టీచర్స్ ఆందోళన వద్దు.. ఆ సంతకం గిన్నిస్ రికార్డు కోసం
- AP Teachers TV
- Jul 5
- 1 min read

🔸ఆందోళన వద్దు.. ఆ సంతకం గిన్నిస్ రికార్డు కోసం..
🔸లీప్ యాప్‌లో మెగా పీటీఎం 2.0 రిజిస్ట్రేషన్‌లో విట్నెస్‌పై అపోహలు
🔸మెగా పీటీఎం 2.0 గిన్నిస్ రికార్డు కోసం లీప్ యాప్‌లో విట్నెస్ వివరాలు తప్పనిసరి
🔸 విద్యాశాఖ, టీచర్, పిల్లల తల్లిదండ్రులు కాకుండా ఎవరితోనైనా సంతకం చేయించొచ్చు
🔸ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అపోహలు వీడండి
🔸మెగా పీటీఎం 2.0ని గిన్నిస్ రికార్డుల్లో నమోదు చేసేందుకు సహకరించండి
🔸 సమగ్ర శిక్షా పథక రాష్ట్ర సంచాలకులు బి.శ్రీనివాసరావు
గతేడాది అందరి సహకారంతో అద్భుతంగా నిర్వహించి చరిత్ర సృష్టించిన మెగా పీటీఎం, ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ జూలై 10న గిన్నిస్ బుక్ రికార్డుల్లో నమోదు చేయించేందుకు ఒక మహాయజ్ఞంలా నిర్వహిస్తున్నామని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. గిన్నిస్ రికార్డుల నమోదు బృందం ఇచ్చిన సూచనల మేరకు విద్యాశాఖ, టీచర్, తల్లిదండ్రి కానీ...అదే పాఠశాల పరిధిలో ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిని అంటే సర్పంచ్, ఎంపీటీసీ, రిటైర్డ్ ప్రభుత్వోద్యోగి, దాత, పూర్వ విద్యార్థి ఎవరినైనా రిజిస్ట్రేషన్‌కు సాక్ష్యంగా, ఆ వ్యక్తి వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం మాత్రమే, ఆ టీం ఇచ్చిన సూచనల మేరకు లీప్ యాప్‌లో మెగా పీటీఎం 2.0 రిజిస్ట్రేషన్‌లో వ్యక్తి విట్నెస్ నమోదు తప్పనిసరి అని, ఆ విట్నెస్ ఇచ్చే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి కాకూడదని వివరించారు. అంతకుమించి ఈ విట్నెస్ నమోదు వెనుక ఎటువంటి ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు.
ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, సిబ్బంది, ప్రజల సహకారంతో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయేలా గత ఏడాది డిసెంబర్ 7న నిర్వహించిన మెగా పీటీఎంలో అంతా కలిసి కోటికి పైగా పాల్గొన్నారని తెలిపారు. జూలై 10న నిర్వహించబోయే మెగా పీటీఎం 2.0లో 2.28 కోట్ల మందికి పైగా పాల్గొని గిన్నిస్ రికార్డు నెలకొల్పే ప్రయత్నం చేయనున్నామని ప్రకటించారు. పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్లు, పూర్వ విద్యార్థులు, ఎస్ఎంసీలు, దాతలు ప్రజాప్రతినిధులు అంతా కలిసి సహకరించినప్పుడే చదువుల మహాపండుగ విజయవంతం అవుతుందన్నారు. ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దని, అంతా పారదర్శకంగా, అంతా గురువుల చేతుల మీదుగా జరుగుతోందని వివరించారు. మనబడులను బాగు చేసుకునేందుకు నిర్వహించే ఆత్మీయ సమావేశంను అద్భుతంగా నిర్వహించే గురుతర బాధ్యత గురువులదేనని ఎస్పీడీ పేర్కొన్నారు.












Comments