top of page

ఆ 23 మంది మహిళా ఉపాధ్యాయినిలపై తీసుకున్న చర్యలు పునః సమీక్షించండి:

ఆ 23 మంది మహిళా ఉపాధ్యాయినిలపై తీసుకున్న చర్యలు పునః సమీక్షించండి:- ఉపాధ్యాయ MLC కత్తి నరసింహారెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మహిళా ఉపాధ్యాయినిలపై శనివారం నాడు అన్నమయ్య జిల్లా DEO గారు తీసుకున్న చర్యలను పునః సమీక్ష చేసి నిలుపుదల చేయాలని ఉపాధ్యాయ MLC కత్తి నరసింహారెడ్డి విన్నవించారు. 117 G.O తో ఒక గందరగోళ వాతావరణం పాఠశాల స్థాయిలలో ఏర్పడటం, రేషనలైజేషన్, బదిలీలు ఒకవైపు పాఠశాలల విలీనం మరోవైపు ఇలాంటి పరిస్థితిలో రాష్ట్రంలోని ఉపాధ్యాయులు ఒక సందిగ్ధత ఉన్న ఈ సమయంలో స్కూల్ రెడీనెస్ పై అవగాహన లేదనే కారణంతో ఇంక్రిమెంట్ ఒక సంవత్సరం పాటు సస్పెండ్ చేయడం లాంటి చర్యలు వెనక్కి తీసుకోవాలని కత్తి నరసింహారెడ్డి గారు RJD గారిని DEO గారిని కోరడం జరిగింది.

ree

 
 
 

Comments


bottom of page