకు తెలిన వ్యక్తులు కూడా కొనుగోలు చేయాలని భావిస్తే ఒకే ప్రాజెక్ట్‌లో ఒక సమూహంలో ఇళ్లను కొనుగోలు చేయండి. అలా చేస్తే విక్రేత అదనపు తగ్గింపులను ఇచ్చే అవకాశం ఉంటుంది. మీరు హౌసింగ్ ప్రాజెక్ట్‌లో ఆస్తిని కొనుగోలు చేస్తుంటే, డెవలపర్ చట్టబద్ధంగా అన్ని అనుమతులను పొంది ఉన్నారో లేదా నిర్ధారించుకోండి. MORE NEWS/ARTICLES ఏపీ (TEXT BOOKS) పాఠ్యపుస్తకాల్లో మార్పులు. కొత్త పుస్తకాలు ఇక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్లు బకాయిలు కళ్ల చూడకుండానే చనిపోతున్నారు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో గందరగోళం.. ఎన్నికల సంఘం ప్రత్యేక ఉత్తర్వులు టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టోలో ఉద్యోగులకు తీపికబురు! కూటమి మేనిఫెస్టో వచ్చేసిందహో.. అదిరిపోయిందిగా..!!

  • పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో గందరగోళం.. ఎన్నికల సంఘం ప్రత్యేక ఉత్తర్వులు #APElections2024

    పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో గందరగోళం.. ఎన్నికల సంఘం ప్రత్యేక ఉత్తర్వులు #APElections2024 ఏపీ సార్వత్రిక ఎన్నికలు (AP Election 2024) ఈనెల 13వ తేదీన జరుగుతుండటంతో.. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రకియను ఎన్నికల సంఘం (Election Commission) చేపట్టింది. ఈ పోస్టల్ బ్యాలెట్‌లో గందరగోళం నెలకొంది. చాలా మంది ఉద్యోగులకు సకాలంలో డ్యూటీ పాస్‌లు అందలేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమరావతి: ఏపీ సార్వత్రిక ఎన్నికలు (AP Election 2024) ఈనెల 13వ తేదీన జరుగుతుండటంతో.. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రకియను ఎన్నికల సంఘం (Election Commission) చేపట్టింది. ఈ పోస్టల్ బ్యాలెట్‌లో గందరగోళం నెలకొంది. చాలా మంది ఉద్యోగులకు సకాలంలో డ్యూటీ పాస్‌లు అందలేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మే 1లోగా ఫార్మ్ 12ను ఉద్యోగులు, ఉపాధ్యాయులు సబ్మిట్ చేయలేకపోయారు. తమ ఓటు కోల్పోతున్నామని ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులుత తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్ధితిని చక్కదిద్దేందుకు ఈసీ ప్రయత్నం చేసింది. ఈసీ ఆదేశాల మేరకు ఆర్వోలకు పోస్టల్ బ్యాలెట్ విషయంలో అదనపు ఆదేశాలను ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా జారీ చేశారు. సకాలంలో సమాచారం లేకపోవడంతో పోస్టల్ బ్యాలెట్ పొందలేకపోయామని భావిస్తున్న ఉద్యోగులకు మరో అవకాశం ఇవ్వాలని సీఈవో ముఖేష్ కుమార్ మీనా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల్లో కొందరు అనివార్య కారణాలతో ఫాం 12 సబ్మిట్ చేయలేకపోవడంతో ఓటు వేసే అవకాశం లేకుండా పోతుందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి.. ఓటును కోల్పోవడానికి వీలు లేదని ఎన్నికల సంఘం భావించింది. మే 1, 2024లోగా ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి ఫాం 12ను అనివార్య కారణాలతో సబ్మిట్ చేయని పక్షంలో వారికి తిరిగి అవకాశం ఇవ్వాలని సీఈఓ మీనా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి వారికి ఎన్నికల సంఘం మరో అవకాశం ఇస్తోందని సీఈవో మీనా వెల్లడించారు. ఈనెల 7, 8 తేదీల్లో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఫాం 12ను ఉద్యోగులు వారి ఓటు ఉన్న ఆర్వో పరిధిలోని ఫెసిలిటేషన్ సెంటర్లో సబ్మిట్ చేయాలని తెలిపారు. ఇలాంటి వారికి ఓటింగ్ కల్పించేందుకు 175 నియోజకవర్గాల ఆర్వోలు వారి నుంచి ఫాం 12ను వారి పరిధిలో ఓటు ఉంటే స్వీకరించాలని ఆదేశించారు. ఉద్యోగి ఓటరు కార్డు వివరాలు పరిశీలించి, పోస్టల్ బ్యాలెట్ కేటాయించలేదని నిర్ధారించుకున్న తర్వాత ఓటు వేసే అవకాశం 7, 8 తేదీల్లో ఇవ్వాలని ఆదేశించారు. ఉద్యోగులకు ఈసీ ఆదేశాల మేరకు మరో అవకాశం కల్పిస్తున్నట్టు ఆర్వోలు సంబంధిత రాజకీయ పార్టీలకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఎన్నికల డ్యూటీ పక్క జిల్లాలో పడి ఫాం 12 సబ్మిట్ చేయని ఉద్యోగులకు వారి ఓటు ఉన్న పరిధిలో ఆర్వో ఫెసిలిటేషన్ సెంటర్‌కు వెళ్లి ఓటు పొందవచ్చని సూచించారు. ఉద్యోగులు తమ అపాయింట్మెంట్ లెటర్‌తో పాటు వెళ్లి ఈ నెల 7, 8 తేదీల్లో ఓటు హక్కు వినియోగించుకోవచ్చని సూచించారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి ఓటును ఆర్వోలు తిరస్కరించినట్టు తెలితే వారిపై చర్యలు తీసుకుంటామని సీఈవో మీనా హెచ్చరించారు. ఈ మేరకు అందరు ఆర్వోలకు సీఈవో ముఖేష్ కుమార్ మీనా మెమో జారీ చేశారు. 🔸పెన్షనర్లు బకాయిలు కళ్ల చూడకుండానే చనిపోతున్నారు 🔸టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టోలో ఉద్యోగులకు తీపికబురు! 🔸ప్రభుత్వ ఉద్యోగులకోసం వైఎస్సార్సీపీ మానిఫెస్టోలో ఏముంది?

  • ఏపీ (TEXT BOOKS) పాఠ్యపుస్తకాల్లో మార్పులు. కొత్త పుస్తకాలు ఇక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.#NT_BOOKS #CSE_AP

    ఏపీ (TEXT BOOKS) పాఠ్యపుస్తకాల్లో మార్పులు. కొత్త పుస్తకాలు ఇక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. #NT_BOOKS #CSE_AP 02.05.2024 Google Meet లో డైరెక్టర్ పాఠ్య పుస్తకా ముద్రణాలయం వారు కొన్ని సూచనలు ఆదేశించడం జరిగినది. N.T. Books 2024-2025 సంవత్సరం నకు గాను సబ్జెక్ట్స్ మార్పులు టైటిల్స్ కొన్ని మార్పులు జరిగినవి. 1,2, తరగతి మినహా కొన్ని తరగతులు ముఖ చిత్రాలు కవరు పేజీ మార్పులు చెయ్యడం జరిగినవి. 1. 10 వ తరగతి ఈ సంవత్సరం గాను పాఠ్యపుస్తకాలు మారినవి.కొత్త సిలబస్ 2. 6 వ తరగతి మరియు 7వ తరగతి ఇంగ్లీష్, ఇంగ్లీష్ నాన్-టైటీల్ సింగిల్ బుక్ (విలీనం) మార్పులు జరిగినవి. 3. 6 నుంచి 10 వ తరగతి వరకు EVS బుక్ ఈ సంవత్సరం సిలబస్ లో తొలగిస్తున్నారు. 4. 9 వతరగతి మరియు 10 వతరగతి హిందీ , హిందీ నాన్-టైటీల్ సింగిల్ బుక్ (విలినం) మార్పులు జరిగినవి. 5. 10 వతరగతి తెలుగు, తెలుగునాన్-టైటీల్ సింగిల్ బుక్ (విలనం ) మార్పులు జరిగినవి. 6. 09 వతరగతి మరియు 10 వతరగతి హెల్త్ & ఫిజికల్ ఎడ్యుకేషన్ & ఇన్ఫర్మేషన్ & కమ్యూనికేషన్ టెక్నాలజీ (హైస్కూల్స్ కు రెండు పుస్తకాలు) చొప్పున సరఫరా చేయబడుతుంది #NT_BOOKS #CSE_AP MORE NEWS 🔸 పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో గందరగోళం.. ఎన్నికల సంఘం ప్రత్యేక ఉత్తర్వులు 🔸 పెన్షనర్లు బకాయిలు కళ్ల చూడకుండానే చనిపోతున్నారు 🔸 AP Elections 2024: కూటమి మేనిఫెస్టో వచ్చేసిందహో.. అదిరిపోయింది

  • పెన్షనర్లు బకాయిలు కళ్ల చూడకుండానే చనిపోతున్నారు #pensioners #arrears

    పెన్షనర్లు బకాయిలు కళ్ల చూడకుండానే చనిపోతున్నారు #pensioners #arrears రెండో ప్రపంచయుద్ధం తర్వాత మొదటిసారి ఈ హయాంలోనే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గించారని ఆంధ్రా పెన్షనర్స్‌ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్‌ తెలిపారు ఒక్కో విశ్రాంత ఉద్యోగికి రూ. 2.5 లక్షల పైనే రావాలి రెండో ప్రపంచయుద్ధం తర్వాత జగన్‌ హయాంలోనే జీతాలు, పింఛన్లు తగ్గించారు వృద్ధులనీ చూడకుండా అదనపు పింఛనులో కోత పెట్టారు గత ఎన్నికల్లో వైకాపాకు మద్దతు ఇచ్చి తప్పు చేశాం ‘ఈనాడు’తో ఆంధ్రా పెన్షనర్స్‌ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్‌ అమరావతి: రెండో ప్రపంచయుద్ధం తర్వాత మొదటిసారి ఏపీలో ఈ ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గించారని ఆంధ్రా పెన్షనర్స్‌ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్‌ తెలిపారు. ఉద్యోగులకు ఎంతో మేలు చేసిన తెదేపా అధినేత చంద్రబాబును కాదని, గత ఎన్నికల్లో గెలిపించుకున్నందుకు తమకు బుద్ధి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సమయానికి పింఛను, ఆర్థిక ప్రయోజనాలను చంద్రబాబు అందించారని, ఈసారి ఆయనకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఉద్యోగులు, పింఛనుదారుల సమస్యలపై ప్రశ్నించేందుకే ఆంధ్రా పెన్షనర్స్‌ పార్టీ స్థాపించానని పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు ప్రభుత్వం చేసిన అన్యాయాలపై ఆయన ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నా.. తెదేపా హయాంలో ప్రతి నెలా ఒకటో తేదీనే పింఛను ఇచ్చేవారు. పీఆర్సీ ఫిట్‌మెంట్‌ 43%, 10నెలల బకాయిలు ఇచ్చారు. 70ఏళ్లకు 10% అదనపు పింఛను ఇచ్చారు. ఇప్పుడు మ్యానిఫెస్టోలోనూ ఉద్యోగులకు సముచిత గౌరవం ఇచ్చారు. ఒకటో తేదీన పింఛన్లు చెల్లిస్తామని, బకాయిలు చెల్లించే ఏర్పాటు చేస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఏనాడూ ఒకటో తేదీన ఇవ్వలేదు ఈ ప్రభుత్వ హయాంలో ఏనాడూ ఒకటో తేదీన పింఛను ఇవ్వలేదు. కొన్ని నెలలు 18వ తేదీ వరకు పడలేదు. దీనివల్ల వృద్ధాశ్రమాల్లో ఉండే కొందరు విశ్రాంత ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. అనారోగ్యాలు ఉన్నవారు మందులు కొనుక్కోవడానికీ కష్టాలు పడాల్సి వచ్చింది. మధ్యంతర భృతి 27% ఇచ్చి ఫిట్‌మెంట్‌ 23%కి పరిమితం చేశారు. దీంతో జీతాలు, పింఛన్లు తగ్గిపోయాయి. వృద్ధాప్యంలో ఉద్యోగులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం అదనపు పింఛనులో కోత వేసింది. పెద్దవారిపై కనికరం లేకుండా వ్యవహరించింది. 70 ఏళ్లకు 10% పింఛను చంద్రబాబు ఇస్తే.. వీరు దాన్ని 7%కు తగ్గించారు. 75-80 ఏళ్లకు 15% పింఛను ఉంటే దాన్ని 12%కు తగ్గించారు. ఎప్పుడిస్తారో తెలియదు ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిల డబ్బులు చూడకుండానే చాలామంది చనిపోయారు. 2019 నుంచి ఒక్కో పింఛనుదారు రూ.2.50-3 లక్షలకు బకాయిలు ఉన్నాయి. వీటిని ఎప్పుడు చెల్లిస్తారో తెలియదు. రూ.1,500 కోట్లను నగదు రూపంలో చెల్లించాల్సి ఉంది.  2018 జులై, 2019 జనవరి డీఆర్‌లకు సంబంధించి 66 నెలల బకాయిలు ఇవ్వలేదు. 2019 జులై, 2020 జనవరి, జులై, 2021 జనవరి, జులై డీఆర్‌ దాదాపు 54 నెలల బకాయిలు చెల్లింపుపై స్పష్టత లేదు. 2022, 2023 డీఆర్‌ బకాయిల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కొంతమందికి అకారణంగా పింఛను నిలిపివేస్తున్నారు. అలాంటి వాళ్లు నాకు ఫోన్‌చేస్తే ఆర్థికశాఖను సంప్రదిస్తున్నా. గతంలో కంప్యూటర్‌ తప్పు కారణంగా మధ్యంతర భృతి ఎక్కువగా ఇచ్చినందున ఇప్పుడు పింఛను నిలిపివేసినట్లు చెబుతున్నారు. ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉన్నా.. దాన్ని పాటించడంలేదు. ఆర్థికశాఖకు పంపిన దస్త్రాలను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌ సకాలంలో క్లియర్‌ చేయడం లేదు. దీంతో కొందరికి నెలల తరబడి పింఛన్లు ఆగిపోతున్నాయి ఆసుపత్రి బిల్లులూ రావట్లేదు ఉద్యోగులు, పింఛనుదారులు ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు గతంలో ఎప్పుడూ లేవు. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఆరోగ్యకార్డులను చాలా ఆసుపత్రులు అనుమతించడం లేదు. చికిత్స చేయించుకుని బిల్లులు పెట్టినా సకాలంలో రావు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు ప్రభుత్వం చేసిన అన్యాయంపై జిల్లాలవారీగా సమావేశాలు నిర్వహించి, వివరిస్తున్నాం. పింఛనుదారుల సమస్యలపై నిత్యం నాకు ఫోన్లు వస్తున్నాయి. అవి వింటే బాధేస్తోంది. తెదేపాకు మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నాం.

  • టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టోలో ఉద్యోగులకు తీపికబురు! #APElections2024

    టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టోలో ఉద్యోగులకు తీపికబురు! #APElections2024 #tdpjanasenamanifesto Andhrapradesh: టీడీపీ - జనసేన - బీజేపీ మేనిఫెస్టో విడుదలైంది. మంగళవారం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలతో కలిసి మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. బీజేపీ దేశ స్థాయిలో మేనిఫెస్టో విడుదల చేసిందన్నారు. టీడీపీ - జనసేన కసరత్తు చేసి మేనిఫెస్టో రూపకల్పన చేశామని చెప్పుకొచ్చారు. ప్రజలను గెలిపించేందుకే తమ కలయిక అని స్పష్టం చేశారు. అమరావతి, ఏప్రిల్ 30: టీడీపీ - జనసేన - బీజేపీ మేనిఫెస్టో (TDP-Janasena-BJP Manifesto) విడుదలైంది. మంగళవారం టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu), జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Jenasena Chief Pawan Kalyan), బీజేపీ ముఖ్య నేతలతో కలిసి మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. బీజేపీ (BJP) దేశ స్థాయిలో మేనిఫెస్టో విడుదల చేసిందన్నారు. టీడీపీ - జనసేన కసరత్తు చేసి మేనిఫెస్టో రూపకల్పన చేశామని చెప్పుకొచ్చారు. ప్రజలను గెలిపించేందుకే తమ కలయిక అని స్పష్టం చేశారు. పూర్తి మానిఫెస్టో కోసం ఇక్కడ నొక్కండి ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకే తాము సర్దుబాటు చేసుకున్నామని చంద్రబాబు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉద్యోగులు చాలా నష్టపోయారన్నారు. ఉపాధ్యాయులను మద్యం షాపుల వద్ద నిలబెట్టారన్నారు. ఉద్యోగులకు వచ్చే బెనిఫిట్స్ ఏం ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఉద్యోగుల్లో ఆత్మ విశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచుతామని తెలిపారు. పీఆర్సీ ప్రకటిస్తామని.. ఆలోగా ఇంటెరిమ్ రిలీఫ్ ఇస్తామని ప్రకటించారు. సీపీఎస్ రద్దు సమస్యపై కసరత్తు చేసి పరిష్కరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో ముఖ్య అంశాలు... 20 లక్షల మంది యువతకు ఉపాధి. నెలకు రూ. 3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి. మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. తల్లికి వందనం ఒక్కో బిడ్డకు రూ. 15 వేలు. స్కిల్ గణన చేపడతాం. ఎంఎస్ఎంఈలకు ప్రొత్సాహాకాలు. 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తాం. మెగా డీఎస్సీ మీదే తొలి సంతకం. ఆడపిల్లల విద్యకు కలలకు రెక్కలు పథకం.. వడ్డీ లేని రుణాలిస్తాం. అన్న క్యాంటీన్లు, పండుగ కానుకలు ఇస్తాం. వలంటీర్లకు రూ. 10 వేలు జీతం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల నుంచి కాపులకు దామాషా పద్దతిన రిజర్వేషన్లు అమలు చేస్తాం. అగ్ర వర్ణ పేదలకు న్యాయం చేస్తాం. ఇప్పటికే మంజూరైన ఇళ్ల పట్టాల్లో ఇళ్లు కట్టిస్తాం. విజయవాడలో హజ్ హౌస్. పూర్తి మేనిఫెస్టో కోసం ఇక్కడ నొక్కండి

  • AP Elections 2024: కూటమి మేనిఫెస్టో వచ్చేసిందహో.. అదిరిపోయిందిగా..!!

    వైసీపీ మేనిఫెస్టో (YSRCP Manifesto) విడుదల కావడంతో.. కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తుందా..? అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకే విడుదల కావాల్సిన మేనిఫెస్టో కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయడం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బీజేపీ ముఖ్యనేతలతో కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఇదిగో ఫుల్ మేనిఫెస్టో. కీలక హామీలు.. డ్రైవర్లకు రూ. 15 వేలు.. చంద్రన్న భీమా అమలు ప్రతి కుటుంబానికి జీవిత భీమా హెల్త్ కార్డ్స్ అందచేస్తాం విద్యుత్ ఛార్జీలు నియంత్రిస్తాం చెత్త పన్నును రద్దు చేస్తాం ఇంటి పన్నులను సమీక్షిస్తాం ఉచిత ఇసుక విధానం అమలు చేస్తాం కేజీ టూ పీజీ సిలబస్ రివ్యూ చేస్తాం విదేశీ విద్యను అందరికీ వర్తింపజేస్తాం వంద రోజుల్లో గంజాయి, డ్రగ్స్ కంట్రోల్ చేస్తాం అమరావతిలో ప్రజా రాజధాని నిర్మాణం ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలకు అధిక ప్రాధాన్యం దేవాలయాలు.. బ్రహ్మణుస సంక్షేమానికి పెద్ద పీట హిందూ ఆస్తుల పరిరక్షణ : చంద్రబాబు విద్యార్థులు, ఆడపిల్లలు, వలంటీర్లు.. టీచర్లకు శుభవార్త! ఆడపిల్లల విద్యకు కలలకు రెక్కలు పథకం చదువు కోసం వడ్డీ లేని రుణాలిస్తాం అన్నా క్యాంటీన్లు, పండుగ కానుకలు ఇస్తాం ఉద్యోగులు చాలా నష్టపోయారు.. ఉపాధ్యాయులను మద్యం షాపుల వద్ద నిలబెట్టారు ఉద్యోగులకు వచ్చే బెనిఫిట్స్ ఏం ఇవ్వడం లేదు ఉద్యోగుల్లో ఆత్మ విశ్వాసాన్ని.. ఆత్మగౌరవాన్ని పెంచుతాం పీఆర్సీ ప్రకటిస్తాం.. ఆలోగా ఇంటెరిమ్ రిలీఫ్ ఇస్తాం సీపీఎస్ రద్దు సమస్యపై కసరత్తు చేసి పరిష్కరిస్తాం వలంటీర్లకు రూ. 10 వేలు జీతం ఇస్తాం EWS రిజర్వేషన్ల నుంచి కాపులకు దామాషా పద్దతిన రిజర్వేషన్లు అమలు చేస్తాం అగ్రవర్ణ పేదలకు న్యాయం చేస్తాం ఇప్పటికే మంజూరైన ఇళ్ల పట్టాల్లో ఇళ్లు కట్టిస్తాం. విజయవాడలో హజ్ హౌస్ నిర్మిస్తాం : చంద్రబాబు ఊహించని రీతిలో పెన్షన్లు పెంపు.. టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ రిలీజ్ చేశారు. ఇందులో ఒక్కో పథకం ఒక్కో రీతిలో రాష్ట్ర ప్రజలను ఆకట్టుకునేలా ఉంది. మరీ ముఖ్యంగా.. ఇటీవల వైసీపీ మేనిఫెస్టోలో (YSRCP Manifesto) పెన్షన్లు రూ. 3500 పెంచుతామని ప్రకటించిన సంగతి తెలిసిందే. కూటమి మాత్రం ఇంకో 500 రూపాయిలు పెంచుతూ మొత్తం.. 4వేల రూపాయిలు ఇస్తామని ప్రకటించింది. అది కూడా ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని కూటమి మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. ఇక.. వికలాంగులకు రూ. 6 వేలు, పూర్తి వికలాంగులకు రూ. 10 వేల పెన్షన్ ఇస్తామని కూటమి ప్రకటిచింది. ఈ పెన్షన్ల పెంపు అనేది వైసీపీకి బిగ్ షాకేనని.. ఇది నిజంగా ఊహించని రీతిలో ఉన్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. బీసీలకు వరాలు..! కూటమి మేనిఫెస్టో విడుదల బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లల్లో రూ. 1.50 లక్షల కోట్లు ఖర్చు పెడతాం బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్లు బీసీ కార్పోరేషన్లను ఆర్థికంగా బలోపేతం చేస్తాం బీసీల స్వయం ఉపాధి కోసం ఏడాదికి రూ. 10 వేల కోట్లు ఆధునిక పనిముట్లతో ఆదరణ పథకం అమలు చేస్తాం పవర్ లూం, హ్యాండ్ లూంలకు కొంత మేర ఉచిత విద్యుత్ మత్స్యకారులను ఆదుకుంటాం డ్వాక్రా మహిళలకు రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం సంపద సృష్టిస్తాం.. ఆదాయాన్ని పంచుతాం మేనిఫెస్టో క్లియర్ కట్‌గా చెప్పిన కూటమి పార్టీలు అదిరిపోయిందిగా.. మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగం బీజేపీ దేశ స్థాయిలో మేనిఫెస్టో విడుదల చేసింది టీడీపీ-జనసేన కసరత్తు చేసి మేనిఫెస్టో రూపకల్పన చేశాం ప్రజలను గెలిపించేందుకే మా కలయిక ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకే మేం సర్దుబాటు చేసుకున్నాం 20 లక్షల మంది యువతకు ఉపాధి నెలకు రూ. 3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తల్లికి వందనం ఒక్కో బిడ్డకు రూ. 15 వేలు స్కిల్ గణన చేపడతాం ఎంఎస్ఎంఈలకు ప్రొత్సాహాకాలు 10 శాతం EWS రిజర్వేషన్లు అమలు చేస్తాం సమగ్ర ఇసుక విధానం తెస్తాం ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా చేపడతాం మెగా డీఎస్సీ మీదే తొలి సంతకం పెడతాం: చంద్రబాబు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల బీమా టీడీపీ సూపర్ సిక్స్, జనసేన షణ్ముఖ వ్యూహం.. బీజేపీ పేర్కొన్న అంశాలతో మేనిఫెస్టో రూపకల్పన

  • ఏపీ మోడల్‌ స్కూల్స్‌ 6వ తరగతి ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదల #APMSExamResult

    APMS 6th class exam Result | ఏపీలోని ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అమరావతి: ఏపీలో ఆదర్శ (మోడల్) పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 164 మోడల్‌ స్కూల్స్‌లో ఏప్రిల్‌ 21న ఈ పరీక్ష నిర్వహించగా.. 31,376 మంది విద్యార్థులు హాజరయ్యారు. సోమవారం ఈ ఫలితాలను విడుదల చేసినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ తెలిపారు. క్యాండిటేట్‌ ఐడీ, పుట్టిన తేదీ వివరాలు, వెరిఫికేషన్‌ కోడ్‌ను ఎంటర్‌ చేయడం ద్వారా విద్యార్థులు తమ మార్కుల మెమోను పొందొచ్చన్నారు. అడ్మిషన్లకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఆయా మోడల్‌ స్కూల్స్‌లో సంప్రదించాలని ఆయన సూచించారు.

bottom of page