top of page

చదువరా అంటే ఈ పిల్లోడు ఏమంటున్నాడో చూడండి. వైరల్ వీడియో

Oct 5, 2022
1 min read

స్కూల్‌కు వెళ్లడం.. హోం వర్క్ చేయడం.. చదవడం.. ఇలాంటి మాటలు సాధారణంగానే చిన్న పిల్లలకు నచ్చవు. వాటిని తప్పించుకోవడానికి రకరకాల కారణాలు చెబుతూ ఉంటారు. ఈ కోవకే చెందిన ఓ బుడ్డోడి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆ వీడియోను ఐదు లక్షల మంది వీక్షించగా.. 23వేల మంది లైక్ చేశారు. కాగా.. ఇంతకూ ఆ వీడియోలో ఏముందంటే..

ఓ మహిళ తన పిల్లలు ఇద్దరిని కూర్చోబెట్టి.. హోం వర్క్‌ చేయించింది. అనంతరం స్కూల్‌లో చెప్పిన పాఠాలను చదివించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే బుడ్డోడు.. చదవనని మారాం చేస్తాడు. దీంతో ఎందుకు చదవవు? అని ఆ తల్లి ప్రశ్నంచగా.. దానికి చిన్నోడు ఫన్నీ రిప్లే ఇచ్చాడు. ‘అరే ఎంత సేపు చదవాలి. చదివి.. చదివి.. ముసలాడిని అయ్యేలా ఉన్నాను’ అంటూ ఏడుస్తూ తన బాధను వ్యక్తం చేశాడు. ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘అవును మన ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు రావాలి’ అంటూ కొందరు కామెంట్ చేస్తే.. ‘చదివితేనే జీవితం బాగుంటుంది’ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.






 
 
 

Recent Posts

See All
ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నిబంధనల ముసాయిదాపై సమగ్ర సమీక్ష - కేంద్ర విద్యాశాఖ నిర్ణయం

కేంద్ర విద్యాశాఖ తాజా నిర్ణయం: సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ (TET) సమీక్ష ప్రస్తుతం సర్వీసులో కొనసాగుతున్న ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నిబంధనల

 
 
 

1 Comment


Gousepeer Shaik
Gousepeer Shaik
Oct 05, 2022

Marellous

Like
bottom of page