top of page

8 కీలక బిల్లులకు ఏపీ శాసనమండలి ఆమోదం: AP Legislative Assembly Approved 8 Key Bills

ఇప్పటికే శాసనసభలో ఆమోదం పొందిన 8 కీలక బిల్లులకు శుక్రవారం శాసనమండలి ఆమోదం తెలిపింది. 

8 కీలక బిల్లులకు ఏపీ శాసనమండలి ఆమోదం
8 కీలక బిల్లులకు ఏపీ శాసనమండలి ఆమోదం

అమరావతి: ఇప్పటికే శాసనసభలో ఆమోదం పొందిన 8 కీలక బిల్లులకు శుక్రవారం శాసనమండలి ఆమోదం తెలిపింది. విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని కేంద్ర పౌరవిమానయాన శాఖను కోరుతూ మండలి తీర్మానం చేసింది. 

మండలిలో ఆమోదం పొందిన బిల్లులివే..

  • చెత్తపన్ను విధిస్తూ గత ప్రభుత్వం చేసిన చట్టాన్ని శాసనమండలి రద్దు చేసింది

  • లోకాయుక్త సవరణ బిల్లు 2024కు శాసనమండలి ఆమోదం

  • గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ సవరణ బిల్లు 2024కు శాసన మండలి ఆమోదం

  • ఏపీలో సహజవాయు వినియోగంపై జీఎస్టీ పన్నును తగ్గిస్తూ జీఎస్టీ సవరణ బిల్లుకు మండలి ఆమోదం

  • ఏపీ హిందూ ధార్మిక, మత సంస్థలు దేవాదాయ చట్ట సవరణ బిల్లుకు శాసన మండలి ఆమోదం 

  • ఏపీ మౌలిక సదుపాయాలు న్యాయపరమైన పారదర్శకత జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు బిల్లుకు ఆమోదం

  • ఏపీ ల్యాండ్ గ్రాబింగ్  యాక్ట్ 2024  రద్దుకు  శాసనమండలి ఆమోదం

  • పీడీ యాక్ట్‌ సవరణ బిల్లు 2024కు ఆమోదం తెలిపింది. కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన అనంతరం శాసనమండలి నిరవధిక వాయిదా పడింది.

 
 
 

Comments


bottom of page