Teacher Transfers: ఏప్రిల్ నుంచి టీచర్ల బదిలీలు, జాబితా సిద్ధం చేస్తున్న అధికారులు
- AP Teachers TV
- Feb 19
- 1 min read

Teacher Transfers: ఏప్రిల్ నుంచి టీచర్ల బదిలీలు, జాబితా సిద్ధం చేస్తున్న అధికారులు
ఏపీలో ఏప్రిల్ నుంచి టీచర్ల బదిలీలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ముఖ్యమైన వివరాలు మీ కోసం.
ఆంధ్రప్రదేశ్ ఉప్యాధ్యాయులకు శుభవార్త. చాలాకాలంగా ఎదురు చూస్తున్న టీచర్ల బదిలీలకు మార్గం సుగమమైంది. ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో బదిలీల ప్రక్రియ మొదలు కావచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు బయటికొచ్చాయి. మరోవైపు మంత్రి నారా లోకేశ్ సైతం కీలక ప్రకటన చేశారు. బదిలీల్లో ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా సీనియారిటీ జాబితా సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. పాఠశాల, ఇంటర్ విద్యపై సమీక్ష నిర్వహించిన ఆయన త్వరలో జీవో నెంబర్ 117కు ప్రత్యామ్నాయ వ్యవస్థ తీసుకొస్తామన్నారు.
వాస్తవానికి 2024 ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వం 1800 మంది ఉపాధ్యాయుల్ని కోరుకున్న స్థానాలకు బదిలీ చేసింది. అయితే ఈ బదిలీల్లో ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలతో బదిలీ ఉత్తర్వుల్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది . అప్పటి నుంచి బదిలీల కోసం ఎదురు చూస్తున్న టీచర్లకు ఇప్పుడు మళ్లీ శుభవార్త విన్పిస్తోంది.
త్వరలో విద్యార్ధుల తల్లిదండ్రులతో సమావేశం జరగనుంది. ఉపాధ్యాయ సంఘాల నేతలో బదిలీల చట్టం ముసాయిదాపై చర్చిస్తారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన జీవో నెంబర్ 117 రద్దు, బదిలీల చట్టంపై ప్రతిపాదనలను ప్రభుత్వానికి చేరుతాయి.












Comments