top of page

AP cabinet: వైయస్‌ఆర్‌ జిల్లా పేరు మారుస్తూ ఏపీ కేబినెట్‌ నిర్ణయం

AP cabinet: వైయస్‌ఆర్‌ జిల్లా పేరు మారుస్తూ ఏపీ కేబినెట్‌ నిర్ణయం


వైయస్‌ఆర్‌ జిల్లా పేరును వైయస్‌ఆర్‌ కడప జిల్లాగా పేరు మారుస్తూ ఏపీ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది.

AP cabinet: వైయస్‌ఆర్‌ జిల్లా పేరు మారుస్తూ ఏపీ కేబినెట్‌ నిర్ణయం
AP cabinet: వైయస్‌ఆర్‌ జిల్లా పేరు మారుస్తూ ఏపీ కేబినెట్‌ నిర్ణయం

అమరావతి: వైయస్‌ఆర్‌ జిల్లా పేరును వైయస్‌ఆర్‌ కడప జిల్లాగా మారుస్తూ ఏపీ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన కేబినెట్‌ భేటీ (AP cabinet) జరిగింది. ఈ సమావేశంలో ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు ఆమోదముద్ర వేశారు. రాజధాని అమరావతిలో భూ కేటాయింపులకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం లభించింది. ఎస్సీ వర్గీకరణ అంశంపైనా కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. ఈ అంశంపై ఇటీవల రాజీవ్‌రంజన్‌ మిశ్రా కమిషన్‌ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆ నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ysr kadapa district



మరిన్ని కేబినెట్‌ నిర్ణయాలు..

నంబూరులో వీవీఐటీయూకు ప్రైవేటు యూనివర్సిటీ హోదా కల్పిస్తూ నిర్ణయం

అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం

పలు సంస్థలకు భూ కేటాయింపులకు మంత్రివర్గం పచ్చజెండా

వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పేరు ఇకపై తాడిగడప మున్సిపాలిటీగా మార్పు చేస్తూ కేబినెట్‌ నిర్ణయం.

ముఖ్యమంత్రి కార్యాలయంలో ముగ్గురు ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల పోస్టులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

బుడగజంగాలు, మరో కులాన్ని ఎస్సీల్లో చేర్చేందుకు తీర్మానం చేయాలని నిర్ణయించింది







AP Teachers Tv WhatsApp channel

👉 యూట్యూబ్ చానెల్ కి సబ్ స్క్రయిబ్ చేయండి విలువైన బహుమతులు పొందండి ! 3999/- విలువ గల Canva , 2000/- విలువ గల pdf ఎడిటర్ , 23,000 /- మరియు 17000/- విలువగల వీడియొ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ మరెన్నో ఫ్రీ గా పొందండి. ఆఫర్ కొన్నిరోజులే

 
 
 

Comments


bottom of page