ఎస్‌బీఐ లోన్స్ వడ్డీరేట్లు తగ్గాయ్ SBI Loans
- AP Teachers TV
- Feb 16
- 1 min read
ఎస్‌బీఐ లోన్స్ వడ్డీరేట్లు తగ్గాయ్ SBI Loans

ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రుణ వడ్డీ రేట్లను తగ్గించింది. ఇటీవలి సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలకమైన రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి, 6.25 శాతానికి పరిమితం చేసింది.
గృహ, వాహన, వ్యక్తిగత రుణగ్రహీతలకు ఊరట
15 నుంచే అమల్లోకి
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రుణ వడ్డీ రేట్లను తగ్గించింది. ఇటీవలి సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలకమైన రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి, 6.25 శాతానికి పరిమితం చేసింది. ఇందుకు అనుగుణంగా ఎస్‌బీఐ తన ఈబీఎల్‌ఆర్ (ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్-బేస్డ్ లెండింగ్ రేట్), ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్ (రెపో లింక్డ్ లెండింగ్ రేట్)ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ మార్పు ఫిబ్రవరి 15 నుంచే అమల్లోకి వచ్చింది. ఫలితంగా వీటికి అనుసంధానమై ఉన్న వ్యక్తిగత, వాహన, గృహరుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి.
బ్యాంకును సంప్రదించాలి: గృహరుణం తీసుకున్న వారు.. ఒకసారి తమ బ్యాంకును సంప్రదించి రుణ వడ్డీ రేటు తగ్గింపు తమకు వర్తిస్తుందో లేదో తెలుసుకోవాలి. ఈఎంఐ తగ్గించాలా? రుణ చెల్లింపు వ్యవధి తగ్గించుకోవాలా? అనే నిర్ణయమూ తీసుకోవచ్చు. సాధ్యమైనంత వరకు వ్యవధి తగ్గించుకోవడమే మేలని నిపుణుల సూచన.
ఇతర బ్యాంకులూ..: కెనరా బ్యాంక్, పీఎన్‌బీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా సైతం రెపో ఆధారిత వడ్డీ రేట్లను 0.25% మేర తగ్గించాయి.
క్రెడిట్ స్కోరు ఆధారంగా: క్రెడిట్ స్కోరు ఆధారంగా ఎస్‌బీఐ గృహ రుణ వడ్డీ 8.25% నుంచి 9.20% వరకూ ఉంటుంది. టాపప్ రుణం తీసుకోవాలనుకుంటే.. వడ్డీ రేటు 8.55% నుంచి 11.05% అవుతుంది. ఈబీఆర్‌ఎల్ ఆధారంగా రుణం తీసుకుంటే వడ్డీ రేటు 8.90%. నిధుల ఆధారిత రుణ వడ్డీ రేట్లు (ఎంసీఎల్‌ఆర్), బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్, బేస్‌రేట్లలో ఎలాంటి మార్పులూ చేయలేదు.
మార్పులు ఇలా
ఈబీఎల్‌ఆర్ 9.15 శాతం నుంచి 8.90 శాతానికి తగ్గింది. దీంతోపాటు ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ను 8.75 శాతం నుంచి 8.50 శాతంగా సవరించింది.
గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు కొత్తగా తీసుకునే వారికి తగ్గించిన వడ్డీ వర్తిస్తుంది. ఫలితంగా నెలవారీ వాయిదా (ఈఎంఐ) ప్రస్తుతం కంటే కొంత తగ్గుతుంది.
ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి కాలవ్యవధి లేదా ఈఎంఐ తగ్గుతుంది.














Comments