Diabete and obesity: రోజుకు రెండుసార్లు చక్కెరతో టీ, కాఫీలు తాగితే మధుమేహం
- AP Teachers TV
- Mar 21
- 1 min read

పరిశోధన నిర్వహిస్తున్న ఉల్లాస్, పరిశోధక విద్యార్థి ఎస్.గంగూలీ
అతిగా టీ, కాఫీలు తాగితే మధుమేహం వస్తుందని, తరచూ శీతల పానీయాలు తీసుకుంటే ఊబకాయం బారిన పడతారని ఇప్పటికే పలు పరిశోధనలు తెలిపాయి.
టీ, కాఫీ, శీతలపానీయాలతో వాటిపై తీవ్ర ప్రభావం
టాటా ఇన్‌స్టిట్యూట్ పరిశోధకుల వెల్లడి
అతిగా టీ, కాఫీలు తాగితే మధుమేహం వస్తుందని, తరచూ శీతల పానీయాలు తీసుకుంటే ఊబకాయం బారిన పడతారని ఇప్పటికే పలు పరిశోధనలు తెలిపాయి. వీటికి కొనసాగింపుగా... రోజుకు రెండుసార్లు చక్కెరతో టీ, కాఫీలు తాగితే మధుమేహంతోపాటు ఊబకాయం వస్తుందని, శీతలపానీయాలు తీసుకుంటే ఊబకాయానికి అదనంగా టైప్-2 మధుమేహం వస్తుందని హైదరాబాద్‌లోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్‌ఆర్) పరిశోధకులు ఫ్రొఫెసర్లు ఉల్లాస్ ఎస్.కొల్తూర్, మహేందర్ హెచ్చరిస్తున్నారు.
వారు మాట్లాడుతూ... ‘‘టీ, కాఫీ, శీతలపానీయాల వినియోగంపై చాలా అధ్యయనాలున్నా మేం మరిన్ని సూక్ష్మ అంశాలను తెలుసుకునేందుకు రెండేళ్లపాటు ప్రయోగాలు చేశాం. వేర్వేరు జాతుల ఎలుకలను తీసుకుని... కొన్నింటికి రోజుకు నాలుగైదుసార్లు చక్కెర కలిపిన 100 మిల్లీలీటర్ల టీ, కాఫీ, శీతలపానీయాలను ఇచ్చాం. మరికొన్నింటికి ప్రతి మూడు గంటలకు ఒకసారి ఇచ్చారు. వీటి రక్త నమూనాలను పరీక్షించగా... అన్ని ఎలుకల్లోనూ మధుమేహం, ఊబకాయ లక్షణాలు కనిపించాయి. ఈ ప్రయోగ ఫలితాలను అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం చేసిన గ్లోబల్ డైటరీ డేటాబేస్‌తో సరిపోల్చారు. మా పరిశోధనపత్రం ఇటీవల ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ‘న్యూట్రిషనల్ బయో కెమిస్ట్రీ’ ప్రచురించింది. టీ, కాఫీ, శీతలపానీయాల్లో ఉండే సుక్రోజ్ కారణంగా కాలేయం, కండరాలు, చిన్నపేగులపై తీవ్ర ప్రభావం పడుతున్నట్లు తేలింది. టీ, కాఫీలను చక్కెర లేకుండా తాగేందుకు ప్రయత్నించాలి. శీతల పానీయాలను తీసుకోకుండా ఉండటమే మేలు’’ అని వివరించారు












Comments