top of page

ఉపాధ్యాయ ఉద్యోగానికి దరఖాస్తు చేసిన ఎమ్మెల్యే, బిజినెస్ మ్యాన్

ree

MLA TEACHER ఎమ్మెల్యే కరణం ధర్మారావు, విశాఖపట్నం :


ఈరోజు1998 డీఎస్సీ Certificates verification కు వచ్చి తను కూడా MTS లో టీచర్ గా పనిచేస్తానని చెప్పడంతో అధికారులు అవాక్కై ఎమ్మెల్యే పదవి వదులుకొని కాంట్రాక్టు బేస్ లో ఇస్తున్న ఈ టీచరు ఉద్యోగానికి వస్తారా అని అడగగా, నాకు టీచర్ అంటేనే ఇష్టమని నేను 1998 డీఎస్సీ క్వాలిఫై అభ్యర్థినని తెల్పడంతో అందరూ ఆశ్చర్యంగా ఒక వింతగా ఎమ్మెల్యేని చూడడం జరిగింది. తన సర్టిఫికెట్లు verify చేయాల్సిందిగా అధికారులను కోరినట్లు తెలిసింది.


మరో ఆశ్చర్యకరమైన సంఘటన:


నెల్లూరు జిల్లాలో దొరవారిసత్రం మండలానికి చెందిన మునుస్వామి ప్రస్తుతం దుబాయిలో సెటిలై నెలకు రెండున్నర లక్షల జీతం తీసుకుంటున్నాడు. అయినప్పటికీ తను 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థి కావడంతో రెండున్నర లక్షల జీతం వదులుకొని ఈరోజు నెల్లూరులో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కి హాజరవ్వడం చూసిన అధికారులు ఎంతో ఆశ్చర్యపోయారు. దీనిని బట్టి ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎంత మోజు ఉందో ఇప్పటికైనా అందులోనూ టీచరు ఉద్యోగం అంటే ఎంత మమకారం ఉందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు జనం.

 
 
 

Comments


bottom of page