ఉపాధ్యాయురాలి హత్యకు విద్యార్థుల పన్నాగం
- AP Teachers TV
- Feb 26
- 1 min read

ఉపాధ్యాయురాలిపై కక్ష పెంచుకున్న అయిదుగురు విద్యార్థులు ఏకంగా ఆమెను అంతమొందించేందుకు ప్రణాళిక రచించారు.
పాఠశాల మరుగుదొడ్డిలో పేలుడు పదార్థం అమర్చిన వైనం
బిలాస్‌పుర్: ఉపాధ్యాయురాలిపై కక్ష పెంచుకున్న అయిదుగురు విద్యార్థులు ఏకంగా ఆమెను అంతమొందించేందుకు ప్రణాళిక రచించారు. సోడియం నీటితో కలిసినప్పుడు పేలుడు సంభవిస్తుందని ఆన్‌లైన్ వీడియోల ద్వారా తెలుసుకున్నారు. ఉపాధ్యాయురాలు వాష్‌రూంకు వచ్చే సమయంలో సిస్టర్న్ (మరుగుదొడ్డి దగ్గర ఉండే నీటితొట్టె) ఔట్లెట్‌లో సోడియం అమర్చారు. ఇంతలో నాలుగో తరగతి విద్యార్థిని ఫ్లష్‌ను ఉపయోగించడంతో పేలుడు సంభవించి తీవ్రంగా గాయపడింది. ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పుర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఈ నెల 21న ఈ ఘటన చోటుచేసుకుంది. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ముగ్గురు విద్యార్థినులు సహా మొత్తం ఐదుగురు విద్యార్థులు ఈ ఘటనకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ నెల 23న నలుగురిని అరెస్టు చేసి జువైనల్ హోంకు తరలించినట్లు తెలిపారు. మరో విద్యార్థి వేరే ఊర్లో ఉండటంతో ఇంకా అదుపులోకి తీసుకోలేదన్నారు. అరెస్టైన నలుగురూ 8వతరగతి విద్యార్థులని వెల్లడించారు.












Comments