Revised schedule for formative and summative assessments by SCERT AP
- AP Teachers TV
- Nov 11, 2022
- 1 min read
Revised schedule for formative and summative assessments by SCERT AP.

ఈనెల అనగా నవంబర్ 9వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల డిసిఇబి సెక్రటరీలతో SCERT డైరెక్టర్ డి ప్రతాపరెడ్డి వెబెక్స్ మాధ్యమం ద్వారా ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించు పరీక్షల యొక్క షెడ్యూల్ను పైన చూపించిన చిత్రంలో గమనించవచ్చు.
ఈ సమావేశంలో అన్ని పూర్వ అవిభాగ్య జిల్లాల డిసిఇబి కార్యదర్శుల నుంచి ఆంధ్రప్రదేశ్ పరీక్షలకు సంబంధించిన వివిధ అంశాలపై అభిప్రాయాలను స్వీకరించారు.
కొచ్చిన్ పేపర్స్ విషయంలో ప్రాక్టికల్ సమస్యలు తలెత్తకుండా ఉండడానికి గాను గత విద్యా సంవత్సరంలో వలె ఎఫ్ఏ వన్ పరీక్షలకు ఏ విధంగా అయితే వాట్సాప్ లో క్వశ్చన్ పేపర్లు పంపించారో అదేవిధంగా ఈ సంవత్సరం ఎఫ్ ఏ2 మరియు 4 లకు ప్రశ్నాపత్రాలను వాట్సాప్ లో పంపిస్తారు.
9వ తరగతి విద్యార్థులకు పదవ తరగతి పరీక్ష పత్రాన్ని పరిచయం చేయుటకు గాను 9వ తరగతి విద్యార్థుల పరీక్షా పత్రాల బ్లూ ప్రింట్ 10వ తరగతి బ్లూ ప్రింట్ లాగానే ఉంటుంది.
ఎఫ్ఏ3 ని CBA2 గాను, ఎస్ఏ2 ను CBA3 గాను నిర్వహిస్తారు.












Comments