PRC కమిటీ DA విడుదల, ఆర్థిక బాయిలచెల్లింపు తదితర అంశాలను..ఆర్థిక శాఖ మంత్రి గారి దృష్టికి తెచ్చిన APNGO నేతలు #apprc
- AP Teachers TV
- Jul 1
- 1 min read

PRC కమిటీ DA విడుదల, ఆర్థిక బాయిలచెల్లింపు తదితర అంశాలను..ఆర్థిక శాఖ మంత్రి గారి దృష్టికి తెచ్చిన APNGO నేతలు #apprc
విజయవాడ వెలగపూడి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖామాత్యులు శ్రీ పయ్యావుల కేశవ గారిని APNGO రాష్ట్ర సంఘ అధ్యక్షుడు ఏ విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి రమణ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో NGO నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ బేటిలో PRC కమిటీ ఏర్పాటుపై జరిగిన 2 సంవత్సరాల జాప్యం గురించి, DA లు పెండింగ్లో ఉన్న అంశాన్ని, బకాయిలు తదితర అంశాలపై ఉద్యోగుల మనోభావాలను, అసంతృప్తిని ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి నాయకులు తీసుకుని వచ్చారు. అలాగే ఆర్థిక డిమాండ్స్ తో పాటు, ఆర్థికేతర డిమాండ్లను కూడా పరిష్కరించే విధంగా ఒక మెకానిజం తయారు చేయాలన్న విషయాన్ని చర్చించడం జరిగింది.
ఆర్థిక శాఖ మంత్రిని కలిసిన వారిలో, ఎన్జీవో సంఘ రాష్ట్ర కోశాధికారి శ్రీ రంగారావు, పిఎఓ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ హరినాథ్ బాబు, అగ్రికల్చరల్ ఏవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వేణుమాధవ్, సుభాని, గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జానీ భాష, ప్రధాన కార్యదర్శి అంకమ్మరావు, విజయవాడ నగర శాఖ అధ్యక్షుడు తదితరులు...












Comments