top of page

ఉపాధ్యాయ సంఘాలతో సీఎస్ఈ సమావేశ వివరాలు




ree

ఈరోజు సీఎస్ఈ సమావేశ వివరాలు ఈరోజు అడిషనల్ డైరెక్టర్ శ్రీ ఏ సుబ్బారెడ్డి ఉపాధ్యాయ సంఘాలతో వెబెక్స్ ద్వారా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశంలో చర్చించిన అంశాలు

✍️ బదిలీల ప్రక్రియ యధావిధిగా కొనసాగుతుందని, బదిలీల చట్టంపై నిన్నటి రోజున కోర్టు ఇచ్చిన స్టే పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

✍️ పది రోజులలో బదిలీల షెడ్యూల్ ను ప్రారంభిస్తామన్నారు.

✍️ తెలుగు మీడియం, మైనర్ మీడియంలో ఎంపికైన ఉపాధ్యాయుల సీనియారిటీని కలిపి రూపొందించేటప్పుడు మార్కుల ఆధారంగా రూపొందిస్తామన్నారు.

✍️ రివర్షన్ పై వెళ్లిన ఉపాధ్యాయుల సీనియారిటీపై ఉపాధ్యాయసంఘాల ప్రాతినిధ్యాన్ని నిబంధనలను పరిశీలించి నిర్ణయం ప్రకటిస్తామన్నారు.

✍️ ఫౌండేషన్ పాఠశాలలకు 1:20 ప్రకారం ఉపాధ్యాయులను కేటాయించాలని కోరడం జరిగింది.

✍️ ఉన్నత పాఠశాలల్లోని ప్రాధమికోన్నత తరగతులకు 45 వద్ద రెండవ సెక్షన్, 75 వద్ద మూడో సెక్షన్ పరిగణించాలని కోరడం జరిగింది.

✍️ ఉన్నత పాఠశాలల్లో 9,10 తరగతులకు 50 వద్ద రెండో సెక్షన్, 90 వద్ద మూడో సెక్షన్ పరిగణించాలని కోరడం జరిగింది.

✍️ గుంటూరు నగర పాలక పరిధిలో ఇందిరానగర్ లోని ప్రాధమికోన్నత పాఠశాలను విద్యార్థుల సంఖ్యను, ఎస్ఎంసి తీర్మానాన్ని పరిగణలోకి తీసుకోకుండా మోడల్ ప్రైమరీగా ప్రతిపాదించారని ప్రాథమికోన్నత పాఠశాల గానే కొనసాగించాలని ప్రాతినిధ్యం చేయడం జరిగింది.



✍️ పోస్టుల పునర్విభజన ప్రక్రియలో మిగులు ఉపాధ్యాయులుగా గుర్తింపబడిన కొందరు ఉపాధ్యాయులు మెడికల్ క్యాంపులో దరఖాస్తు చేసుకో లేకపోయిన వారికి ఒకరోజు అవకాశం కల్పించాలని కోరడం జరిగింది.

✍️ తెలుగు మాధ్యమం, ఉర్దూ మాధ్యమం గల ప్రాథమిక పాఠశాలల్లో మాతృభాష ఆధారంగా అదనపు పోస్టుగా మంజూరు చేయబడిన ఉర్దూ, తెలుగు ఎస్.జి.టి పోస్టులను రద్దు చేయరాదని కోరడం జరిగింది.

✍️ ప్రాథమికోన్నత పాఠశాలల్లో మంజూరు చేసే స్కూల్ అసిస్టెంట్ పోస్టుల క్రమంపై స్పష్టత ఇవ్వాలని కోరడం జరిగింది.

✍️ ప్రాధాన్యత కేటగిరీ కింద బదిలీ కొరకు దరఖాస్తు చేసుకునే ఉపాధ్యాయులు ధ్రువపత్రాలు కొందరికి అప్లోడ్ కావడం లేదని వెంటనే అందరికీ అవకాశం కల్పించాలని కోరడం జరిగింది.

✍️ పోస్టుల పునర్విభజన ప్రక్రియలో మిగులుగా గుర్తించబడే ఉపాధ్యాయులకు పాయింట్ల కేటాయింపు పై స్పష్టత ఇవ్వాలని కోరడం జరిగింది.

✍️ ఉమ్మడి అనంతపురం జిల్లా ఇంగ్లీష్ పదోన్నతులపై చర్చించడం జరిగింది.

✍️ విద్యార్థుల సంఖ్య కొరకు కటాఫ్ తేదీ మార్చి 31 కాకుండా మార్చాలని కోరడం జరిగింది.

✍️ కంపోజిట్ కోర్సుగా తెలుగు ఉర్దూ సంస్కృతం కొరకు గతంలో వలె పోస్టులను కొనసాగించాలని ప్రాతినిధ్యం చేయడం జరిగింది.

✍️ మిగులుగా తేల్చబడిన ఉపాధ్యాయులను సర్దుబాటు చేయు ప్రక్రియపై చర్చించడం జరిగింది.

✍️ ప్లస్ టు పాఠశాలల్లోని ఉపాధ్యాయుల సర్దుబాటుపై చర్చించడం జరిగింది.

✍️ బదిలీలు, పోస్టుల పునర్విభజన ప్రక్రియలో పలు అంశాలపై ప్రాతినిధ్యం చేయడం జరిగింది.

✍️ మెగా డీఎస్సీ 2025, టెట్ నిర్వహణపై ప్రాతినిధ్యం చేయడం జరిగింది.

✍️ 117 జీవో అమలు చేయునపుడు రద్దు పరచిన ప్రధానోపాధ్యాయ పోస్టులను పునరుద్ధరించాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రాతినిధ్యం చేయడం జరిగింది.




 
 
 

Comments


bottom of page