top of page

APJAC తీర్మానాలు

Updated: Mar 18



APJAC తీర్మానాలు:



1. 12వ PRC కమిష 6thనర్ ను వెంటనే నియమించాలి. PRC అమలు అయ్యేలోపు 29% IR ప్రకటించాలి.


2. జిపిఎఫ్, ఏపీజిఎల్ఐ, సరెండర్ లీవులు తదితర బకాయిలను చెల్లించాలి. పేరుకుపోయిన పెండింగ్ బకాయిల చెల్లింపునకై రాష్ట్ర ప్రభుత్వం రోడ్ మ్యాప్ ప్రకటించాలి


3. పెండింగ్లో ఉన్న డి.ఏలను మంజూరు చేయాలి.


4. కేంద్ర పభుత్వ మేమో 57 ప్రకారం సెప్టెంబర్ 2004 ముందు నియామక ప్రక్రియ పూర్తి అయిన ఉద్యోగ ఉపాధ్యాయలకు పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలుపరచాలి. కూటమి ప్రభుత్వ హమికి అనుగుణంగా CPS రద్దుకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలి.


5. రిటైర్ అయ్యే ఉద్యోగ ఉపాధ్యాయులకు గ్రాట్యుటి, కమ్యూటేషన్ తదితర పెన్షనరీ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి.





6. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం వెంటనే ఏర్పాటు చెయ్యాలి.


7. గురుకుల ఉద్యోగులకు, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు, మోడల్ స్కూల్, MTS కు పదవి విరమణ వయస్సు 62కు పెంచాలి.


8. 2014కి ముందు నియమించబడి రెగ్యులరైజ్ కానీ 7000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చెయ్యాలి.


9. పంచాయతి రాజ్ డిపార్టుమెంటు, తదితర శాఖలలో పెండింగ్ లో ఉండిపోయిన కారుణ్య నియామకాలకు పరిష్కరం చూపాలి.


10. 11వ PRCలో పెన్షనర్లకు తగ్గించిన అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ను పునరుద్దరించాలి.


11. గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ కాలానికి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి.


12. RTC డిపార్టుమెంటు లో గత 5 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్లను RTC నిబంధల ప్రకారం అమలుచెయ్యాలి.


13. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు APCOS ద్వార సేవలు కొనసాగించాలి.

14. మెడికల్ డిపార్టుమెంటులో తొలగించబడిన MPHAలను తిరిగి సర్వీస్ లోకి తీసుకోవాలి.





 
 
 

Comments


bottom of page