top of page

అకడెమిక్ క్యాలెండర్లు (2024-25) ఇవే! డౌన్ లోడ్ చేసుకోండి.

Updated: Aug 1, 2024

పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన 2024-25 అకడెమిక్ క్యాలెండర్‌ను మంత్రి నారా లోకేశ్‌ విడుదల చేశారు


ree

అమరావతి: పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన 2024-25 అకడెమిక్ క్యాలెండర్‌ను మంత్రి నారా లోకేశ్‌ విడుదల చేశారు.  అనంత‌రం ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్యా శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. ప్రభుత్వ విద్యాలయాలు రాజకీయాలకతీతంగా ఉంచాల‌ని అధికారులకు స్పష్టం చేసినట్లు ఆయన ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. ‘‘స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీల పదవీకాలం జూలైతో పూర్తయినందున ఆగస్టులో కమిటీల ఎన్నికలు పూర్తిచేయాలని సూచించాను. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత, మౌలిక సదుపాయాల మెరుగుదల పర్యవేక్షణ బాధ్యతను పేరెంట్స్ కమిటీలకు అప్పగించాలని నిర్ణయించాం. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి విధివిధానాలు ఖరారు చేయాల్సిందిగా సూచించాను’’ అన్నారు.


అమరావతి: విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్ ‘అకడమిక్ క్యాలెండర్’ను విడుదల చేశారు. రాజకీయాలకు అతీతంగా పాఠశాల విద్య అకడమిక్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. నాయకుల బొమ్మలు, పార్టీల రంగులు లేకుండా రూపకల్పన చేశారు. కాగా ఆగస్టులో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల ఎన్నికలకు మంత్రి లోకేశ్ ఆదేశాలు ఇచ్చారు. కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో పోస్టుల భర్తీకి మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.





 
 
 

Comments


bottom of page