ఉద్యోగులకు నూతన పీఆర్సీ ప్రకటించండి: ఆప్టా వినతి
- AP Teachers TV
- Mar 17
- 1 min read
ఉద్యోగులకు నూతన పీఆర్సీ ప్రకటించండి: ఆప్టా వినతి
అమరావతి : పెండింగ్ బకాయిలను చెల్లించి,
వెంటనే కొత్త పీఆర్సీ ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం (ఆష్టా) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రాష్ట్ర అధ్యక్షుడు గణపతి రావు, ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాష్ రావు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలలు గడుస్తున్నా ఉద్యోగులకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనం కల్పించలేదని విమర్శించారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఇచ్చిన హామీలపై నమ్మకం ఉంచి ప్రభుత్వాన్ని అధిక మెజార్టీతో గెలిపించినా, ఇప్పటికీ పాత బకాయిలు, పెండింగ్ డీఏలు చెల్లించకపోవడం ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేస్తోందని తెలిపారు.
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఉద్యోగులు కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినప్పటికీ, తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని వాపోయారు.
నేటి కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి, తక్షణమే నూతన పీఆర్సీ కమిటీని నియమించి, జీవోలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆష్టా కోరింది. 2022 నుంచి పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ బిల్లులు, పీఎఫ్ బిల్లులను కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
నిత్యావసర ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో 12వ పీఆర్సీ ప్రకటించి ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించాలని ఆష్టా నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.
జూన్లో రిటైర్ అయిన ఉద్యోగులకు ఇప్పటికీ పీఎఫ్, ఏపీజీఎల్ అమౌంట్లు విడుదల చేయలేదని, వీటిని వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.












Comments