top of page

UPSC Prelims 2024: సివిల్స్ ప్రిలిమ్స్-2024 ఫలితాలు విడుదల చేసిన యూపీఎస్సీ:UPSC Prelims 2024


సివిల్స్ ప్రిలిమ్స్-2024 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం విడుదల చేసింది. ఆ ఫలితాలను తన అధికారిక వెబ్‌సైట్‌ upsc.gov.inలో ఉంచింది.

UPSC CIVILS 2024 Prelims Results Released
UPSC CIVILS 2024 Prelims Results Released

న్యూఢిల్లీ, జులై 01,ఏపీ టీచర్స్ టీవీ : సివిల్స్ ప్రిలిమ్స్-2024 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సోమవారం విడుదల చేసింది. ఆ ఫలితాలను తన అధికారిక వెబ్‌సైట్‌ upsc.gov.inలో ఉంచింది. ఈ ఏడాది సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను జూన్ 16వ తేదీన దేశవ్యాప్తంగా యూపీఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 400 మార్కులతో అన్ని అబ్జెక్టివ్ ప్రశ్నలతో రెండు పేపర్లగా ఈ పరీక్ష నిర్వహించారు.



ఈ ప్రిలిమ్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు.. మెయిన్స్ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంది. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి మెయిన్స్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ మెయిన్స్ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధిస్తే.. ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంది. మరోవైపు గతేడాది సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష మే 26వ తేదీన నిర్వహిస్తే.. జూన్ 12న ఫలితాలు విడుదల చేసిన విషయం విధితమే.


AP Teachers TV WhatsApp Channel
AP Teachers TV WhatsApp Channel

AP Teachers TV Telugu
AP Teachers TV Telugu


 
 
 

Comments


bottom of page