PM Modi Mann ki Baat: మన్ కీ బాత్.. టీచర్ పై ప్రశంసల జల్లు
- AP Teachers TV
- Feb 23
- 1 min read
PM Modi Mann ki Baat: మన్ కీ బాత్.. టీచర్ పై ప్రశంసల జల్లు

ఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 100వ రాకెట్ ప్రయోగం పూర్తి చేయడం గర్వకారణంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అంతరిక్ష రంగంలో దేశం ఏటా పురోగతి సాధిస్తోందని అన్నారు.
ఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) 100వ రాకెట్ ప్రయోగం పూర్తి చేయడం గర్వకారణంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) అన్నారు. అంతరిక్ష రంగం (Space Sector)లో దేశం ఏటా పురోగతి సాధిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా ఇస్రోకు ప్రధాని అభినందనలు తెలియజేశారు. మన్‌కీ బాత్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన ప్రధాని.. ఇస్రో, ఏఐ రంగాలపై ప్రధానంగా వివరించారు.
గతంతో పోలిస్తే ఇస్రో బృందంలో మహిళా శాస్త్రవేత్తల సంఖ్య పెరగడం అభినందనీయమని ప్రధాని మోదీ అన్నారు. ఏఐ రంగంలోనూ భారత్ మరింత ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ (Adilabad) జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కైలాష్ (Teacher Kailash)ను మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు. గిరిజన భాషలను పరిరక్షించడంలో సాయం చేశారంటూ కొనియాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఉపయోగించి కొలామి భాషలో కైలాష్ పాటను కంపోజ్ చేశారని ప్రధాని మోదీ ప్రశంసించారు.












Comments