ప్రేమ హార్మోన్... ఔషధంగా!
- AP Teachers TV
- Dec 1, 2024
- 1 min read
ఆక్సిటోసిన్ హార్మోన్... దీన్నే లవ్‌హార్మోన్ అని కూడా అంటారు. ఒక్క ప్రేమే కాదు మనలో సున్నితమైన భావోద్వేగాలకీ ఇదే కారణం. బిడ్డ పాలు తాగేటప్పుడు తల్లిలో ఈ హార్మోన్ పెరుగుదల ఉంటుంది... సామాజిక బంధాలు పెంచుకోవడానికీ ఉపయోగపడుతుంది.

ఆక్సిటోసిన్ హార్మోన్... దీన్నే లవ్‌హార్మోన్ అని కూడా అంటారు. ఒక్క ప్రేమే కాదు మనలో సున్నితమైన భావోద్వేగాలకీ ఇదే కారణం. బిడ్డ పాలు తాగేటప్పుడు తల్లిలో ఈ హార్మోన్ పెరుగుదల ఉంటుంది... సామాజిక బంధాలు పెంచుకోవడానికీ ఉపయోగపడుతుంది. కానీ, తాజా అధ్యయనం ఒకటి ఆక్సిటోసిన్‌కి మతిమరుపుని తగ్గించే శక్తి ఉందనీ, నొప్పి నివారణిగానూ పనిచేస్తుందనీ తేల్చింది. టోక్యో, ఫ్లోరిడా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీనిపైన చాలాకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. మెదడులో స్రవించే ఆక్సిటోసిన్ అక్కడి న్యూరాన్స్‌ని చైతన్యవంతం చేసి చెరిగిపోయిన జ్ఞాపకాలని మళ్లీ తీసుకురావడం గమనించారు. అలా ఈ హార్మోన్ డిమెన్షియా, అల్జీమర్స్ వంటి వ్యాధులకి చక్కని ఔషధంలా పనిచేస్తుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అంతేకాదు, పెయిన్‌కిల్లర్స్‌కి ప్రత్యామ్నాయంగానూ దీన్ని ఉపయోగించొచ్చట. ఎందుకంటే ఈ ఆక్సిటోసిన్ నొప్పుల్ని కూడా అదుపు చేయడాన్ని పరిశోధకులు గమనించారు. ఆక్సిటోసిన్‌తో నాసల్ స్ప్రేని తయారుచేసి పెయిన్‌కిల్లర్ల వాడకం తగ్గించవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. డిమెన్షియా, అల్జీమర్స్ వంటి వ్యాధులు ఉన్నవాళ్లు నలుగురితో కలవడం మంచిదట. ఎందుకంటే ఇలా అందరితో కలిసినప్పుడే ఆక్సిటోసిన్ విడుదలవుతుందనీ, అది వ్యాధిని చాలావరకూ తగ్గిస్తుందనీ చెబుతున్నారు.












Comments