ఏపీ టెట్ - జూన్ 2026 ఫలితాలు వచ్చేశాయ్! మీ రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలంటే..

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్) – జూన్ 2026 కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్! ఏపీ విద్యాశాఖ టెట్ ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది.
ఈ ఏడాది ఆగస్టు 5 నుంచి 16 వరకు ఆన్‌లైన్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ - CBT) విధానంలో 12 రోజుల పాటు ఈ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. పరీక్షలు ముగిసిన వెంటనే ప్రాథమిక 'కీ' విడుదల చేసి, అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. నిపుణుల కమిటీ ఈ అభ్యంతరాలను పరిశీలించి, అవసరమైన మార్పులు చేసిన తర్వాత ఫైనల్ 'కీ' ఆధారంగా ఇప్పుడు తుది ఫలితాలను ప్రకటించారు.
గణాంకాలు ఏం చెబుతున్నాయి?
మొత్తం దరఖాస్తులు: 2,14,486 మంది అభ్యర్థులు (2,38,252 పేపర్లకు) దరఖాస్తు చేసుకున్నారు.
పరీక్షకు హాజరైన వారు: 1,97,703 మంది అభ్యర్థులు (2,18,254 పేపర్లకు) హాజరయ్యారు.
ఉత్తీర్ణత సాధించిన వారు: 90,862 మంది అభ్యర్థులు (99,591 పేపర్లలో) పాస్ అయ్యారు.
ఉత్తీర్ణత శాతం: హాజరైన అభ్యర్థుల్లో 45.63 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల పరిస్థితి ఏంటి?
ఇక ఇప్పటికే విధుల్లో ఉన్న ఉపాధ్యాయుల (ఇన్-సర్వీస్) విషయానికి వస్తే:
74,711 మంది దరఖాస్తు చేసుకోగా.. 72,288 మంది పరీక్ష రాశారు.
వీరిలో 37,789 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల్లో ఉత్తీర్ణత శాతం 50.93% గా నమోదైంది. (గత ఏడాది అక్టోబర్ 2025లో ఇది 47.82% గా ఉంది).
ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?
అభ్యర్థులు తమ ఫలితాలను సులభంగా తెలుసుకునేందుకు విద్యాశాఖ రెండు మార్గాలను అందుబాటులో ఉంచింది:
వెబ్‌సైట్ ద్వారా: అభ్యర్థులు తమ కాండిడేట్ లాగిన్ వివరాలతో కింది వెబ్‌సైట్లలో ఏదైనా ఒకదానిలో లాగిన్ అయి ఫలితాలను చూసుకోవచ్చు.
వాట్సాప్ ద్వారా (సరికొత్త సదుపాయం!): ఈసారి ఫలితాలను వాట్సాప్ ద్వారా తెలుసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. మీ ఫలితాల కోసం 9552300009 వాట్సాప్ నంబర్‌ను సంప్రదించవచ్చని ఏపీ టెట్ కన్వీనర్ శ్రీ ఎం. వెంకట కృష్ణారెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు.
పాస్ అయిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు! రాబోయే డీఎస్సీ (DSC) కి సిద్ధమవుతున్న వారు ఇదే ఉత్సాహంతో ప్రిపరేషన్ కొనసాగించండి.



Comments