top of page

DSC నిర్వహణపై మంత్రి నారా లోకేశ్ మరోసారి క్లారిటీ

DSC నిర్వహణపై మంత్రి నారా లోకేశ్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల కోడ్ పూర్తయిన వెంటనే డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం, అది కూడా పారదర్శకంగా నిర్వహిస్తామని వెల్లడించారు.


కొన్ని సాంకేతిక కారణాలతో డీఎస్సీ పోస్ట్ పోన్ అయిందన్నారు. ఎన్నికల కోడ్ పూర్తయిన వెంటనే 16387 పోస్టులను భర్తీ చేస్తామన్నారు.


ఈ అకడమిక్ ఇయర్ కే కొత్త ఉపాధ్యాయులను నియమిస్తామన్నారు. శాసనమండలి సాక్షిగా చెప్తున్నా.. ఏప్రిల్ లేదా మే నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తాం. ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.

 
 
 

Comments


bottom of page