Andhra News: ఏపీలో ఎనిమిది మంది IAS అధికారుల బదిలీ
- AP Teachers TV
- Apr 13
- 1 min read
8 IAS officers Trnasfer in Andhra Pradesh
ఏపీలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ బదిలీలకు సంబంధించి సీఎస్ విజయానంద్ ఆదివారం ఉత్తర్వులు విడుదల చేశారు

అమరావతి: ఏపీలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ బదిలీలకు సంబంధించి సీఎస్ విజయానంద్ ఆదివారం ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రస్తుతం రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆర్పీ సిసోదియా.. చేనేత, జౌళి పరిశ్రమల మంత్రిత్వశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ అయ్యారు. అలాగే, సీసీఎల్‌ఏ, స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న జయలక్ష్మికి రెవెన్యూశాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఐటీ కార్యదర్శి భాస్కర్ కాటమనేనికి ఏపీ హెచ్‌ఆర్‌డీఐ డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
అలాగే, పంచాయతీరాజ్, గ్రామాణాభివృద్ధిశాఖ కమిషనర్‌గా ముత్యాలరాజును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రైతు బజార్ల సీఈవోగా కె.మాధవీలత; ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ కార్యదర్శిగా గౌతమి; ఆయుష్ డైరెక్టర్‌గా దినేష్ కుమార్; వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా నీలకంఠారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.












Comments