అలాంటి పచ్చబొట్లతో హెచ్‌ఐవీ, హెపటైటిస్ ముప్పు! tattoos are hazardous
- AP Teachers TV
- Mar 1
- 1 min read
tattoos are hazardous

పచ్చబొట్టు వేసేందుకు వినియోగిస్తున్న పచ్చతో చర్మ వ్యాధులు, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.
బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే: పచ్చబొట్టు వేసేందుకు వినియోగిస్తున్న పచ్చతో చర్మ వ్యాధులు, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. రహదారి పక్కన శుభ్రతను పాటించకుండా వేసే పచ్చబొట్లతో హెచ్‌ఐవీ, హెపటైటిస్ తదితర వ్యాధులు సోకుతున్నట్లు గుర్తించామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు తెలిపారు. బెంగళూరులోని ఆరోగ్య సౌధలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నాసిరకం, రసాయనాలు కలిసిన పచ్చ ద్రావణం చర్మపొరలు, నరాల్లోకి వెళ్లి పలు రోగాలకు కారణమవుతోంది.
ఆరోగ్య సురక్ష, ఔషధాల నాణ్యతను నిర్ధారించే నిపుణులు ఇప్పటికే పలుచోట్ల నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. టాటూ సిరాలో కలిపే రింగర్ లాక్టేట్ ద్రావణానికి సంబంధించి 246 బ్యాచ్‌లను పరీక్షించగా, అందులో 113 నమూనాలు వినియోగానికి అర్హమైనవి కాదని గుర్తించాం. రింగర్ లాక్టేట్ను తయారు చేస్తున్న ఫార్మాస్యూటికల్స్ సంస్థపై ఇప్పటికే 9 కేసులు నమోదు కాగా, మరో 25 కేసుల నమోదుకు అనుమతించామ’ని వివరించారు. టాటూ ఇంక్‌లో కాంతివర్ధకాలు (ఇల్యూమినేట్/ మెరుపు) కలపకుండా కేంద్ర ప్రభుత్వం బీఐఎస్ ద్వారా నిబంధనలు కఠినతరం చేయాలని గుండూరావు కోరారు.












Comments