top of page

AP Mega DSC: మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల

AP Mega DSC: మెగా డీఎస్సీ ప్రకటన విడుదల


మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ నేడు ఆదివారం విడుదల చేసింది . విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది.

ఉదయం 10 గంటల నుంచి పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో సమాచారం 

‘ఎక్స్‌’లో షెడ్యూల్‌ విడుదల చేసిన మంత్రి లోకేశ్‌ 

రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్త


AP Mega DSC Notification Released details here

మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ ఆదివారం విడుదల చేసింది . విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. మెగా డీఎస్సీ షెడ్యూల్‌ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ శనివారం ‘ఎక్స్‌’ ద్వారా విడుదల చేశారు. ఇప్పుడు డీఎస్సీ వెబ్ సైటు లో అందుబాటులో ఉన్నాయి ‘ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ కల సాకారమవుతోంది. మ్యానిఫెస్టోలోని కీలక హామీని నెరవేరుస్తూ 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్‌ ఆదివారం ఉదయం 10 గంటలకు విడుదల కానుంది. అంకితభావం, అర్హత కలిగిన ఉపాధ్యాయుల నియామకం ద్వారా పాఠశాలలు, కమ్యూనిటీల సాధికారతలో ఇది ఒక చరిత్రాత్మక ముందడుగు. ఓర్పు, పట్టుదలతో ఎదురుచూసిన ఔత్సాహికులందరికీ ఆల్‌ది బెస్ట్‌’ అని లోకేశ్‌ పోస్టు చేశారు. మెగా డీఎస్సీకి సంబంధించిన పూర్తి సమాచారం, సంబంధిత జీవోలు, ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, పరీక్షా షెడ్యూలు, సిలబస్, సహాయ కేంద్రాల వివరాలు పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయని డైరెక్టర్‌ విజయరామరాజు తెలిపారు. 



రాష్ట్ర స్థాయిలో 259.. జోనల్‌ స్థాయిలో 2వేల పోస్టులు


మెగా డీఎస్సీలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనుంది. వీటిలో జిల్లా స్థాయిలో 14,088, రాష్ట్ర, జోనల్‌ స్థాయిలో 2,259 పోస్టులున్నాయి. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తులు, పురపాలక, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, జువెనైల్‌ సంక్షేమ పాఠశాలల్లోని ఖాళీలకు జిల్లా స్థాయిలో నియామకాలు చేపడతారు. బధిర, అంధుల పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్, ఏపీ ఆదర్శ పాఠశాలలు, సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ పాఠశాలల్లోని పోస్టులను రాష్ట్ర, జోనల్‌ స్థాయిల్లో భర్తీ చేయనున్నారు. అన్ని రకాల ఎస్జీటీ పోస్టులు 6,599, స్కూల్‌ అసిస్టెంట్లు 7,487, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు రెండు కలిపి 14,088 పోస్టులున్నాయి. రాష్ట్ర స్థాయి పోస్టులు 259. జోన్‌-1లో 400, జోన్‌-2లో 348, జోన్‌-3లో 570, జోన్‌-4లో 682 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తు, పురపాలక పాఠశాలల్లో మొత్తం 13,192 ఖాళీలు ఉండగా.. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 881,  జువెనైల్‌ పాఠశాలల్లో 15, రాష్ట్ర స్థాయిలో భర్తీ చేసే బధిరులు, అంధుల పాఠశాలల్లో 31 పోస్టులు ఉన్నాయి. 

ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ పోస్టులకు పేపర్‌-1గా ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ వారికి 60 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 మార్కులు వస్తేనే అర్హత సాధించినట్లు పరిగణిస్తారు. ఇందులో అర్హత సాధిస్తేనే పేపర్‌-2 మార్కులు లెక్కిస్తారు.

ప్రిన్సిపల్, పీజీటీలకు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. టీజీటీ, స్కూల్‌ అసిస్టెంట్, ఎస్జీటీ పోస్టులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) వెయిటేజీ 20 శాతం ఉంటుంది.  

ఇదీ షెడ్యూల్‌

ఏప్రిల్‌ 20- మే 15: ఆన్‌లైన్‌ ద్వారా ఫీజుల చెల్లింపు, దరఖాస్తుల స్వీకరణ 

మే 20 నుంచి: నమూనా పరీక్షలు 

మే 30 నుంచి: హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌

జూన్‌ 6 నుంచి జులై 6 వరకు: పరీక్షలు  

  • అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజున ప్రాథమిక ‘కీ’ విడుదల  

  • తర్వాత ఏడు రోజులపాటు అభ్యంతరాల స్వీకరణ

  • అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత తుది ‘కీ’ విడుదల  

  • ఆ తర్వాత వారం రోజులకు మెరిట్‌ జాబితా ప్రకటన

    ree
ree
ree
ree
ree

DOWNLOADS


మరిన్ని వార్తలు విశేషాలు చదవండి


How to Apply..Watch video



 
 
 

Comments


bottom of page