top of page

గతి తప్పిన రాష్ట్ర పాలనను సత్వరమే గాడిన పెట్టాలి,ఉద్యోగులకు త్వరగా పీఆర్సీ ప్రకటించాలి : హైకోర్ట్ ఉద్యోగుల సంఘం #apadministration #apprc #apemployees #aphighcourtemployees


2024 సార్వత్రిక ఎన్నికలలో ఘనవిజయం సాధించిన తెలుగుదేశం పార్టీ కూటమికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అక్కెన వేణుగోపాలరావు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. గతి తప్పిన రాష్ట్ర పాలనను కొత్తగా కొలువైన ప్రభుత్వం సత్వరమే గాడిన పెట్టాలని హైకోర్ట్ ఉద్యోగుల సంఘం కోరింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావలసిన నూతన పీఆర్సీని వీలైనంత త్వరగా అమలుచేసి ఈ లోగా తగినంత ఐఆర్‌ను వెంటనే ప్రకటించాలని సంఘం కోరింది.

ree


అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికలలో ఘనవిజయం సాధించిన తెలుగుదేశం పార్టీ కూటమికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అక్కెన వేణుగోపాలరావు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. గతి తప్పిన రాష్ట్ర పాలనను కొత్తగా కొలువైన ప్రభుత్వం సత్వరమే గాడిన పెట్టాలని హైకోర్ట్ ఉద్యోగుల సంఘం కోరింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావలసిన నూతన పీఆర్సీని వీలైనంత త్వరగా అమలుచేసి ఈ లోగా తగినంత ఐఆర్‌ను వెంటనే ప్రకటించాలని సంఘం కోరింది. ఉద్యోగులకు రావలసిన బకాయిలు సత్వరమే విడుదల చెయ్యాలని హైకోర్ట్ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఉద్యోగులకు చీకటి రోజులు తొలగించి, రానున్న రోజుల్లో నూతన ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉండాలని వేణుగోపాల రావు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులు వైద్య, ఆరోగ్య సంక్షేమానికి పెద్దపీట వెయ్యాలని వేణుగోపాలరావు కోరారు.


All News From apttv.co.in



 
 
 

Comments


bottom of page