top of page

AP Mega DSC 2024 New Syllabus: లింక్ ఇలా ఓపెన్ చేయండి.డౌన్ లోడ్ చేయండి.



డీఎస్సీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త సిలబస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ సిలబస్ ప్రకారం ప్రిపేర్ అయ్యేందుకు అభ్యర్థులు సన్నద్ధం అవుతున్నారు.

AP DSC 2024
AP DSC 2024

అమరావతి: మెగా డీఎస్సీ కోసం అభ్యర్థులు కళ్లలో వత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తోందా అని వెయిట్ చేస్తున్నారు. క్యాండెట్స్‌కు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ రోజు మెగా డీఎస్సీకి సంబంధించిన సిలబస్ నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటన చేసింది. ఉద్యోగం కోసం చదివేందుకు మరింత సమయం దొరికిందని అభ్యర్థులు తెగ సంబర పడుతున్నారు.

సిలబస్ ఇదే..

అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదలయ్యేంత వరకు ఎదురు చూడకుండా ప్రిపేర్ అయ్యే ఉద్దేశంతో సిలబస్ విడుదల చేసింది. ఉదయం 11 గంటలకు మెగా డీఎస్సీ సిలబస్ విడుదల చేశామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు వివరించారు. వెబ్ సైట్ నుంచి అభ్యర్థులు సిలబస్ డౌన్ లోడ్ చేసుకోవాలని కోరారు.

AP DSC 2024-25 SYLLUBUS
AP DSC 2024-25 SYLLUBUS
ree

ree


16 వేల పోస్టులు

ఏపీలో 16 వేల పైచిలుకు టీచర్ పోస్టులను మెగా డీఎస్సీ పేరుతో భర్తీ చేయనుంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తీర్పు అమల్లోకి వచ్చింది. వర్గీకరణ పూర్తి చేసిన తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం కనీసం 3 నెలల సమయం పడుతోందని అంచనా వేసింది.

ree

టీడీపీ నేతల రిక్వెస్ట్

డీఎస్సీ నోటిఫికేషన్ కన్నా ముందు సిలబస్ విడుదల చేయాలని మంత్రి నారా లోకేష్‌కు ప్రజా ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. దాంతో డీఎస్సీ సిలబస్ గురించి లోకేశ్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి లోకేశ్ ప్రకటన చేశారు.



 
 
 

Comments


bottom of page