top of page

DA Increase: హోలీకి ముందే ఉద్యోగుల డీఏ పెంపు.. ఎంత పెరగనుందంటే..



DA Increase: హోలీకి ముందే ఉద్యోగుల డీఏ పెంపు.. ఎంత పెరగనుందంటే..

హోలీ పండుగకు ముందే ఉద్యోగులకు గుడ్ న్యూస్ రాబోతుంది. ఎందుకంటే ప్రభుత్వం రెండు శాతం డీఏను పెంచనున్నట్లు తెలిసింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ పండుగకు ముందే గుడ్ న్యూస్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేంద్రం త్వరలో ఉద్యోగుల డీఏ (డియారియల్ అలవెన్స్) పెంపును ప్రకటించే అవకాశం ఉందని ఆయా వర్గాలు చెబుతున్నాయి. ఈ పెంపు ద్వారా దేశంలోని 1.2 కోట్లకుపైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం లభించనుంది.

హోలీ సమయంలో డీఏ పెంపు ఎందుకు?

కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు సార్లు డీఏని సమీక్షిస్తుంది. మొదట జనవరిలో, రెండోసారి జూలైలో. ఈసారి జనవరి నెలకు సంబంధించిన డీఏ పెంపును సాధారణంగా మార్చిలో హోలీ పండుగ సమయానికి ప్రకటిస్తారు. ఇది ఉద్యోగులకు పండుగకు ముందు ఆర్థిక ఉపశమనం కలిగించనుంది. అలాగే జూలై నెలకు సంబంధించిన పెంపు ప్రకటన ప్రతి సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్‌లో దీపావళి పండుగ సమయానికి వస్తుంది.



డీఏ పెంపు ఎలా నిర్ణయిస్తారు?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే డీఏ పెంపును నిర్ణయించడానికి సిమ్లాలోని లేబర్ బ్యూరో విడుదల చేసిన (AICPI-IW) డేటా ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ డేటా గత ఆరు నెలల AICPI-IW డేటాను విశ్లేషించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపు విషయాన్ని ఫైనల్ చేస్తుంది. ఈసారి డిసెంబర్ 2024కి సంబంధించిన AICPI-IW డేటా ప్రకారం 2% పెంపు ఉండవచ్చని అంచనా వేసింది. ఈ పెంపు ద్వారా DA, DR (డియారియల్ అలవెన్స్, డియారియల్ రివిజన్) మూల వేతనంలో 55%కి చేరుకుంటాయి. అయితే ఈ పెంపు గురించి తుది ప్రకటన కేంద్ర మంత్రివర్గం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరుగుతుంది.


ఇటీవల DA పెంపుదలలు

మార్చి 2024లో కేంద్ర మంత్రివర్గం హోలీ పండుగ సందర్భంగా డీఏని 46% నుంచి 50%కి పెంచింది. అలాగే అక్టోబర్ 2024లో మరో 3% పెంపుదల ఆమోదించారు. దీంతో డీఏ ప్రస్తుతం 53%కి చేరుకుంది. ఇక కొత్తగా పెంచనున్న డీఏ ద్వారా ఇది 55 శాతానికి చేరనుంది. ఈ డీఏ పెంపు, ఉద్యోగుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పండుగ సమయంలో ఈ పెంపు ప్రకటించడం ద్వారా ఉద్యోగుల ఆర్థిక భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా ఉద్యోగులు తమ కుటుంబాలతో మరింత ఆనందంగా పండుగ జరుపుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిసారి కూడా పండుగల సమయాల్లోనే ప్రకటిస్తున్న సంప్రదాయం ఉంది.






 
 
 

Comments


bottom of page