Half Day Schools : విద్యార్ధులకు బిగ్ రిలీఫ్, త్వరలో ఒంటి పూట బడులు
- AP Teachers TV
- Feb 20
- 1 min read

Half Day Schools: విద్యార్ధులకు బిగ్ రిలీఫ్, త్వరలో ఒంటి పూట బడులు
ఈ వేసవి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందనే హెచ్చరికలు కూడా ఉన్నాయి.
మార్చ్ నుంచి వేసవి ప్రారంభం కావల్సి ఉండగా అప్పుడే ఎండ వేడిమి పెరిగిపోయింది. ఉదయం 8-9 గంటలకే వేడి ఎక్కువగా ఉంటోంది. విద్యార్ధులు ముఖ్యంగా స్కూల్‌కు వెళ్లే చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. రోజూ స్కూల్స్ తెరిచే సమయంలో అంటే 9-10 గంటల మధ్యలో ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. ముఖ్యంగా గత వారం పది రోజులుగా ఎండలు పెరిగాయి. సాధారణంగా ప్రతి ఏటా మార్చ్ 15-20 తేదీల్లో ఒంటి పూట బడులు ఉంటాయి. కానీ గత ఏడాది ఎండల తీవ్రత దృష్ట్యా అంతకంటే ముందే ఒక పూట బడులు ప్రారంభమయ్యాయి. ఈసారి ఇంకా త్వరగానే ప్రారంభించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది.
ఎందుకంటే ఇప్పటికే విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందాయి. ఎండల తీవ్రతను పరిగణలో తీసుకుని త్వరగా ఒంటి పూట బడులు ప్రారంభించాలని కోరారు.
వచ్చే వారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా ఒంటి పూట బడులు ప్రారంభించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
అదే జరిగితే ఫిబ్రవరి 25-28 తేదీల నుంచి ఏపీలో హాఫ్ డే స్కూల్స్ ప్రారంభం కావచ్చు.












Comments