top of page

Top Viral Moments of Kumbhmela: మహాకుంభమేళా.. జనాల్ని ఆశ్చర్య పరిచిన టాప్ 10 ఉదంతాలు ఇవే


నేటితో కుంభమేళా ముగియనున్న నేపథ్యంలో ఈసారి జనాల్ని విపరీతంగా ఆకట్టుకున్న టాప్ 10 వైరల్ ఘటనలపై ఓ లుక్కేద్దాం.

ree

మహాకుంభమేళా.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంరంభం. భారతీయులే కాక హిందూ మతాన్ని ఆచరించే ఎందరో విదేశీయులు ప్రయాగ్‌రాజ్‌కు వచ్చి త్రివేణిసంగమంలో పవిత్ర స్నానమాచరించి భగవద్‌ కృపకు పాత్రులయ్యారు. అయితే, ఈసారి కుంభమేళా సందర్భంగా పలు ఆసక్తికర ఘటనలు జనాల్ని సర్‌ప్రైజ్ చేశాయి. నెట్టింట ట్రెండింగ్‌లో నిలిచాయి. మరి వీటిల్లో టాప్ ఘటనలో ఎవో తెలుసుకుందాం (Top Viral Moments of Kumbhmela).

  • ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి మోనీ భంసలే. పూసల దండలు విక్రయించేందుకు మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ 16 ఏళ్ల టీనేజర్ తన సహజసిద్ధమైన అందంతో ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఇది ఆకతాయిల వేధింపులకు కూడా దారితీయడంతో ఆమె మధ్యలోనే వాడాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ పాప్యులారిటీ ఆలంబనగా ఆమె కొత్త అవకాశాల వైపు అడుగులు వేస్తోంది.

  • ఐఐటీ బాంబేలో ఎయిరోస్పేస్ ఇంజినీరింగ్ చేసిన అభయ్ సింగ్ ఆ తరువాత ఆధ్యాత్మిక బాట పట్టాడు. కుంభమేళాలో ఐఐటీ బాబాగా పాప్యులర్ అయ్యారు. కేరీర్‌లో అపార అవకాశాలు ఉన్నా అతడు ఆధ్యాత్మిక మార్గం ఎంచుకోవడం జనాల్ని ఆకట్టుకుంది.

  • కుంభమేళాలో పుణ్యస్నానానికి వచ్చిన బాబా రామ్‌దేవ్ ఈ సందర్భంగా తన జుట్టును సినిమాటిక్ స్టైల్‌లో వెనక్కు ఎగరేయడం కూడా జనాల్ని ఆశ్చర్యపరిచింది.

  • 1990ల నాటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మమతా కులకర్ణి మహమండలేశ్వర్‌గా నియామకం కావడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో, ఆమె చివరకు ఆ బాధ్యతను వదులుకోవాల్సి వచ్చింది.

  • తన భర్త కుంభమేళాకు రాలేకపోయవడంతో ఒంటరిగా వచ్చిన మహిళ.. భర్తకు డిజిటల్ పవిత్ర స్నానం చేయించింది. అతడితో వీడియో కాల్‌లో మాట్లాడుతూ ఫోన్‌ను నీళ్లల్లో ముంచి తీసింది. ఆమె వింత ఆలోచనకు జనాలు అవాక్కయ్యారు.




  • శుభమ్ ప్రజాపత్ అనే కంటెంట్ క్రియేటర్ కుంభమేళాలో టీ స్టాల్ ఏర్పాటు చేసి భారీగా లాభాలు ఆర్జించాడు. జస్ట్ ఒక్క రోజులోనే రూ.5 వేలు లాభం పొందినట్టు అతడి చెప్పడం చూసి జనాలు షాకైపోయారు.

  • కుంభమేళాలో పాల్గొనేందుకు రాజేశ్, సాధనలు ముంబై నుంచి బైక్‌ మీద కుంభమేళాకు రావడం కూడా ఈసారి హైలైట్‌‌గా నిలిచింది. ఏకంగా 1200 కిలోమీటర్లు వారు బైక్‌పై ప్రయాణించారని తెలిసి జనాలు ముక్కున వేలేసుకున్నారు.

  • ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేందుకు ఓ వ్యాపారి ఏకంగా రూ.3 వేల కోట్ల వ్యాపారాన్ని కాదనుకున్న వైనం కూడా జనాల్ని ఆశ్చర్యపోయేలా చేసింది.

  • కుంభమేళాకు భార్యాపిల్లలతో వచ్చిన ఓ పెద్దాయనకు వారు అకస్మాత్తుగా కనిపించకపోవడంతో షాకైపోయాడు. ఆ తరువాత ఆయనను వెతుక్కుంటూ వచ్చిన వారికి చూశాక సంబరం తట్టుకోలేక కన్నీరుమున్నీరయ్యాడు. జనాల్ని ఆకట్టుకున్న ఉదంతాల్లో ఇదీ ఒకటి.

  • 37 సంవత్సరాల తర్వాత కుంభమేళాలో కలుసుకున్నారు ఇద్దరు స్నేహితులు అతడు, ఆమె ఆనందానికి అవధులు లేవు .. ప్రపంచమంతా సంతోషించింది.

  • ఇక కుంభమేళాలో పిల్లలు తప్పిపోకుండా ఉండేందుకు వారికి వీపు వైపు దుస్తులపై తల్లిదండ్రులు తమ వివరాలున్న ఉన్న కాగితాలను అంటించారు. ఇదీ జనాల్లో ఆసక్తిని రేకెత్తించింది.



 
 
 

Comments


bottom of page