top of page

AP TET Hall Tickets| ఏపీ టెట్ హాల్‌టికెట్లు విడుద‌ల‌.. డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి

#aptet #aptethallticket #aptethallticketdownload



ree

ఏపీలో టెట్ ప‌రీక్ష హాల్‌టికెట్లు విడుద‌ల‌య్యాయి. ఈ కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

AP TET Hall Tickets| అమరావతి: ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(AP TET)కు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగా అక్టోబ‌ర్ 3 నుంచి జ‌ర‌గ‌నున్న ఈ ప‌రీక్ష‌ల హాల్‌టికెట్ల‌ను (AP TET Hall Tickets) విడుద‌ల చేశారు. అభ్య‌ర్థులు టెట్ అధికారిక వెబ్‌సైట్‌ https://aptet.apcfss.in/లో త‌మ క్యాండిడేట్ ఐడీ, పుట్టిన తేదీ, వెరిఫికేష‌న్ కోడ్ ఎంట‌ర్ చేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.




షెడ్యూల్‌ ప్రకారం అక్టోబరు 3 నుంచి 20వ తేదీ వ‌ర‌కు టెట్‌ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఏపీ టెట్‌కు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4.27 ల‌క్ష‌ల మందికి పైగా అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. డీఎస్సీ పోస్టుల భ‌ర్తీలో టెట్‌కు 20శాతం వెయిటేజీ ఉండటంతో తమ స్కోరును పెంచుకొనేందుకు భారీగా అభ్య‌ర్థులు పోటీ ప‌డుతున్నారు.


ఏపీ టెట్ షెడ్యూల్

ree

 
 
 

Comments


bottom of page