ఊపందుకున్న డీఎస్సీ 1998 నియామకాలు
- AP Teachers TV
- Jan 26, 2023
- 1 min read

1998లో జరిగిన డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలలో ఎంతమంది ఉత్తీర్ణత పొందారు? ఎంతమంది ఉద్యోగాలు పొందారు? ఎంతమంది అర్హత ఉండి ఉద్యోగం పొందలేదు? అనే తదితర వివరాలు అందజేయమని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని అవిభాజ్య జిల్లాల విద్యాశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అత్యంత త్వరితంగా పూర్తి వివరాలు సమర్పించవలసినదిగా ప్రభుత్వం ఈ ఉత్తర్వులలో పేర్కొనడంతో డీఎస్సీ 1998 నియామకాలు ఊపందుకున్నాయని చెప్పవచ్చు. ఈ వార్త ఈరోజు అన్ని తెలుగు దినపత్రికలలో ప్రచురితమవడం గమనించవచ్చు.ఈ క్రింద ఉత్తర్వుల కాపీని గమనించవచ్చు. ఇది డిజిటల్ డాక్యుమెంట్ కావడంతో దీనిపై అధికారుల సంతకం కనిపించదు.













Comments