top of page

TET పై స్పందించక పోతే in-service టీచర్లు ఇంటికే...?

TET పై స్పందించక పోతే in-service టీచర్లు ఇంటికే...?

Katti Narasimha Rao
Katti Narasimha Rao

⁠విద్యా హక్కు చట్టం, 2010 ప్రకారం పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా నియామకం కోసం అభ్యర్థులు విద్యా మరియు వృత్తి అర్హతలతో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET)లో కూడా ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి చేసింది;

23.8. 2010 నుండి ఈ నిబంధన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కొత్త ఉపాధ్యాయ నియామకాల విషయంలో అమలు అవుతోంది;

మన భారతదేశ గౌరవనీయ సుప్రీంకోర్టు, సివిల్ అప్పీల్ నం:1385/2025 Date: 1.9.2025 ద్వారా TET పై ఇచ్చిన తీర్పు పై అవగాహన/ స్పందించక పోతే in service టీచర్లు ఉపాధ్యాయ ఉద్యోగం నుండి తొలగించు పరిస్థితి ని ఎదుర్కొంటారు..

*Judgement 110 పేజీలలో ప్రధానంగా ఏమున్నది ?*

>కొన్ని విద్యా సంస్థలు TET అర్హత లేని వారిని నియమించు కొన్న సందర్భంగా ఆయా సంస్థలు, మహారాష్ట్ర తదితర రాష్ట్ర ప్రభుత్వాల అప్పీల్స్ అన్నీ పరిగణన లోనికి తీసుకొని Apeal No: 1385 Dt: 1.9.2025 తుది తీర్పు ఇచ్చింది

> In-service టీచర్లు అందరూ (23.8.2010 ముందు నియమింపబడిన వారు కూడా) TET ఉత్తీర్ణత పొందాలి

>1.9.2025 నుండి retirement (Superannuation ఒక్కో రాష్ట్రం లో ఒక్కో age) కు 5 సంవత్సరాలు service ఉన్నవారు మాత్రమే (మన AP లో31.9.2030 లోపు రిటైర్ అయ్యే వారు) TET నుండి మినహాయింపు ఉంటుంది.

> మిగిలిన in-service టీచర్లు అందరూ 31.8.2027 లోపు TET తప్పక ఉతీర్ణత సాధించాలి లేనిచో

>పదోన్నతులు నిలిపి వేయబడతాయి (ఇప్పటికే ఈ నిబంధన తెలంగాణ తదితర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు)

> తప్పని సరి పదవి విరమణ (compulsory retirement) లేదా ఉద్యోగం నుండి తొలగిస్తారు

> Supreme Court order చాలా చాలా సీరియస్ ఇష్యూ అన్నది గుర్తించు కోవాలి.

>కేంద్ర లోని కొందరు మరియు NCTE ( National Council for Teacher Education) లోని కొందరి అధికారులతో ( 23.9.2925 ఢిల్లీ లో) మాట్లాడక అర్థం ఐనది అజాగ్రత్తగా ఉంటే ఇంటికేనని

*# ప్రస్తుత మన కర్తవ్యం#*

> Supreme court లో⁠ Review petition వేయడానికి కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాల పై ఒత్తిడి తీసుకొని రావడం & యూనియన్స్ & బాధితులతో implead కావడం

> STU-AISTF మరియు సోదర రాష్ట్ర/ జాతీయ ఉపాధ్యాయ సంఘాల పిలుపుకు స్పందించడం

> ఎందుకైనా మంచిది రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే TET కు హాజరై ( Nov 2025 లోనే AP నిర్వహించే అవకాశం) 31.8.2027 లోపు ఉతీర్ణతకు ప్రయత్నించడం

> TET పై వచ్చే ఎప్పటి కప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోవడం మంచిది.


-కత్తి నరసింహా రెడ్డి Ex MLC

- Working President AISTF

 
 
 

Comments


bottom of page