top of page

డిఎస్సీ-2025 కౌన్సిలింగ్ సమాచారం


ree

మెగాడిఎస్సి-2025 కౌన్సిలింగ్ సమాచారం.


కర్నూలు జిల్లాలో కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో ఆప్షన్లు ఇవ్వవలసిన పరిస్థితి ఉండడంతో ఆ జిల్లాలో మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ కారణంగా మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా మాన్యువల్ కౌన్సిలింగ్ నే నిర్వహిస్తారని వినిపిస్తోంది అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖ అధికారి సందేశం ఈ క్రింది విధంగా ఉంది.


మెగాడీఎస్సి 2025 కు సంబంధించి ఎంపిక అయిన ఉమ్మడి తూర్పు గోదావరి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు పోస్టింగ్ నిమిత్తము వెబ్ ఆధారిత కౌన్సిలింగ్ ఆర్ఐఇటి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, భూపాలపట్నం, పిడింగొయ్యి రాజమహేంద్రవరం నందు సాయంత్రం ది.09.10.2025 సాయంకాలం 6 గంటలకు ప్రారంభమగును.

కావున ఉపాధ్యాయులు పూర్వ తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖ అధికారి వెబ్సైట్ deo.org లో ఉన్న వేకెన్సీలను ముందుగానే చూసుకొని కౌన్సిలింగ్ నకు సన్నద్ధతతో హాజరు కావలసిందిగా కోరడమైనది.


జిల్లా విద్యాశాఖ అధికారి,

పూర్వ తూర్పుగోదావరి జిల్లా,

కాకినాడ.

మీమీ జిల్లాల ఖాళీల సమాచారం కోసం మీ జిల్లా విద్యాశాఖాధికారి వెబ్ సైటులను సందర్శించగలరు.

ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన సమాచారం మేరకు ఉన్న వేకెన్సీలను ఈ కింది బటన్ నొక్కి చూడగలరు / డౌన్లోడ్ చేసుకోగలరు.


 
 
 

Recent Posts

See All

Comments


bottom of page