top of page

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల : AP local body election schedule

11 hours ago
1 min read

అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా ఈమేరకు షెడ్యూల్‌ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లు ప్రకటించారు.

13 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలకు ఈ నెల 28న పోలింగ్‌ నిర్వహించనున్నారు. 30న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 18 వరకు గడువు ఇచ్చారు. 19న నామినేషన్లను పరిశీలించనున్నారు. ఉపసంహరణకు ఈ నెల 21వరకు గడువు ఉంది. 


ఎంపీటీసీ, జడ్పీటీసీ..


నవంబరు 3న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఈ నెల 19న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు తుదిగడువు ఈ నెల 23. ఉపసంహరణకు ఈ నెల 27వరకు గడువు ఉంది. నవంబరు 5న ఫలితాలు వెల్లడించనున్నారు. 


మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు..

గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్‌ 26న మొదటి విడత, 29న రెండో విడత, డిసెంబర్‌ 2న మూడో విడత జరగనున్నాయి. ఎన్నికలు జరిగిన రోజునే ఓట్ల లెక్కింపు ఉంటుంది.

తొలి విడత..

  • నోటిఫికేషన్‌: నవంబరు 13

  • నామినేషన్ల గడువు: నవంబరు 17

  • ఉపసంహరణ గడువు: నవంబరు 21

  • పోలింగ్‌ తేదీ: నవంబరు 26

రెండో విడత..

  • నోటిఫికేషన్‌: నవంబరు 16

  • నామినేషన్ల గడువు: నవంబరు 20

  • ఉపసంహరణ గడువు: నవంబరు 24

  • పోలింగ్‌ తేదీ: నవంబరు 29

మూడో విడత..

  • నోటిఫికేషన్‌: నవంబరు 19

  • నామినేషన్ల గడువు: నవంబరు 23

  • ఉపసంహరణ గడువు: నవంబరు 27

  • పోలింగ్‌ తేదీ: డిసెంబరు 2


Recent Posts

See All
AP Teachers తాజా అప్‌డేట్లు: DSC 2026 సిలబస్, యాప్ మార్పులు, బదిలీలు మరియు DA బకాయిలపై పూర్తి గైడ్

ఏపీ టీచర్స్, డీఎస్సీ అభ్యర్థులు మరియు విద్యాశాఖ సమాచారాన్ని అనుసరించే ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేలా తాజా అప్‌డేట్లను ఒకే చోట అందిస్తున్నాం. ప్రస్తుతం ఉపాధ్యాయ వర్గాల్లో ఎక్కువగా చర్చ జరుగుతున్న అంశాలు—AP

 
 
 

Comments


bottom of page