₹8 వేల్లోపు లావా నుంచి 5జీ ఫోన్.. ఫీచర్లు ఇవే : Lava Shark 5G
- AP Teachers TV
- May 23
- 1 min read

Lava Shark 5G: బడ్జెట్ ధరలో లావా కొత్త మొబైల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఇవే..
Lava Shark 5G | ఇంటర్నెట్ డెస్క్: దేశీయ మొబైల్ తయారీ కంపెనీ లావా (Lava) బడ్జెట్ ధరలో మరో కొత్త మొబైల్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. లావా షార్క్ 5జీ (Lava Shark 5G) పేరిట దీన్ని తీసుకొచ్చింది. ఆకర్షణీయమైన లుక్‌తో, IP54 రేటింగ్‌తో మార్కెట్లోకి విడుదల చేసింది. కేవలం ఒక్క వేరియంట్‌లోనే అందుబాటులోకి తీసుకొచ్చింది. 4జీబీ +64జీబీ వేరియంట్ ధర రూ.7,999గా కంపెనీ నిర్ణయించింది.
6.75 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేటుతో వస్తోంది. UNISOC T765 ప్రాసెసర్‌తో తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా పనిచేస్తుంది. ఇక కెమెరా విషయానికొస్తే.. ఇందులో 13 ఎంపీ డ్యూయల్ కెమెరా అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 ఎంపీ కెమెరా ఇచ్చారు. 5000mAh బ్యాటరీతో తీసుకొచ్చిన ఈ మొబైల్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. విక్రయాలు ప్రారంభమయ్యాయని.. లావా ఇ-స్టోర్‌తో పాటు కంపెనీ రిటైల్ దుకాణాల ద్వారా వీటిని కొనుగోలు చేయొచ్చని కంపెనీ తెలిపింది.












Comments