top of page

B.Ed course : మళ్లీ ఒక ఏడాది బీఈడీ

మళ్లీ ఒక ఏడాది బీఈడీ కోర్సును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి(ఎన్‌సీటీఈ) ప్రకటించింది. కేంద్ర విద్యా శాఖకు ఇందుకు సంబంధించిన నిబంధనల డ్రాఫ్ట్‌ను సమర్పించనున్నట్లు ఎన్‌సీటీఈ


B.Ed course : మళ్లీ ఒక ఏడాది బీఈడీ
B.Ed course : మళ్లీ ఒక ఏడాది బీఈడీ

నాలుగేళ్ల డిగ్రీ లేదా పీజీ చేసినవారే అర్హులు


న్యూఢిల్లీ, జనవరి 21 : మళ్లీ ఒక ఏడాది బీఈడీ కోర్సును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి(ఎన్‌సీటీఈ) ప్రకటించింది. కేంద్ర విద్యా శాఖకు ఇందుకు సంబంధించిన నిబంధనల డ్రాఫ్ట్‌ను సమర్పించనున్నట్లు ఎన్‌సీటీఈ చైర్మన్‌ పంకజ్‌ అరోరా సోమవారం వెల్లడించారు.



2014లో ఈ బీఈడీ కోర్సును రద్దు చేయగా జాతీయ విద్యా విధానంలో చేసిన సిఫార్సుల మేరకు మళ్లీ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. నాలుగేళ్ల బ్యాచిలర్స్‌ డిగ్రీ పూర్తిచేసిన లేదా రెండేళ్ల మాస్టర్స్‌ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులే ఈ కోర్సు చేయవచ్చని అరోరా వెల్లడించారు. మూడేళ్ల డిగ్రీ చేసినవారు ఈ కోర్సు చేసేందుకు వీల్లేదు. ఆ అభ్యర్థులు రెండేళ్ల బీఈడీ కోర్సులో చేరాల్సి ఉంటుంది. ఒక ఏడాది బీఈడీ కోర్సు సహా పలు ఇతర కోర్సులకు సంబంధించిన నిబంధనలను ఖరారు చేసేందుకు 8 మంది సభ్యులతో ఒక కమిటీని సోమవారం ఏర్పాటు చేశారు.





 
 
 

Comments


bottom of page