top of page

AP News: పదో తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

ssc exams, free bus


పదవ తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణ సదుపాయం కల్పించినట్టు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు

AP News: పదో తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
AP News: పదో తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

అమరావతి: పదవ తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణ సదుపాయం కల్పించినట్టు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు విద్యార్థులకు ఉచిత ప్రయాణ సదుపాయం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులు జయప్రదంగా పదో తరగతి పరీక్షలు రాయాలని ఆకాంక్షించారు. తల్లితండ్రుల ఆశలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని తెలిపారు.



రాష్ట్రవ్యాప్తంగా ఆంగ్ల మాధ్యమంలో 5,64,064 మంది, తెలుగు మాధ్యమంలో 51,069 మంది సోమవారం నుంచి పరీక్షలు రాయనున్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్‌ 1 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. విద్యార్థులు హాల్‌టికెట్‌ చూపిస్తే ఆర్టీసీ బస్సులో ఉచితంగా పరీక్షకు వెళ్లొచ్చు.



ree
 
 
 

Comments


bottom of page