top of page

కమీషనర్ తో చర్చలు - ఏం జరిగింది??



ఈరోజు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ద్వారా కమిషనర్ మరియు విద్యాశాఖ సెక్రటరీతో సుదీర్ఘంగా సుమారు 8 గంటల పాటు చర్చలు జరిగాయి.

  • ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్లు అయినటువంటి 16 అంశాలలో మొట్టమొదటి అంశంగా ఉన్నత పాఠశాలలో 53 రోల్ దాటిన తర్వాతనే రెండో సెక్షన్ ఇచ్చే విషయమై ప్రతిష్టంభన నెలకొంది

  • మనం 45 దాటిన వెంటనే రెండో సెక్షన్ ఇవ్వాలని కోరాము ఈ విషయంలో చాలా సుదీర్ఘంగా చర్చలు జరిగాయిగాని పూర్తిస్థాయిగా క్లారిటీ రాలేదు.

  • మరియు తెలుగు మీడియం సమాంతర మీడియంగా కొనసాగించాలని కోరగా ఈ విషయం కూడా ప్రభుత్వ పరిధిలోని విషయమని దీనిపై ప్రభుత్వ స్థాయిలో చర్చించాల్సి ఉందని చెప్పారు.

  • అంతేకాకుండా గతంలో ఫౌండేషన్ పాఠశాలలకు 30 రోలు ఉన్న సందర్భంలోనే రెండో పోస్ట్ ఇచ్చేవారు దానిని 21 రోల్ కి రెండో పోస్ట్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు.

  • స్టడీ లీవ్ లో వెళ్లే ఉపాధ్యాయులు ఈ సంవత్సరం ఆగస్టు లోపు తిరిగి చేరే వారికి వారి స్థానాలని బదిలీల్లో చూపించకుండా మినహాయింపు ఇచ్చారు.




  • ఫిజికల్లీ ఛాలెంజ్ ఉపాధ్యాయులు వారు 40%ప్రాధమిక మరియు 50% ఉన్నత పాఠశాలలో కోరుకునే సందర్భంలో వారికి కోరుకునే అవకాశం లేనప్పుడు జనరల్ కేటగిరిలో కూడా కోరుకునే అవకాశం కల్పించారు.

  • వేకెన్సీలు వేటిని కూడా బ్లాక్ చేయరు.

  • ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ల పోస్టులు రాష్ట్రవ్యాప్తంగా 9620 ఉండగా ఇప్పటికే 3532 ఎల్ ఎఫ్ ఎల్ పోస్టులుగా పనిచేస్తున్నారు.

  • మిగిలిన 6088 పోస్టులలో 1382 పోస్టులు సెకండ్ గ్రేట్ టీచర్లకు ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ గా పదోన్నతిస్తారు మిగిలిన 4706 పోస్టులకు స్కూల్ అసిస్టెంట్లను వాటిలో నియమిస్తారు.

  • సెకండరీ గ్రేడ్ టీచర్స్ లకు మాన్యువల్ కౌన్సిలింగ్ ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని అయితే రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 72,000 మంది తప్పనిసరి బదిలీకి గురవుతున్న ఉపాధ్యాయులు 25వేల మంది రిక్వెస్ట్ బదిలీలు జరిగే అవకాశం ఉంది వీరిలో మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా అయితే కేవలం 72,000 ఖాళీలు మాత్రమే కనిపిస్తాయని రిక్వెస్ట్ బదిలీల ఖాళీలు వీరు కోరుకునే అవకాశం ఉండదు కాబట్టి మీరు ఆలోచించుకొని ఏ నిర్ణయం చెప్పమని కోరారు. దీని ప్రకారం క్రింది స్థాయిలో జిల్లాల వారీగా సమాచారం సేకరించి మీకు సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఆన్లైన్ బదిలీ కావాలా లేదా మాన్యువల్ బదిలీ కావాలనేది మీ జిల్లా సమాచారం తెలియజేయండి.

  • అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 779 హై స్కూల్స్ అప్ గ్రేడ్ అయ్యాయి ఈ విషయాలలో కొంత క్లారిటీ వచ్చినప్పటికీ ముఖ్యమైన విషయాలు అయిన 45 రోల్ దాటిన సందర్భంలో రెండవ సెక్షన్ విషయంలో ఇంకనూ క్లారిటీ రావాల్సి ఉంది కాబట్టి ఉపాధ్యాయుల ఉద్యమాన్ని యధావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు





 
 
 

Comments


bottom of page