top of page

జూన్ 6 నుంచి మెగా డీఎస్సీ పరీక్షలు

Updated: Jun 1


AP Mega DSC
AP Mega DSC

జూన్ 6 నుంచి మెగా డీఎస్సీ పరీక్షలు

అమరావతి:మే 31

ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ పరీక్షలకు షెడ్యూలు విడుదలైంది, ప్రభుత్వం.. దీనికోసం మెగా డీఎస్సీ పరీక్షలకు షెడ్యూల్‌ విడుదల చేసింది.. ఆ షెడ్యూల్‌ ప్రకారం.. జూన్‌ 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.


ఈ మేరకు ఏపీ విద్యాశాఖ ఏర్పాట్లలో నిమగ్నమైంది.. కాగా, ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించింది.. ఏపీకి చెందిన వారితోపాటు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కూడా కలిపి మొత్తం 3,35,401 మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు..


దీంతో ఏపీతో పాటు పొరు గురాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లోనూ పరీక్ష కేంద్రా లను ఏర్పాటు చేయబోతు న్నారు..ఇక, జూన్ 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరగనున్న మెగా డీఎస్సీ పరీక్షల్లో.. ప్రతిరోజు రెండు సెషన్లలో డీఎస్సీ నిర్వహించనున్నారు..


ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్ జరగనుండగా.. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.. అయితే, ఈ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) ద్వారా నిర్వహించబోతోంది.

Comments


bottom of page