top of page

నేటి CSE సమావేశంలో చర్చించిన బదిలీల సమాచారం

Jan 23, 2025
1 min read

ap teachers transfers

నేటి CSE సమావేశంలో చర్చించిన బదిలీల సమాచారం


1. బదిలీలకు సంబంధించి అకడమిక్ ఇయర్స్ ప్రాతిపదికగా తీసుకోవడం లేదు.

➡️మే 31 నాటికి పూర్తి అయిన సంవత్సరాలను తీసుకుంటారు.

➡️2017 వారికి లాంగ్ స్టాండింగ్ కాదు.

➡️2023 వారికి బదిలీలకు అర్హత ఉండదు.


2. 40% నుండి 69% అంగవైకల్యం కలవారికి గత బదిలీలు లాగా రెండు విభాగాలుగా డివైడ్ చేసి పాయింట్లు కేటాయించాలని కోరడం జరిగింది.

➡️అయితే డాక్టర్ల దగ్గర పైరవీలు చేసి పర్సంటేజ్ వేయించుకోకుండా ఉండాలంటే 40% నుండి 69% వరకు ఐదు పాయింట్లు కేటాయించడమే సరి అయినదని కమిషనర్ గారు తెలిపారు.



3. 70 శాతం దాటిన అంగవైకల్యం కలవారికి ప్రిఫరెన్షియల్ క్యాటగిరీగా గుర్తించి,

➡️సెకండ్ గ్రేడ్ టీచర్లు అయితే మూడు పోస్టులు ఉన్నచోటనే ఒకటి కోరుకోవాలి.

➡️స్కూల్ అసిస్టెంట్లు అయితే రెండు పోస్టులో ఉన్న చోట ఒకటి కోరుకోవాలి.


4. 40 సంవత్సరాలు వయసు దాటిన అవివాహిత మహిళలకు ఐదు పాయింట్లు, వితంతు మహిళలకు కూడా అయిదు పాయింట్లు కేటాయిస్తారు.


5. Unauthirised absent వారికి మైనస్ పాయింట్ లో కేటాయిస్తామన్నారు.


6. పోక్సో కేసులో బుక్ అయిన వారికి అదే మండలం కేటాయించరు.


ప్రస్తుతానికి పర్ఫామెన్స్ పాయింట్ లు ఏమీ ఉండవు.*

8. భవిష్యత్తులో కేటాయించేలా చట్టంలో షరతు పెడతామన్నారు.

  • పర్ఫార్మెన్స్ పాయింట్లు పెట్టడానికి ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో సబ్జెక్టు వైస్ గా ప్లాన్ చేస్తామన్నారు.



 
 
 

Recent Posts

See All
ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నిబంధనల ముసాయిదాపై సమగ్ర సమీక్ష - కేంద్ర విద్యాశాఖ నిర్ణయం

కేంద్ర విద్యాశాఖ తాజా నిర్ణయం: సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ (TET) సమీక్ష ప్రస్తుతం సర్వీసులో కొనసాగుతున్న ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నిబంధనల

 
 
 

Comments


bottom of page