top of page

టీచర్ల బదిలీలకు నేడు షెడ్యూల్?




ap teachers transfers 2025 latest news

ఉపాధ్యాయ బదిలీలకు ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది. తాజాగా బడుల పునర్వ్యవస్థీకరణ, పోస్టుల హేతుబద్ధీకరణపై జీవోలు వి డుదల కావడంతో గురువారం బదిలీలపై జీవో ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు చర్యలు చేప ట్టారు. గురువారం జీవో విడుదల చేస్తే శుక్రవారం నుంచే బదిలీల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ మేరకు పాఠ శాల విద్యాశాఖ షెడ్యూలు విడుదల చేయనుంది. కొత్తగా రూపొందించిన టీచర్ల బదిలీల చట్టం ఆధారంగా బదిలీలు జరగనున్నాయి. ప్రస్తుత పాఠశాలలో ఐదు విద్యా సంవత్సరాలు పూర్తిచేసుకున్న ప్రధానోపాధ్యాయులు, ఎని మిది విద్యా సంవత్సరాలు పూర్తిచేసుకున్న ఉపాధ్యా యులు తప్పనిసరిగా బదిలీ అవుతారు. పాఠశాలలో రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న టీచర్లు బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యా సంవత్సరాల లెక్కింపునకు మే 31ని కటాఫ్ తేదీగా నిర్ణయించారు.


🔹డీఎస్సీ నియామకం ఉన్నందున బ్లాకింగ్ ఆఫ్ వేకెన్సీస్ ఉండవు.

🔹ప్రస్తుతం రేష్నలైజేషన్లో విల్లింగ్ తో పాల్గొంటున్న సీనియర్ ఉపాధ్యాయులు గత ఎనిమిది సంవత్సరాల్లో స్పెషల్ ప్రిఫరెన్షియల్ కేటగిరి వాడుకొననిచో ప్రస్తుతము వారికి కేటాయిస్తారు.



కర్నూలు: ఉపాధ్యాయుల బదిలీప్రక్రియ ఈ నెల 15 నుంచి ప్రారంభమవుతుందని డీఈవో శామ్యూల్పాల్ తెలిపారు. నగర పరిధిలోని సెయింట్ క్లారెట్ పాఠశాలలో బుధవారం కర్నూలు, నంద్యాల జిల్లాల విద్యాశాఖ అధికారులతో ఆయన సమా వేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కన్వర్షన్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్ కింద 251 ఆదర్శ ప్రాథ మిక ప్రధానోపాధ్యాయ పోస్టులు మంజూరయ్యాయి. సర్స్ ఉన్న 97 పోస్టులను ఖాళీలకు అనుగుణంగా కన్వర్ట్ చేశామన్నారు. కొత్తగా 86 హైస్కూల్ ప్రధానోపా ధ్యాయుల పోస్టులు, 957 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 406 ఎస్జీటీ పోస్టులు మంజూరైనట్లు చెప్పారు. జిల్లాలో 97 అప్పర్ ప్రైమరీ పాఠశాలలను హైస్కూళ్లుగా ఉన్నతీ కరించామన్నారు. ఖాళీలకు సంబంధించి తప్పుడు సమా చారాన్ని సామాజిక మాధ్యమాల్లో పంపిస్తున్న వారిపైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. బదిలీ ప్రక్రియ ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా చేపట్టేం దుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు.



నిన్న మధ్యాహ్నం ఉపాధ్యాయ సంఘాలు విద్యా భవన్ నందు విద్యా శాఖ సంచాలకులని కలవగా, ఉపాధ్యాయ బదిలీలు రేషనలైజేషన్ విషయమై పలు అంశాల గురించి వివరించారు.

👉 బ్లాకింగ్ ఆఫ్ వేకెన్సీస్ గురించి ప్రస్తావించినప్పుడు ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో మాట ఇచ్చాము డీఎస్సీ నియామకం ఉన్నందున బ్లాకింగ్ ఆఫ్ వేకెన్సీస్ ఉండవు అని తెలిపారు.

👉01.09.2017 వ తేదీ పదోన్నతి పై జాయిన్ అయిన వారందరూ 8 సంవత్సరాల పూర్తి సర్వీస్ తో బదిలీ అవుతారు (కర్నూలు జిల్లా).

👉ప్రస్తుతం రేష్నలైజేషన్లో విల్లింగ్ తో పాల్గొంటున్న సీనియర్ ఉపాధ్యాయులు గత ఎనిమిది సంవత్సరాల్లో స్పెషల్ ప్రిఫరెన్షియల్ కేటగిరి వాడు కొననిచో ప్రస్తుతము వారికి కేటాయిస్తారు.

👉ప్రాథమిక పాఠశాలల్లో సమాంతర మీడియం ఉపాధ్యాయులతో సంబంధం లేకుండా విద్యార్థుల నమోదు ప్రకారం ఎస్జీటీ తెలుగు పోస్టులు కేటాయిస్తారు.

👉అందరితో సమానంగా హియరింగ్ ఎంపైర్ వారికి కూడా 40 శాతం నుండి 55% వారికి ఐదు పాయింట్లు, above 55% నుండి 69 శాతం వరకు 7 పాయింట్లు కేటాయిస్తారు.

👉జిల్లా విద్యాశాఖ అధికారులు మరియు ఉపాధ్యాయ సంఘాల నుండి అందిన సమస్యలకు సమాధానాలతో రాతపూర్వకంగా సమస్యలు సమాధానం పేరిట వివరణలు వెలువడుతున్నవి.




 
 
 

Comments


bottom of page