ప్రభుత్వ హామీలు వెంటనే అమలు చేయాలి : ఎస్ టి యు కాకినాడ జిల్లా అధ్యక్షులు శేశెట్టి సత్యనారాయణ పిలుపు
- AP Teachers TV
- 4 minutes ago
- 2 min read

రాష్ట్ర ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రోపాధ్యాయ సంఘం ఇచ్చిన దశల వారి పోరాట ఉద్యమ కార్యక్రమానికి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు సిద్ధం కావాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు శేశెట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు . జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ 11వ పిఆర్సి కమిషన్ గడువు పూర్తయి 30 నెలలు దాటుతున్నప్పటికిని ప్రభుత్వం ఇంతవరకు 12వ పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయలేదని కావున వెంటనే 12వ పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయాలని 12వ పిఆర్సి కమిషన్ ఆలస్యమవుతున్నందున రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికులకు 30% ఐ.ఆర్ ప్రకటించాలని. పదవీ విరమణ మరుసటి రోజే పెన్షన్ చెల్లింపు ఉండాలని, పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల గ్రాడ్యుటి, లీవ్ ఎన్ క్యాష్మెంట్ మొత్తాలను వెంటనే చెల్లించాలని, కేంద్ర ప్రభుత్వ మెమో నంబర్ 57 ప్రకారం 2003 డిఎస్సీ ఉద్యోగులకు ఓపిఎస్ విధానాన్ని అమలు చేయడం , 2024 నుండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన 4 విడుదల డి ఏ లను చెల్లించాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం తన ఎన్నికల హామీలో సిపిఎస్ విధానాలకు ప్రత్యామ్నాయ ప్రయోజనకరమైన విధానాన్ని పరిశీలిస్తామని చెప్పి రెండు సంవత్సరాలు దాటినప్పటికిని సిపిఎస్ విధానానికి ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రకటించలేదని రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికులు సిపిఎస్ విధానానికి ప్రత్యామ్నాయంగా ఓ పి ఎస్ విధానాన్ని కోరుతున్నామని కావున రాష్ట్రంలో ఓ పి ఎస్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లకు ఇచ్చిన హామీలను ఇప్పటికైనా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రోపాధ్యాయ సంఘం – ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో చేపట్టిన దశలవారీ పోరాట కార్యక్రమంలో భాగంగా
జనవరి 30న మండల తహసిల్దార్ లకు వినతి పత్రాల సమర్పణ,
ఫిబ్రవరి 10న అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నా..
ఫిబ్రవరి 25న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించడం
జరుగుతుంది.
ఈ ఉద్యమ కార్యాచరణలో ఎస్ టి యు రాష్ట్ర జిల్లా వివిధ మండలాల నాయకులు ,ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే ఉద్యోగ, ఉపాధ్యాయ,పెన్షనర్ల ఐక్య పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ ఎం ఏ ఎస్ ఎన్ లావరాజు పెదపూడి మండల ప్రధాన కార్యదర్శి పోతురాజు సాయి వెంకటేశం , పడాల వెంకట శేషారెడ్డి , పడాల సత్యనారాయణ రెడ్డి, మేడపాటి కాశి ఈశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం చెబుతున్నట్టుగా ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయంగా ఇవ్వవలసిన పిఆర్సి ఇవ్వడానికి మభ్యంతర భృతి ప్రకటించడానికి బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వం వద్ద నిధులు లేవని మీరు నమ్ముతున్నారా?! మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి












Comments