top of page

డీజీపీపై వ్యాఖ్యలు.. ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌పై కేసు Naa Anveshana

Updated: May 15

డీజీపీపై వ్యాఖ్యలు.. ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌పై కేసు Naa Anveshan



ప్రముఖ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు యూట్యూబ్‌ ఛానెల్‌ నిర్వాహకుడు అన్వేష్‌పై సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

ree

హైదరాబాద్‌: ప్రముఖ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు యూట్యూబ్‌ ఛానెల్‌ నిర్వాహకుడు అన్వేష్‌పై సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, ఐఏఎస్‌ అధికారులు శాంతికుమారి, దాన కిశోర్, వికాస్‌రాజు తదితరులు హైదరాబాద్‌ మెట్రోలో బెట్టింగ్‌ యాప్‌ల ప్రచారం పేరుతో రూ.300 కోట్లు కొట్టేశారంటూ ఓ వీడియో ద్వారా అవాస్తవ, తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులు సుమోటోగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. సైబర్‌క్రైమ్‌ ఠాణా కానిస్టేబుల్‌ ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. వివరాలివీ..!  ‘ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులు, చట్టబద్ధమైన సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు.. పరువుకు భంగం కలిగించేలా వీడియో ఉంది. అధికారుల విశ్వసనీయతను దెబ్బతీసేలా.. ప్రభుత్వం మీద వ్యతిరేకత, ద్వేషాన్ని కలిగించేలా ఆ వీడియో ఉంది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా వీడియో చేసిన కంటెంట్‌ క్రియేటర్‌ అన్వేష్‌ మీద చర్యలు తీసుకోవాలి’’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. అన్వేష్‌ ప్రపంచంలోని వివిధ దేశాల్లో పర్యటిస్తూ.. అక్కడి విశేషాలతో వీడియోలు చేస్తూ విశేష ఆదరణ పొందారు. 



అన్వేష్‌ గురించి అన్వేష్‌ ఒక ప్రముఖ యూట్యూబర్‌గా, ప్రపంచంలోని వివిధ దేశాల్లో పర్యటిస్తూ అక్కడి సంస్కృతీ, భాష, ఆహారం, పర్యాటక ప్రదేశాల గురించి వీడియోలు రూపొందిస్తూ విశేష ఆదరణ పొందారు. ఆయన వీడియోలు చాలామంది యువతకు ప్రేరణగా మారాయి. అయితే, ఇప్పుడు ఆయనపై నమోదైన ఈ కేసు, అతని కంటెంట్‌ క్రియేషన్‌ పద్ధతులపై ప్రశ్నలు రేపుతోంది. అన్వేష్‌ గతంలో చేసిన వీడియోలు, ఆయన వ్యక్తిత్వం, మరియు అతని పర్యటనల ద్వారా పొందిన అనుభవాలు, ఇప్పుడు ఈ కేసుతో పోలిస్తే, ప్రజల దృష్టిలో ఎలా మారతాయో చూడాలి. ఈ కేసు అన్వేష్‌కు మాత్రమే కాకుండా, యూట్యూబ్‌లో కంటెంట్‌ క్రియేటర్లకు కూడా ఒక హెచ్చరికగా మారవచ్చు. సమాచారాన్ని సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా అందించాలి అనే అవసరం, ఈ సంఘటన ద్వారా మరింత స్పష్టమవుతోంది.


Tags: Prapancha yatrikudu, naa anveshana, anvesh, anveshana, naaanveshana, anvesh youtuber, youtuber anvesh, case filed against prapancha yatrikudu anvesh, case on youtuber anvesh.


 
 
 

Comments


bottom of page