ఈ విద్యా సంవత్సరంలో వచ్చిన మార్పులు - అసెస్మెంట్లు, మోడల్ పేపర్లు
- AP Teachers TV
- Jul 24
- 1 min read

ఈ విద్యాసంవత్సరం లో పాఠ్యపుస్తకాల నుండి HANDBOOK వరకూ చాలా మార్పులు వచ్చాయి..
అందులో భాగంగానే SAMP /FA పరీక్షల మోడల్ కూడా మారిందని తెలుసును కదా.
విద్యార్థులందరికీ ASSESSMENTS కొరకు BOOKLETS ఇవ్వడం జరుగుతుంది.
ఆ BOOKLET ఎలా ఉంటుందనే అందరూ ఎదురుచూస్తున్నారు..
So ఇప్పుడు ఆ BOOKLET MODEL, OMR MODEL లను డౌన్లోడ్ చేసుకుని చూడండి.. విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఉపయోగపడతాయి..
ముఖ్యంగా SAMP/ FA-1 పేపర్ కు గాను 5+5+5+35 = 50MARKS కి పేపర్ ఇవ్వబడుతుంది.
(గతంలో 10+10+10+20=50MARKS ఉండేవి.)
అవి ఈ విధముగా ఉన్నాయి..
TOOL-1 (5M) + TOOL- 2 (5M)+ TOOL- 3 (5M)+ TOOL-4 (35M) =50M
Tool-1 Student participation & Reflections(Book reviews for Languages) 5M
(Assessment Booklet లో ఇవ్వబడిన మొదటి అంశం విద్యార్థులచే చేయించే పుస్తక సమీక్షలు మొదలైన పనులు Assessment Booklet లోనే చేయించి, గరిష్టంగా 5మార్కులు వరకు వేయాలి.)
Tool-2 Written work (Notebooks, Homeworks, etc) 5M
(Assessment Booklet లో ఇవ్వబడిన 2వ అంశం Note books, home works, చేతివ్రాత, చూచివ్రాత నిమిత్తం ఎలా ఉన్నాయో అనేది ఉపాధ్యాయులు Assessment Booklet లోనే NOTE వ్రాసి గరిష్టంగా 5మార్కులు వరకూ వేయాలి.)
Tool-3 Project work 5M
(Assessment Booklet లో ఇవ్వబడిన 3వ అంశం Project work ప్లేస్ లో విద్యార్థులచేతనే చేయించి, గరిష్టంగా 5 మార్కులు వరకూ వేయాలి.)
Tool-4 Written test 35M
(Assessment Booklet లో ఇవ్వబడిన 4వ అంశంగా Written Test ఉంటుంది. ప్రశ్నాపత్రం లో ఉన్న ప్రశ్నలకు OMR SHEET లో ANSWERING చేసి, వాటినే మరలా ఈ Assessment Booklet లో కూడా వ్రాయాలి. ఇక్కడ OMR తో జవాబులు సరిగ్గా సరిపోలేలాగ చూసుకోవాలి. Booklet లో ఏ ప్రశ్న సంఖ్యల వారిగా ఖాళీలు ఇవ్వడం జరిగింది.. కావున ప్రశ్నాపత్రం లోని sections వారిగా జవాబులను ఇక్కడే వ్రాయించాలి..)
ముఖ్య గమనిక: Assessment Booklet విద్యార్థుల ఇంటికి ఇవ్వరాదు. ఉపాధ్యాయులకు ఉన్న periods లోనే TOOLS 1,2,3 చేసుకుని, OFFICIAL DATES లలో నిర్వహించే FA లను BOOKLET లో ఇచ్చిన 4వ స్థానంలో వ్రాయించాలి.
TOTAL 5+5+5+35=50M
కావున మొత్తానికి ఇప్పుడు 6 నుండి 10వ తరగతి వరకూ
👉🏾FA-1 50MARKS కు గాను MODEL బుక్లెట్ ..
👉🏾FA-1 OMR SHEET MODEL
👉🏾 SA-1 – 80MARKS కు గాను MODEL బుక్లెట్ కుడా












Comments