top of page

Lokesh: త్వరలో ప్రతి శనివారం ‘నో బ్యాగ్‌ డే’: మంత్రి లోకేశ్‌


Lokesh: త్వరలో ప్రతి శనివారం ‘నో బ్యాగ్‌ డే’: మంత్రి లోకేశ్‌
Lokesh: త్వరలో ప్రతి శనివారం ‘నో బ్యాగ్‌ డే’: మంత్రి లోకేశ్‌

త్వరలో ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’ అమలు చేయబోతున్నట్లు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు.

అమరావతి: త్వరలో ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’ అమలు చేయబోతున్నట్లు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. దీనికి సంబంధించి విద్యార్థులకు యాక్టివిటీస్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యలో గత వైకాపా ప్రభుత్వం అనాలోచితంగా తీసుకువచ్చిన జీవో 117 ఉపసంహరణపై క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు, వివిధ సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సూచించాలన్నారు.



పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. త్వరలోనే చేపట్టబోయే ఉపాధ్యాయ బదిలీ చట్టంపై సమావేశంలో చర్చించారు. ఈ అంశంపై ఉపాధ్యాయులు, సంఘాల నుంచి అభిప్రాయాలను సేకరించాలని సూచించారు. 

సాంకేతికత సాయంతో ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధంగా పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలు మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధ్యాయులకు ఇప్పుడున్న అనేక యాప్‌ల స్థానంలో ఒకటే యాప్‌ను రూపొందించే ప్రక్రియను త్వరతిగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వాస్తవ సంఖ్యను నిర్ధరించేందుకు అపార్ ఐడీ అనుసంధానంపై ఆరా తీశారు. ఇంటర్మీడియట్ విద్యాశాఖలో చేపట్టబోయే సంస్కరణలపైనా సమావేశంలో చర్చించారు.



 
 
 

Comments


bottom of page